కిచెన్ లో మొక్కలు పెడితే ఏమౌతుంది..?

First Published May 2, 2024, 12:08 PM IST

అసలు కిచెన్ లో మొక్కలను పెంచుకోవచ్చా..? దాని వల్ల మనకు లాభం కలుగుతుందా లేక నష్టం కలుగుతుందా? దీనిపై జోతిష్య నిపుణులు ఏం చెబుతున్నారో ఓసారి చూద్దాం..

ఇంట్లో మొక్కలు పెంచుకునే అలవాటు చాలా మందిలో ఉంటుంది. ప్రస్తుతం ఇండోర్ ప్లాంట్స్  అందుబాటులో ఉంటున్నాయి కాబట్టి... ఇంట్లో చాలా ప్లేసుల్లో ఈ మొక్కలను పెట్టుకుంటూ ఉంటారు. ఇండోర్ ప్లాంట్స్ చూడటానికి అందంగా ఉంటాయి.. పెద్దగా మెయింటెన్స్ కూడా ఉండదు కదా అనుకుంటారు. ఎక్కువ మంది కిచెన్ లో ఈ మొక్కలను పెడుతూ ఉంటారు. అయితే.. జోతిష్యశాస్త్రం ప్రకారం... అసలు కిచెన్ లో మొక్కలను పెంచుకోవచ్చా..? దాని వల్ల మనకు లాభం కలుగుతుందా లేక నష్టం కలుగుతుందా? దీనిపై జోతిష్య నిపుణులు ఏం చెబుతున్నారో ఓసారి చూద్దాం..

జోతిష్యశాస్త్రం ప్రకారం.. మనం ఆహారాన్ని అన్నపూర్ణ దేవితో పోలుస్తాం.  అంటే.. ప్రతి ఇంట్లో కిచెన్ లో అన్నపూర్ణ తల్లి నివసిస్తుందని నమ్ముతారు.  అంతేకాకుండా.. పొయ్యి అంటే.. అగ్ని దేవుడు కూడా  వంట గదిలో ఉంటాడని నమ్ముతారు. ఇక వంటింట్లో ఉండే ప్రతి వస్తువు ఏదో ఒక గ్రహానికి సంబంధం కలిగి ఉంటుంది.


అందుకే... మొక్కలను కిచెన్ లో పెట్టుకోకూడదట. గ్రహాలను పట్టి మాత్రమే మొక్కలను కిచెన్ లో పెట్టుకోవాలట. తప్పుగా ఏ మొక్కలు పడితే అవి పెట్టడం వల్ల...  ఇంట్లో ఇతర గ్రహ దోషాలు వచ్చే అవకాశం ఉంటుందట. అంతేకాదు... అన్నపూర్ణ దేవికి కూడా కోపం వస్తుందట. గ్రహదోషాలు ఇతర సమస్యలు తెచ్చి పెడుతూ ఉంటాయట

లేదు... మీకు వంట గదిలో మొక్కలు పెట్టుకోవడం ఇష్టం అనిపిస్తే... కిచెన్ మూలల్లో కాకుండా.. మధ్యలో  పెట్టుకోవడం అలవాటు చేసుకోండి. లేదు.. ఇంట్లో మధ్యలో పెట్టుకోవడం కుదరదు అంటే  కిచెన్ కి ఆనుకొని ఉండే బాల్కనీలో పెట్టుకోవాలి. బాల్కనీలో మొక్కలు ఉంటే శుభపరిణామంగా భావిస్తారు.

click me!