ఈ పండ్లను తొక్కతో సహా తింటే ఆరోగ్యానికి చాలా మంచిది

First Published Aug 9, 2022, 1:59 PM IST

కొన్ని రకాల పండ్ల తొక్కలు కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటి తొక్కల్లో ఉండే పోషకాలు ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గిస్తాయి. 
 

పండ్ల మన ఆరోగ్యానికి  చాలా మంచివి. అందుకోసమే వీటిని రోజూ తినాలని ఆరోగ్య నిపుణులు, డాక్టర్లు సలహానిస్తుంటారు. అయితే ఆరోగ్యంగా ఉండాలనుకున్న వారు మాత్రమే రెగ్యులర్ గా పండ్లను తింటుంటారు. ఇక మిగతావారైతే.. వారానికో లేకపోతే ఆరోగ్యం బాగాలేనప్పుడో తింటుంటారు. నిజానికి పండ్లను ఆరోగ్యం బాగులేనప్పుడే కాదు.. ఆరోగ్యంగా ఉన్నప్పటి నుంచే తింటే అనారోగ్య ప్రమాదం తప్పుతుంది. ఇక ఈ పండ్లను కొంతమంది ఏదైనా ఆహారం తిన్న తర్వాత తింటే మరికొంత మంది మాత్రం పరిగడుపున తింటుంటారు. కానీ ప్రతి పండూ ఒకేరకమైన స్వభావాన్నికలిగి ఉండదు. అందుకే పండ్లను ఏ పూట తినాలో.. తెలుసుకోవడం చాలా ముుఖ్యం. 

fruits

ఇక కొన్ని రకాల పండ్లను తొక్కలతో సహా తినేయడం మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇంతకీ ఏయే పండును తొక్కతో, తొక్క లేకుండా తినాలో ఇప్పుడు తెలుసుకుందాం..

ఆరెంజ్ ఫ్రూట్ ఎలా తినాలి:

ఆరెంజ్ పండును తొక్క తీసేసే తినాలి. అయితే పీలింగ్ చేసేటప్పుడు ఫైబర్ పోకుండా చూసుకోవాలి. ఎందుకంటే పీచు పదార్థం ఎక్కువగా ఉన్న ఈ పండును తినడం మంచిది. కొంతమంది పైభాగాన్ని తొలగించి లోపలి భాగాన్ని మాత్రమే తీసుకుంటారు. ఇది తప్పని నిపుణులు అంటున్నారు.
 

అరటి పండు: 

అరటి పండు తొక్కలో ఎన్నో పోషకవిలువలుంటాయి. పీల్స్ తో సహా అరటిపండ్లను తినే వారిని మీరెక్కా చూసిఉండరు. అయితే అరటి తొక్కల్లో ఎన్నో ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. అరటి తొక్కల్లో విటమిన్ బి6, విటమిన్ బి12, పొటాషియం, కార్బోహైడ్రేట్లు ఉంటాయి. న్నీ మీ శరీరంలోకి వెళ్లాలంటే అరటిపండును తొక్క తీయకుండా తినడం మంచిది.
 

apple

ఆపిల్: 

కొంతమంది ఆపిల్ పండ్లను తొక్క తీసి తింటుంటారు. దీన్ని తొక్క తీసేసి తినడం తప్పుడు విధానమని వైద్యులు చెబుతున్నారు. ఆపిల్ తొక్క తీస్తే దానిలో ఉండే పీచు పదార్థం పోతుంది. దీంతో మీ శరీరానికి అవసరమైన అన్ని పోషకాలు అందవు. 

ప్లమ్

ప్లమ్ పండ్లలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ పండు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది. అందుకే ఫ్రూట్ ను తొక్కతో కలిపి తినాలి. ఈ పండు మలబద్ధకం నుంచి ఉపశమనం కలిగిస్తుంది.  ఎందుకంటే దీనిలో  ఫైబర్ కంటెంట్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. 

జామపండు: 

జామపండులో కూడా ఎన్నో పోషకాలుంటాయి. దీన్ని తొక్కతో సహా తినేయడం మంచిది. ఇది గట్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. చర్మాన్ని కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది. 
 

కివిస్:

కివి పండును తొక్క తీయకుండా తినవచ్చని చాలా మందికి తెలియదు. ఈ పండు తొక్కలో ఫైబర్, ఫోలేట్, విటమిన్ ఇ, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

click me!