మూత్రాశయంలో నొప్పి, మంట కేవలం యూరినరీ ఇన్ఫెక్షన్ వల్లే కాదు.. ఈ కారణాల వల్ల కూడా వస్తుంది..

First Published Aug 16, 2022, 9:51 AM IST

యూరినరీ ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఆడవారిలోనే కనిపిస్తుంది. దీనివల్ల మూత్రవిసర్జన చేస్తున్నప్పుడు తీవ్రమైన నొప్పి కలుగుతుంది. అయితే ఈ సమస్య ఒక్క ఇన్ఫెక్షన్ వల్లే కాదు ఇతర కారణాల వల్ల కూడా వస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 
 

urinary infection

కొంతమందికి మూత్రవిసర్జన సమయంలో తీవ్రమైన నొప్పి కలుగుతుంది. అంతేకాదు ఇది తరచుగా మూత్రానికి దారితీస్తుంది. అది కూడా కొద్ది కొద్దిగా. దీంతో బాగా అలసిపోతారు. సాధారణంగా కనిపించే ఈ నొప్పి, మండుతున్న అనుభూతినే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ అంటారు. కొంతమంది గైనకాలజిస్టుల అభిప్రాయం ప్రకారం.. 30 శాతం మంది మహిళలు ఈ సమస్య నుంచి బయటపడేందుకు డాక్టర్ ను సంప్రదిస్తున్నారు. అయినా ఈ సమస్య మగవారికంటే ఆడవారికే ఎక్కువగా వస్తుంది. అయితే ఈ సమస్య సాధారణంగా మూత్రాశయంలో సంక్రమణ వల్ల వస్తుంది.  అంతేకాదు ఇది  ఇంకా ఇతర కారణాల వల్ల కూడా వస్తుందని నిపుణులు చెబుతున్నారు. 

urinary infection

ఇవి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వల్ల మాత్రమే కాకపోవచ్చు. మూత్రాశయంలోని వేరే వేరే అవయవాల ఇన్ఫెక్షన్ల వల్ల కూడా ఈ సమస్యవస్తుందని నిపుణులు చెబుతున్నారు. కొన్నిసార్లు వేరే ప్రమాదకరమైన సమస్యకు సంకేతం కూడా కావొచ్చంటున్నారు నిపుణులు. అందుకే మీకు తరచుగా మూత్రం వస్తుంటే వెంటనే డాక్టర్లను సంప్రదించడం మర్చిపోకూడదు. ఇంతకీ ఈ సమస్యకు ఇతర కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Urinary Infection

మొదటిది మూత్రనాళ సంక్రామ్యత దీనికి అత్యంత సాధారణ కారణం. ఈ సమస్య మహిళల్లోనే ఎక్కువగా కనిపిస్తుంది. మూత్రానాళం ద్వారా బాక్టీరియా మూత్రాశయంలోకి ప్రవేశించినప్పుడు ఈ సమస్య పెరుగుతుంది. మూత్రాశయంలోకి వెళ్లే బ్యాక్టీరియా శరవేగంగా పెరుగుతుంది. అందుకే విపరీతమైన నొప్పి కలుగుతుంది. ఇలాంటి సమయంలోనే మూత్రం వాసన రావడంతో పాటుగా రంగు మారుతుంది. దీనికి చికిత్స తప్పకుండా తీసుకోవాలి. 

లైంగికంగా సంక్రమించే సంక్రామ్యత

మూత్రవిసర్జన వల్ల కలిగే సంక్రామ్యతను కేవలం యుటిఐ ( urinary tract infection)గా పరిగణించలేం అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇది లైంగికంగా సంక్రమించే సంక్రమణ (STI) కూడా కావచ్చు.  ఇలాంటి ఇన్ఫెక్షన్ బారిన పడ్డవారు జననేంద్రియాల్లో రక్తస్రావం, మంట, గాయాలు, దురద వంటి సమస్యలు కలుగుతాయి. దీనికి సొంత వైద్యం చేయకూడదు. వెంటనే డాక్టర్ ను సంప్రదించాలి.

సిస్టిటిస్ 

సిప్టిటిస్ అనేది మూత్రాశయంలో కనిపించే ఒక సమస్య. ఇది బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కారణంగా వస్తుంది. దీనివల్ల కూడా మూత్ర విసర్జన చేస్తున్నప్పుడు విపరీతమైన నొప్పి కలుగుతుంది. దీనికి మెడిసిన్స్ ను వాడితే నయం అవుతుంది. 
 

మూత్రపిండాల సంక్రామ్యత

మూత్ర విసర్జన  సమయంలో మూత్రంతో పాటుగా రక్తం పడి.. నొప్పి కలిగినట్టైతే  సంక్రామ్యత మూత్రపిండాలకు చేరుకుందని అర్థం  చేసుకోవాలి. దీనివల్ల కడుపు నొప్పి, జ్వరం,  జలుబు వంటివి సమస్యలు వస్తాయి. దీనికి సకాలంలో చికిత్స తీసుకోకపోతే ఇది మరింత ప్రమాదకరంగా మారుతుంది. ఎందుకంటే ఈ ఇన్ఫెక్షనన్ మూత్రపిండాల నుంచి రక్తానికి వ్యాపించొచ్చు. ఇది ప్రాణాల మీదికి వస్తుంది. 
 

మూత్రపిండాలు లేదా మూత్రాశయంలో రాళ్లు

మూత్రంలోని ఖనిజాలన్నీ గట్టిపడి రాళ్లుగా ఏర్పడతాయి. ఈ రాళ్లు మూత్రాశయంలోనే కాదు మూత్రపిండాల్లో కూడా ఏర్పడతాయి.  మూత్రాశయంలో ఏర్పడిన రాళ్లు మూత్రాశయం అంచుకు చేరుకొని, మూత్రపిండాల్లో ఒక నిర్దిష్ట ప్రదేశంలో ఆగిపోతే మూత్రం బయటకు రాదు. అప్పుడు నొప్పి కలుగుతుంది. దీనికి కూడా చికిత్స చాలా అవసరం. 
 

యోని ఉత్సర్గ

వయస్సు పెరుగుతున్న కొద్దీ మహిళల జననేంద్రియాలు పొడిబారుతుంటాయి. ఇలాంటి సమయంలో వీరు సెక్స్ లో పాల్గొంటే గాయపడతారు. ఇక అక్కడి నుంచి నుంచి మూత్రం వచ్చినప్పుడు తీవ్రమైన నొప్పి కలుగుతుంది. రుతువిరతి సమయంలో జననేంద్రియాల లోపలి చర్మం సన్నగా మారుతుంది. అందుకే ఈ సమస్య వస్తుంది. 

click me!