Health Tips: తలనొప్పి, కళ్లనొప్పితో బాధపడుతున్నారా? ఇవిగో ఈ టిప్స్ మీ కోసమే..!

First Published Aug 9, 2022, 4:55 PM IST

Health Tips: మెడిసిన్స్ కంటే తొందరగా కొన్ని ఇంటి చిట్కాలతో కూడా తలనొప్పిని, కళ్ల నొప్పిని తగ్గించుకోవచ్చు.  

ఈ రోజుల్లో విపరీతమైన పని ఒత్తిడి, ఆందోళన, ఉద్రిక్తతల కారణంగా చాలా మంది తలనొప్పి తో బాధపడుతున్నారు. అయితే కొంతమంది ఒక్క తలనొప్పితోనే బాధపడితే.. ఇంకొంతమందికి మాత్రం తలనొప్పితో పాటుగా కంటినొప్పి కూడా ఉంటుంది. నిజానికి ఈ తలనొప్పి, కంటి నొప్పి రోజంతా ఒత్తిడి, మైగ్రేన్, సైనస్ లు కారణం కావొచ్చు. అయితే కొన్ని రకాల మందులతో పాటుగా ఇంటి చిట్కాలతో కూడా ఈ నొప్పి నుంచి ఉపశమనం పొందొచ్చు. తలనొప్పి, కంటి నొప్పి నుంచి ఎలా బయటపడాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఆయిల్ మసాజ్ 

తలలో నొప్పి ఉన్నా, కళ్లలో నొప్పి ఉన్నా.. ఆయిల్ మసాజ్ చేయడం వల్ల చాలా ఉపశమనం లభిస్తుంది. నిజానికి కొన్ని సంవత్సరాల నుంచి తలనొప్పిని తగ్గించకోవడానికి ఈ ఆయిల్ మసాజ్ పద్దతినే ఉపయోగిస్తున్నారు. తీవ్రమైన తలనొప్పి ఉన్నప్పుడు తలకు కొద్దిని నూనెను పట్టించి నెమ్మదిగా మసాజ్ చేస్తే మంచి వెంటనే ఉపశమనం లభిస్తుంది.
 

sleeping

 తగినంత నిద్ర 

శరీరానికి సరిపడా నిద్రలేకపోయినా.. తలనొప్పి వస్తుంది. అలాగే మీరు ఎక్కువ మొబైల్ ఫోన్ చూసినా, తలనొప్పి నొప్పి, కళ్ల  నొప్పి కలుగుతాయి. అందుకే దీనినుంచి బయటడాలంటే ఫోన్లను పక్కన పెట్టేసి హాయిగా నిద్రపోండి. రోజుకు 7 నుంచి 8 గంటల నిద్ర ఉండేట్టు చూసుకోండి.  ఇది తలనొప్పి సమస్యను తొలగిస్తుంది.
 

ధ్యానం 

ధ్యానం మన శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. ప్రతిరోజూ ధ్యానం చేయడం వల్ల ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతారు. అలాగే తలనొప్పి కూడా తగ్గిపోతుంది. ప్రతిరోజూ కొన్ని నిమిషాల పాటు ధ్యానం చేయడం వల్ల మీ తలనొప్పి, కంటి నొప్పి తగ్గిపోతాయి. 

healthy food

మంచి ఆహారం 

తలనొప్పితో బాధపడేవారు మీరు తినే ఆహారం, జీవనశైలిపై శ్రద్ధ పెట్టాలి. యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే ఆహారాలను రోజూ తినాలి. అలాగే నిమ్మకాయ, వెల్లుల్లి వంటి వాటిని ఆహారంలో చేర్చుకోవాలి. 
 

ఘాటైన వాసనలు రాకుండా చూసుకోండి

కొంతమందికి ఘాటైన వాసనలు పీల్చితే కూడా విపరీతమైన తలనొప్పి వస్తుంది. అందుకే సువాసన ఎక్కువ వచ్చే సుగంధ ద్రవ్యాలను పీల్చకూడదు. క్లీన్ చేసే కొన్ని ఉత్పత్తులు కూడా తలనొప్పిని కలిగిస్తాయి. ఈ రకమైన వాసనలు వచ్చే వాటికి దూరంగా ఉండండి. 
 

click me!