'కొణిదెల పవన్ కల్యాణ్ అనే నేను' : మెగా ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించే వీడియో

By Arun Kumar PFirst Published May 2, 2024, 1:21 PM IST
Highlights

సినిమాల్లో సూపర్ స్టార్ గా వున్న పవన్ కల్యాణ్ ను రాజకీయాాల్లోనూ పవర్ ఫుల్ స్థానంలో చూడాలి...  ఇందుకోసమే మెగా అభిమానులు, జన సైనికులు పనిచేసేది. అలాంటిది వాళ్ళకు పూనకాలు తెప్పించే వీడియో ఒకటి బయటకు వచ్చింది. 

హైదరాబాద్ : 'కొణిదెల పవన్ కల్యాణ్ అనే నేను... దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను' ఎప్పటికైనా ఈ మాట వినాలన్నది జనసైనికులు, మెగా ఫ్యాన్స్ కోరిక. తమ అభిమాన నటుడు, నాయకుడు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తుంటే కనులారా చూడాలనుకుంటారు. ఇప్పటికే సినిమాల్లో టాప్ హీరోగా కొనసాగుతున్న పవన్ కల్యాణ్ ను రాజకీయాల్లోనూ టాప్ లో నిలబెట్టాలన్నది అభిమానుల కోరిక. పవర్ స్టార్ పవర్ లోకి వస్తే... రాష్ట్రానికి సుపరిపాలన అందించగలడని మెగా ఫ్యాన్స్ గట్టిగా నమ్ముతున్నారు. 

అయితే ఎన్నికలకు ముందే 'పవన్ కల్యాణ్ అనే నేను' అంటూ జనసేనాని ప్రమాణ స్వీకారం చేసారు. పిఠాపురం ఎమ్మెల్యేగా పోటీచేస్తున్న పవన్ కల్యాణ్ ఇటీవల నామినేషన్ వేసారు. ఈ సందర్బంగా ఆయనతో రిటర్నింగ్ అధికారి ప్రమాణం చేయించారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోను చూసిన మెగా ఫ్యాన్స్ ఇలాగే ముఖ్యమంత్రిగా కూడా ప్రమాణస్వీకారం చేస్తే ఎంత బావుంటుంది అని అనుకుంటున్నారు. 

జనసేన పార్టీ కూడా పవన్ కల్యాణ్ ను మరింత ఎలివేట్ చేసేందుకు ఈ వీడియోను వాడుకుంటోంది. నామినేషన్ సమయంలో పవన్ చేసిన ప్రమాణానికి అదిరిపోయే ఆడియోను జోడించి సోషల్ మీడియాలో మాధ్యమాల్లో పోస్ట్ చేసింది. ఈ వీడియో మెగా ఫ్యాన్స్, జనసేన నాయకులు, కార్యకర్తలకు పూనకాలు తెప్పిస్తోంది. 

కొణిదెల పవన్ కళ్యాణ్ అను నేను !
pic.twitter.com/yjBc0uYKG0

— JanaSena Party (@JanaSenaParty)

 

ముఖ్యమంత్రి పదవిపై పవన్ కామెంట్స్ : 

ఆంధ్ర ప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ, బిజెపిలతో జనసేన పార్టీ పొత్తు పెట్టుకుంది. ఈ మూడు పార్టీలు కలిసి కూటమిగా ఏర్పడి ఎన్నికలకు వెళుతున్నాయి.  ఈ క్రమంలోనే కూటమి విజయం సాధిస్తే ముఖ్యమంత్రి ఎవరు? పవన్ కల్యాణ్ కు ఏ పదవి దక్కుతుంది? అనేదానిపై చర్చ సాగుతోంది. ఈ క్రమంలో పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. 

ప్రస్తుతం జనసేన పార్టీకి మంచి పట్టున్న 21 అసెంబ్లీ, 2 స్థానాల్లో జనసేన పోటీ చేస్తోంది. అన్నింటికి అన్ని గెలుచుకుని సత్తా చాటాలని... అలా జరగాలంటే నాపై అభిమానం ఓట్లుగా మార్చాల్సిన అవసరం వుందని ఇటీవల పవన్ అన్నారు. మన స్థానాల్లో గెలవడమే కాదు కూటమి అభ్యర్థులను కూడా గెలిపించుకోగలిగితేనే మనం ముఖ్యమంత్రి పదవిని అడగలమని పవన్ అన్నారు. 

చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసేందుకే పవన్ కల్యాణ్ పనిచేస్తున్నారన్న వైసిపి నాయకుల ఆరోపణలకు కూడా పవన్ కౌంటర్ ఇచ్చారు. జనసేన  పార్టీ నాయకులు, కార్యకర్తల ఆత్మగౌరవమే నాకు ముఖ్యం... దాన్ని దెబ్బతీసే పనులు ఎప్పటికీ చేయనని అన్నారు. టిడిపి వెనకాల జనసేన నడవడం లేదు...కలిసి నడుస్తోందన్నారు. ముందు కూటమిని గెలిపించండి... సీఎం ఎవరు కావాలన్నది చంద్రబాబు, నేను మాట్లాడుకుంటామని పవన్ కల్యాణ్ అన్నారు. 

 
 

click me!