రాఘవేంద్రరావుని పట్టుకుని క్రిస్మస్‌ తాత అనేసిన అనుష్క శెట్టి.. స్వీటీ మాటలకు దర్శకేంద్రుడి రియాక్షన్‌ ఏంటంటే

Published : May 03, 2024, 06:12 PM IST

అనుష్క శెట్టి.. రాఘవేంద్రరావుపై షాకింగ్‌కి కామెంట్‌ చేసింది. ఆయన్ని చూసిన తన తొలి ఎక్స్ పీరియెన్స్ ని షేర్‌ చేసుకుంది. అందరికి పెద్ద షాకిచ్చింది.   

PREV
18
రాఘవేంద్రరావుని పట్టుకుని క్రిస్మస్‌ తాత అనేసిన అనుష్క శెట్టి..  స్వీటీ మాటలకు దర్శకేంద్రుడి రియాక్షన్‌ ఏంటంటే

అనుష్క శెట్టి కొంత గ్యాప్‌ తర్వాత ఇప్పుడు మళ్లీ స్పీడ్‌ పెంచింది. వరుసగా సినిమాలు చేస్తూ బిజీ అవుతుంది. ప్రస్తుతం తెలుగులో ఓ మూవీ, మలయాళంలో ఓ చిత్రం చేస్తుంది. లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలతో దూసుకుపోతుంది. పెద్ద హీరోల సరసన, కమర్షియల్‌ సినిమాలకు నో చెబుతూ తన ప్రత్యేకతని చాటుకుంటుంది. హీరోలకు ధీటుగా రాణించే ప్రయత్నం చేస్తుంది.  
 

28

అనుష్క శెట్టి 2005లో కెరీర్‌ ప్రారంభమైంది. నాగార్జున నటించిన `సూపర్‌`సినిమాతో హీరోయిన్‌గా తెలుగు తెరకి పరిచయం అయ్యింది. పూరీ జగన్నాథ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం పెద్దగా ఆడలేదు. కానీ టాలీవుడ్‌కి స్వీటి దొరికేసింది. అందాల భామ దొరికింది. దీంతో ఈ అమ్మడి అందానికి ఫిదా అయిన మేకర్స్ హీరోయిన్‌గా తీసుకునేందుకు క్యూ కట్టారు. తక్కువ టైమ్‌లోనే స్టార్‌ అయిపోయింది అనుష్క. 
 

38

అయితే హైదరాబాద్‌కి వచ్చిన ప్రారంభంలో తన అనుభవాన్ని పంచుకుంది అనుష్క. `సూపర్‌` సినిమా కోసం ఎంపికైన తర్వాత డాన్సింగ్‌ ట్రైనింగ్‌ తీసుకుందట. అన్నపూర్ణ స్టూడియోలో డాన్స్ క్లాసులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ రోజు నాగార్జున వచ్చి ఈ రోజు ఒక స్పెషల్‌ పర్సన్‌ని కలవబోతున్నామని చెప్పాడట. దీంతో ఎగ్జైటింగ్‌గా వెయిట్‌ చేస్తుందట అనుష్క. 

48

ఈ క్రమంలో స్టెప్స్ ఎక్కుతున్నప్పుడు పై నుంచి ఓ వ్యక్తి వస్తున్నాడట. తెల్లని ప్యాంట్‌ వేసుకుని స్టెప్స్ దిగుతున్నాడు. ముందు ఆయన కాళ్లు చూసిందట. ఆ తర్వాత తెల్లటి దుస్తుల్లో మెరిసిపోతున్నా ఆయన్ని చూసిందట. ఆ పైన తెల్లటి గెడ్డం, బట్టతల చూసి అచ్చం సాంటా క్లాజ్‌(క్రిస్మస్‌ తాత)లా ఉన్నాడనుకుందట. క్రిస్మస్‌ తాతని చూసిన ఫీలింగ్‌ కలిగిందని చెప్పింది అనుష్క. 

58

ఇంతకి ఆయన ఎవరో కాదు, రాఘవేంద్రరావు. నాగార్జున చెప్పిన ఆ స్పెషల్‌ పర్సన్‌ దర్శకేంద్రుడే. మొదట అలాంటి తెల్లటి దుస్తులు, తెల్లటి గెడ్డంతో రాఘవేంద్రరావుని చూసిన అనుష్క ఆయన్ని క్రిస్మస్‌ తాత అనుకుందట. ఈ విషయాన్ని ఆ మధ్య `సౌందర్యలహరి` టాక్‌ షోలో తెలిపింది. 
 

68

అయితే రాఘవేంద్ర రావు సినిమాల జర్నీని తెలియజేస్తూ సాగే ఈ ఇంటర్వ్యూలో అనుష్క పాల్గొని రాఘవేంద్రరావుని మొదటగా చూసిన అనుభవాన్ని పంచుకుంది. ఆ సంఘటన ఎప్పటికీ మర్చిపోలేనని తెలిపింది అనుష్క. అందరి ముందు ఈ విషయం చెప్పడంతో యాంకర్‌ సుమ షాక్‌ అయ్యింది. అయితే రాఘవేంద్రరావు కూడా కాస్త ఆశ్చర్యపోయినా, నవ్వుతో కవర్‌ చేసుకున్నాడు. ఆ తర్వాత అంత సుమ వేసిన జోక్‌కి  నవ్వులు విరిసాయి. ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూ యూట్యూబ్‌లో ట్రెండ్‌ అవుతుంది. 
 

78

`సూపర్‌` చిత్రంతో హీరోయిన్‌గా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన అనుష్క `విక్రమార్కుడు` చిత్రంతో బిగ్‌ బ్రేక్‌ అందుకుని స్టార్‌ హీరోయిన్ల జాబితాలో చేరిపోయింది. నాగార్జున, ప్రభాస్‌, రవితేజలతో ఎక్కువగా సినిమాలు చేసింది. ఇక రాఘవేంద్రరావు దర్శకత్వంలో `ఓంనమో వెంకటేశాయ` చిత్రంలో నటించింది. నాగ్ ఇందులో హీరో. ఈ భక్తి రస చిత్రం పరాజయం చెందింది. 
 

88

`సైజ్‌ జీరో` సినిమా కారణంగా అనారోగ్య పాలైన అనుష్క.. కొంత కాలం గ్యాప్‌ తీసుకుంది. బయట కనిపించకుండా సినిమాలు చేసింది. చివరగా ఆమె `మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి`లోనూ అలానే మెరిసింది. ఇప్పుడు మళ్లీ వెయిట్‌ కాస్త నార్మల్‌కి వచ్చింది. దీంతో పబ్లిక్‌లో మెరిసింది. తెలుగులో `ఘాటి` చిత్రంలో నటిస్తుంది. క్రిష్‌ దర్శకుడు. అలాగే మలయాళంలో ఓ మూవీ చేస్తుంది అనుష్క. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories