గరుడ పురాణం ప్రకారం.. ఈ పనులను మధ్యలో ఆపేస్తే ఏమౌతుందో తెలుసా?

First Published | May 2, 2024, 1:20 PM IST

 మొదలుపెట్టిన పనులను మధ్యలో వదిలేస్తే...  చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిందేనట. మరి ఎలాంటి పనులను మధ్యలో ఆపకూడదో, దీని గురించి గరుడ పురాణం ఏం చెబుతుందో చూద్దాం...
 


హిందూ ధర్మంలో గరుడ పురాణానికి చాలా విశిష్టత ఉంది.  ఒక వ్యక్తి జీవన, మరణాలను ఈ గరుడ పురాణమే నిర్ణయిస్తుందని నమ్ముతారు. హిందూ మతంలో ఉన్న 18 పురాణాల్లో ఈ గరుడపురాణం కూడా ఒకటి. అయితే.. ఈ ఫురాణం ప్రకారం.. మనం కొన్ని పొరపాట్లు చేయకూడదు. చేస్తే.. దాని ఫలితం మరణించిన తర్వాత అయినా అనుభవించాల్సిందేనట. అందుకే.. పొరపాటున కూడా కొన్ని పనులను మొదలుపెట్టి.. మధ్యలో ఆపకూడదట. మొదలుపెట్టిన పనులను మధ్యలో వదిలేస్తే...  చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిందేనట. మరి ఎలాంటి పనులను మధ్యలో ఆపకూడదో, దీని గురించి గరుడ పురాణం ఏం చెబుతుందో చూద్దాం...
 

1.లోన్ రీపేమెంట్.. మీరు ఎవరి దగ్గరైనా వడ్డీకి డబ్బులు అప్పు తీసుకుంటే... వాటిని గుడువులోగా  తిరిగి ఇచ్చేయాలట.  ఆ పనిని అసంపూర్తిగా వదిలేయడం వల్ల... వడ్డీలు పెరిగిపోయి.. తర్వాత చాలా ఇబ్బందులకు దారితీస్తుందట. కాబట్టి.. గరుడపురాణం ప్రకారం ఈ తప్పు అస్సలు చేయకూడదు. వడ్డీ చెల్లించే పని మధ్యలో ఏ రోజూ వదిలేయకూడదు.
 

Latest Videos


Garuda Purana

2.ట్రీట్మెంట్...
 చాలా మంది చేసే పొరపాటు ఇది.  ఆరోగ్యం సరిగా లేదని ట్రీట్మెంట చేయించుకుంటారు. ఆ ట్రీట్మెంట్ పూర్తికాకముందే.. తగ్గిపోయిందిలే అని మధ్యలోనే వదిలేస్తారు. కానీ గరుడ పురాణం ప్రకారం ఈ పొరపాటు అస్సలు చేయకూడదట. చికిత్సను అసంపూర్తిగా వదిలివేయడం వలన వ్యాధి మునుపటి కంటే ప్రాణాంతకమవుతుంది, ఇది మరణ ప్రమాదాన్ని కూడా పెంచుతుంది.
 

Garuda Purana

3.మంటలు పూర్తిగా ఆపాలి..

ఎక్కడైనా అగ్నిప్రమాదం జరిగినప్పుడు.. మంటలను పూర్తిగా ఆర్పేయాలి. అలా కాకుండా... సగం సగం ఆపడం లేదంటే.. ఏ కాస్త మంటలు ఆర్పకపోయినా మళ్లీ ఆ మంటలు పెద్దగా మారి.. ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కాబట్టి.. మంటలు ఆర్పడం మధ్యలో అస్సలు ఆపకూడదని గరుడ పురాణం చెబుతోంది.

Garuda Purana

4.శత్రువులను వదిలేయండి...
మీకు ఎవరితో అయినా శత్రుత్వం ఉంటే... ఆ శత్రుత్వాన్ని కూడా మధ్యలో వదిలేయకూడదట. దానిని ఏదో ఒక విధంగా ముగించేయాలి. లేదంటే.. శత్రువు నుంచి ప్రమాదం ఎటు నుంచి అయినా ఎప్పుడు అయినా పొంచి ఉండే అవకాశం ఉందని గరుడ పురాణం చెబుతోంది. 
 

click me!