రోజా, లయ, గౌతమి కూతుర్లను చూశారా..? హీరోయిన్లను మించిన అందం వారి సొంతం..

First Published | May 2, 2024, 12:46 PM IST

అందంలో హీరోయిన్లను మించిపోయారు వారి కూతుర్లు.. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తే.. స్టార్ హీరోయిన్లను మించిపోయేలా ఉన్నారు. రోజా, లయ, గౌతమి, నదియాలాంటి స్టార్ హీరోయిన్ల కూతుర్ల బ్యూటిఫుల్ పిక్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. 
 

నటి రోజా హీరోయిన్ గా స్టార్ డమ్ ను చూసింది..  2002లో తమిళ దర్శకుడు, నిర్మాత ఆర్.కె. సెల్వమణిని పెళ్ళి చేసుకుంది.  ఈ దంపతులకు ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. కూతురు అనుషుమాలిక సెల్వమణి అమెరికాలో చదువుతోంది. రోజాను మించిన గ్లామర్ తో.. హీరోయిన్లకుపోటీ ఇచ్చేలా ఉంది అనుషుమాలిక. అంతే కాదు ఆమె  ది ఫ్లేమ్ ఇన్ మై హార్ట్ అనే పుస్తకాన్ని కూడా రాసింది. రోజా తన కూతురితో ఉన్న ఫోటో ఎప్పటికప్పుడు ఇంటర్నెట్‌లో ట్రెండ్ అవుతోంది.

టాలీవుడ్ లో రిచ్చెస్ట్ హీరో ఎవరో తెలుసా..? ఆయన ఆస్తులు అన్ని వేల కోట్లా..? వైరల్ న్యూస్..

తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న హీరోయిన్ లయ. అందం, అభినయంతో అప్పట్లో ప్రేక్షకులను కట్టిపడేసింది. టాలీవుడ్ లో దాదాపు పదేళ్లు స్టార్ హరోయిన్ గా వెలుగు వెలిగిన ఆమె.. తరువాత పెళ్లి చేసుకుని అమెరికాలో సెటిల్ అయ్యింది.లయ దంపతులకు ఇద్దరు పిల్లలు. కూతురు శ్లోకా ఇప్పటికే బాలనటిగా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తల్లిలాగే శ్లోక కూడా ఎంతో అందంగా ఉంటుంది.  ఇటీవల తన కూతురితో కలిసి ఓ ఫోటోను షేర్ చేసింది లయ. అందులో వారిద్దరు అచ్చం అక్కచెల్లెళ్లుగా ఉన్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. తన కూతురిని కూడా హీరోయిన్ ను చేస్తానంటోంది లయ. 

బాహుబలి 3 కి ముహూర్తం ఫిక్స్..? క్లారిటీ ఇచ్చేసిన రాజమౌళి..


అలనాటి అందాల తార  గౌతమి గుర్తుండే ఉంటుంది. తెలుగతమిళంలో స్టార్ హీరోల సరసన మెరిసిన ఈ బ్యూటీ.. 1998లో సందీప్ భాటియాను వివాహం చేసుకుంది. ఈ దంపతులకు 1999లో సుబ్బులక్ష్మి భాటియా అనే కుమార్తె ఉంది. అయితే అదే ఏడాది గౌతమి తన భర్తకు విడాకులు ఇచ్చింది. గౌతమి కూతురు కూడా ఆమెలాగానే అందానికి అందం అద్దినట్టుగా ఉంటుంది. ప్రస్తుతం గౌతమి కూతురు ఫోటోలు సోషల్ మీడియాలో  వైరల్ అవుతున్నాయి.   నెక్స్ట్ హీరోయిన్ రెడీ అయిందని పలువురు కామెంట్లు కూడా పెడుతున్నారు. 

రూమ్ బుక్ చేస్తా వస్తావా అన్నారు.. నటి వరలక్ష్మి శరత్ కుమార్ సంచలన వ్యాఖ్యలు..

ఇక మరో సీనియర్ హీరోయిన్  నదియా గురించి కూడా ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ ఏజ్ లో కూడా గ్లామర్ విషయంలో ఏమాత్రం తగ్గని నదియా.. 1988లో శిరీష్‌ అనే వ్యక్తిని  పెళ్లాడింది. ఈ దంపతులకు 2 కుమార్తెలు ఉన్నారు. నదియా తన కుటుంబంతో ఉన్న ఫోటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుండగా.. వాటిని చూసిన అభిమానులు నదియాకు ఇంత పెద్ద కూతుళ్లు ఉన్నారని అని షాక్ అవుతున్నారు. వారిద్దరు కూడా గ్లామర్ విషయంలో తల్లికి పోటీ ఇస్తున్నారు. హీరోయిన్లు గా ఎంటర్ అయితే.. ఇండస్ట్రీని ఏలేలా కనిపిస్తున్నారు. 
 

నటి మధుబాల 1999లో ఆనంద్ షాను వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు అమయా షా మరియు కయా షా అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మధుబాల తరచూ తన కూతుళ్లతో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది. వారు కూడా మధుబాల మాదిరిగానే బ్యూటీని నిలబెట్టుకుంటూ.. హీరోయిన్లను మించిన గ్లామర్ తో మెరిసిపోతున్నారు. 

Latest Videos

click me!