రక్తంలో చక్కెర స్థాయిలు తక్కువగా ఉంటే డేంజర్.. ఈ వ్యాధులొచ్చే అవకాశం ఉంది..

First Published Nov 13, 2022, 2:04 PM IST

మన శరీరానికి చక్కెర చాలా అవసరం. ఇది శరీరానికి శక్తిని ఇస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలు తక్కువగా ఉన్నా.. ఎక్కువగా ఉన్నా ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. దీనివల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. 

చక్కెర మర శరీరానికి చాలా అవసరం. మన శరీరంలో గ్లూకోజ్ సాధారణ స్థాయిలు 80 -110 mg/dL (ప్రతి డెసిమీటర్ కు మిల్లీగ్రాములు) మధ్య ఉండాలి. 90 mg/dL ను సగటు రక్తంలో చక్కెర స్థాయిగా పరిగణిస్తారు. మీ శరీరంలో చక్కెర స్థాయి 72 మి.గ్రా/డిఎల్ లేదా అంతకంటే తక్కువ ఉంటే..అంటే.. రక్తంలో చక్కెర స్థాయిలు సాధారణం కన్నా తక్కువగా ఉండే పరిస్థితిని హైపోగ్లైసీమియా అంటారు. డయాబెటిస్ ఉన్నవారు తరచుగా షుగర్ లేబుల్ పడిపోవడాన్ని గమనించరు. ఇది మాత్రమే కాదు.. సాధారణ వ్యక్తుల రక్తంలో చక్కెర తక్కువగా ఉంటే.. ఎన్నో అనారోగ్య సమస్యలు రావొచ్చు. మరి దీని లక్షణాను ఎలా ఉంటాయి.. చికిత్స ఏంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.. 

రక్తంలో చక్కెరను గ్లూకోజ్ అని కూడా అంటారు. ఆహారాన్ని తిన్నప్పుడు గ్లూకోజ్ మీ రక్త ప్రవాహంలో కరిగిపోతుంది. ఇక్కడి నుంచి శరీరంలోని కణాలకు వెళుతుంది. క్లోమంలో ఉత్పత్తి అయ్యే ఇన్సులిన్.. కణాలు శక్తి కోసం గ్లూకోజ్ ను ఉపయోగించడానికి సహాయపడుతుంది. రక్తంలో తక్కువ చక్కెర స్థాయిలు ఉండటం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. డయాబెటిస్ ఇన్సులిన్ ఉపయోగించే శరీర సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుంది. దీని కారణంగా రక్తంలో తక్కువ చక్కెర ఉండే పరిస్థితి ఏర్పడుతుంది. అలాగే ఏదో ఒక కారణం వల్ల ఆకలితో ఉన్నవారు, తినాల్సిన దాని కంటే తక్కువ తినేవారు, ఎక్కువ ఉపవాసం ఉండేవారి రక్తంలో చక్కెర స్థాయిలు తక్కువగా ఉంటాయి. 

hypoglycemia

హైపోగ్లైసీమియా లక్షణాలు

దృష్టి మసకబారడం, చూపు తగ్గడం
గుండె దడ, మగత, కంగారు
చర్మం పసుపు రంగులోకి మారడం
తలనొప్పి
అతి నిద్రపోవడం
ఆకలి పెరగడం
ఏకాగ్రతలో ఇబ్బంది

Hypoglycemia

రక్తంలో చక్కెర స్థాయిలు సాధారణం కంటే మరీ తక్కువగా ఉంటే వెంటనే చికిత్స తీసుకోకపోతే.. రోగి అపస్మారక స్థితిలోకి వెళ్లొచ్చు. లేదా కోమాలోకి కూడా పోవచ్చు. మారుతున్న జీవనశైలి కారణంగా ఈ సమస్య పిల్లల్లో కూడా కనిపిస్తుంది. అందుకే దీని గురించి పిల్లలకు చెప్పడం మంచిది. ఈ సమస్య ఉన్న పిల్లలకు చికిత్స తప్పకుండా చేయించాలి. 

రక్తంలో తక్కువ చక్కెర స్థాయిలు ఉన్న రోగి అయితే.. మీరు కార్భోహైడ్రేట్లు ఎక్కువగా ఉండే చిరుతిండిని ఎప్పుడూ మీతోపాటే ఉంచుకోవాలి. అమెరికన్ డయాబెటిస్ అసోసియేషన్ ప్రకారం.. మీ ఆహారంలో కనీసం 15 గ్రాముల కార్బోహైడ్రేట్లు ఉండటం చాలా ముఖ్యం. డ్రై ఫ్రూట్స్, జ్యూస్ లు లేదా కుకీలను డైట్ లో చేర్చుకోవచ్చు.

హైపోగ్లైసీమియా పేషెంట్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

- ఇంటి నుంచి బయటకు వెళ్లే ముందు బ్రేక్ ఫాస్ట్ చేశారో లేదో తెలుసుకోవాలి. మార్నింగ్ తప్పకుండా అల్పాహారం తినాలి.

- మీకు మగతగా అనిపించినప్పుడు తీపి వస్తువులను వెంటనే తినండి.

- మీ రక్తంలో చక్కెరను క్రమం తప్పకుండా తనిఖీ చేయండి.

- డాక్టర్ సూచించిన మెడిసిన్స్ ను క్రమం తప్పకుండా వాడండి.

click me!