కాఫీని ఈ సమస్యలున్నవారు తాగితే డేంజర్.. !

First Published Aug 24, 2022, 9:49 AM IST

టీ కంటే కాఫీని తాగే వారు ఎక్కువగా ఉంటారు. ఎందుకంటే కాఫీ టీ కంటే టేస్టీగా ఉంటుంది. అయితే కాఫీని కొన్ని సమస్యలున్న వారు అస్సలు తాగకూడదు.. 
 

కాఫీ అంటే పడి చచ్చిపోయేవాళ్లున్నారు. అందుకే ఉదయం కాఫీని తాగనిదే  ఏ పని చేయరు. అయినా ఈ రోజుల్లో టీ కంటే కాఫీనే ఎక్కువగా తాగుతున్నారు కదా.. కాఫీ తాగడం వల్ల బోలెడు ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. దీన్ని తాగితే తక్షణమే ఎనర్జీ వస్తుంది. అలాగే శరీరం కూడా హుషారుగా మారుతుంది. దీని వల్ల ప్రయోజనాలు ఎలా అయితే ఉన్నాయో.. ఆరోగ్య నష్టాలు అంతకంటే ఎక్కువగానే ఉన్నాయి. నిజానికి కాఫీలో ఉండే కెఫిన్ మన ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ఇది శరీరంపై ప్రతికూల ప్రభావాన్నిచూపెడుతుంది. ఇవన్నీ తెలిసినా ఈ అలవాటు మానుకోనివారు లేకపోలేరు. అయితే కాఫీని కొన్ని అనారోగ్య సమస్యలున్న వారికి విషంతో సమానం. వారెవరెవరో ఇప్పుడు తెలుసుకుందాం.. 

అరిథ్మియా సమస్య ఉన్నవారు

గుండెకు సంబంధించిన ఒక రకమైన సమస్యే అరిథ్మియా. ఈ సమస్య ఉన్నవారికి గుండె ఇతరుల లాగా సాధారణంగా కొట్టుకోదు.  ఇకపోతే ఈ సమస్యతో బాధపడేవారు కాఫీని ముట్టనే ముట్టకూడదు. ఎందుకంటే కాఫీలో ఉండె కెఫిన్ వీరికి చేటు చేస్తుంది. ఇది బీపీని అమాంతం పెంచుతుంది. అందుకే వీళ్లు కాఫీని తాగడం మానేయాలి. 
 

గర్భిణులు

గర్భిణీ స్త్రీలు ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వీరు తీసుకునే ఫుడ్ వీరి కడుపులో పెరుగుతున్న బిడ్డకు కూడా చేరుతుంది. ముఖ్యమైన విషయం ఏమిటంటే గర్భిణులు కాఫీని తాగితే గర్భస్రావం అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక కాఫీని తాగే గర్భిణుల్లో పోషకలోపం కూడా ఉంటుంది. అందుకే వీళ్లు కాఫీని అతిగా తాగకూడదు. మొత్తానికే మానేస్తే ఏ ప్రమాదం జరిగే అవకాశం మొత్తమే ఉండదు. 
 

బాలింతలు

పాలిచ్చే తల్లులు కూడా కాఫీని తాగకూడదు. దీన్ని తాగడం వల్ల బాడీలో నీటి శాతం తగ్గుతుంది. దీంతో వీరు డీహైడ్రేషన్ బారిన పడతారు. ముఖ్యమైన విషయం ఏమింటే బాలింతలు కాఫీని తాగితే మూత్రవిసర్జన ఎక్కువ సార్లు చేయాల్సి వస్తుంది. దీనివల్ల శరీరంలో నీటి శాతం చాలా తక్కుతుంది. అందుకే వీరు కాఫీని తాగడకూడదని నిపుణులు చెబుతున్నారు. 
 

నిద్రలేమి

నిద్రలేమి లేని పోని రోగాలను పుట్టించడంలో ముందుంటుంది.  ఈ సమస్యను ఎంత తొందరగా తగ్గించుకుంటే అంత మంచిది. ఇక నిద్రలేమి సమస్యను ఫేస్ చేస్తున్నవారు కాఫీని తాగకపోవడమే మంచిది. ఎక్కువ సార్లు తాగడం ఇంకా డేంజర్. కాఫీ శరీరానికి కాస్త ఎనర్జీని ఇచ్చినా.. ఇది మీ నిద్రను మరింత దూరం చేస్తుంది. ఎందుకంటే కాఫీలో పుష్కలంగా ఉండే కెఫిన్ నాడీ వ్యవస్థను చురుగ్గా మారుస్తుంది. దీంతో రాత్రిళ్లు అస్సలు నిద్రపట్టదు. అందుకే కాఫీని ఎప్పుడూ పగటి పూటే తాగాలి. 
  

click me!