ఎముకలు, దంతాలు, కండరాలు ఆరోగ్యంగా ఉండటానికి మన శరీరానికి విటమిన్ డి చాలా అవసరం. ఈ విటమిన్ డి సూర్యరశ్మి ద్వారా బాగా అందుతుంది. ఈ పోషకం మన శరీరంలో కాల్షియం, ఫాస్పేట్ మొత్తాన్ని నియంత్రించడానికి సహాయపడుతుంది. బలమైన ఎముకలను నిర్మించేందుకు ఈ పోషకం చాలా చాలా అవసరం. విటమిన్ డి తక్కువగా ఉంటే ఎముకలు బలహీనపడతాయి. అంతేకాదు ఇది బోలు ఎముకల వ్యాధికి, ఎముకల పగుళ్లకు దారితీస్తుంది. ఈ విటమిన్ డి లోపం ఇతర వ్యాధులకు కూడా కారణమవుతుందంటున్నారు నిపుణులు. ఈ విటమిన్ డి లోపం పిల్లల్లో రికెట్స్ కు కూడా కారణమవుతుంది.