Ginger Benefits: 30 రోజుల పాటు అల్లం తింటే క్యాన్సర్, గుండెపోటుతో సహా ఎన్నో రోగాలు తగ్గిపోతాయి..

First Published Jun 23, 2022, 1:30 PM IST

Ginger Benefits: అల్లం  మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఒక 30 రోజుల పాటు కంటిన్యూగా అల్లాన్ని తినడం వల్ల క్యాన్సర్ తో సహా ఎన్నో ప్రాణాంతక రోగాలు తగ్గిపోతాయి. 

అల్లం ప్రపంచంలో అత్యధికంగా పండించే మసాలా దినుసుల్లో అల్లం ఒకటి.100 కంటే ఎక్కువ వ్యాధులను తగ్గించడంలో ఇది ఎఫెక్టీవ్ గా పనిచేస్తుందని పలు అధ్యయనాలు తేల్చి చెప్పాయి. ఈ మసాలా దినుసు శరీరానికి, మనస్సుకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది ఎన్నో ప్రాణాంతక రోగాలను సైతం తగ్గించగలదు. అల్లం ఏయే రోగాలను నయం చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

క్యాన్సర్ కు వ్యతిరేకంగా పనిచేస్తుంది

ఆధునిక పరిశోధన ప్రకారం.. వివిధ రకాల క్యాన్సర్‌లకు వ్యతిరేకంగా అల్లం సమర్థవంతమైన ఔషధంగా పేరు గాంచింది. అల్లం అండాశయ క్యాన్సర్ కణాలను నాశనం చేయడమే కాకుండా, ఒక రకమైన క్యాన్సర్ అయిన కీమోథెరపీకి నిరోధకతను పెంపొందించకుండా నిరోధించడాన్ని USలోని 'University of Michigan Comprehensive Cancer Center' అధ్యయనం కనుగొంది.

ఈ అధ్యయనంలో.. పరిశోధకులు అండాశయ క్యాన్సర్ కణాలపై అల్లం పొడి, అల్లం నీటిని ఉంచారు. అల్లం మిశ్రమానికి గురైనప్పుడు క్యాన్సర్ కణాలు నాశనమైనట్లు ప్రతి విచారణలో కనుగొనబడింది. అల్లం వల్ల ప్రతి కణం చనిపోయింది. దీనిని అపోప్టోసిస్ (Apoptosis) అంటారు.  అంటే అవి ఒకదానికొకటి దాడి చేసుకుంటాయి. దీనిని ఆటోఫాగి (Autofagi)అంటారు. రొమ్ము క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్, పెద్దప్రేగు క్యాన్సర్ చికిత్సలో కూడా అల్లం చాలా ఉపయోగకరంగా ఉన్నట్లు కనుగొనబడింది. 
 

డయాబెటిస్ నుంచి ఉపశమనం కలిగిస్తుంది

ఆస్ట్రేలియాలోని సిడ్నీ విశ్వవిద్యాలయంలో నిర్వహించిన ఒక పరిశోధనలో.. టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారికి అల్లం ప్రభావవంతంగా ఉంటుందని కనుగొనబడింది. అల్లంలో ఉండే పదార్థాలు ఇన్సులిన్ ఉపయోగించకుండా కండరాల కణాలకు గ్లూకోజ్ ను అందించే ప్రక్రియను పెంచుతాయి. ఈ విధంగా.. ఇది అధిక చక్కెర స్థాయిని నియంత్రించడానికి సహాయపడుతుంది.
 

గుండెపోటు నివారణ

అల్లంను చాలా సంవత్సరాలుగా గుండె జబ్బుల చికిత్సలో కూడా ఉపయోగిస్తున్నారు. చైనీస్ మెడిసిన్ లో..  అల్లంలో ఉండే ఔషద గుణాలు గుండెను బలంగా చేస్తాయని చెబుతారు. అల్లం నూనెను తరచుగా గుండె జబ్బుల నివారణ, చికిత్సలో ఉపయోగించేవారు.
 

కండరాల నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.. 

వ్యాయామం చేయడం వల్ల కండరాల నొప్పితో ఇబ్బంది పడుతున్నారా.. అయితే అల్లం ను వాడండి. వెంటనే ఉపశమనం లభిస్తుంది. వ్యాయామం కారణంగా మోచేతిలో నొప్పి ఉంటే.. రోజూ 2 గ్రాముల అల్లం తీసుకోవడం వల్ల కండరాల నొప్పిని తగ్గించుకోవచ్చు. అల్లం తక్షణ ప్రభావాన్ని చూపించనప్పటికీ, ఇది కండరాల నొప్పిలో క్రమంగా ప్రభావాన్ని చూపుతుంది.
 

ఆస్టియో ఆర్థరైటిస్ లో విశ్రాంతి

ఆస్టియో ఆర్థరైటిస్ అనేది కీళ్ళలో నొప్పి , బలహీనతను కలిగించే ఒక వ్యాధి. ఇది చాలా సాధారణం కూడా. ఈ వ్యాధికి సరైన చికిత్స లేనప్పటికీ.. ఒక పరిశోధన ప్రకారం.. కొంతమందికి మోకాలి ఆస్టియో ఆర్థరైటిస్ సమస్య ఉంటుంది. అలాటి వారికి అల్లం రసం దివ్య ఔషదంలా పనిచేస్తుంది. ఇది నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది.  అల్లం, మాస్టిక్ గమ్, దాల్చినచెక్క, నువ్వుల నూనె మిశ్రమాన్ని ఉపయోగించి ఆస్టియో ఆర్థరైటిస్ నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చని చెబుతున్నారు.
 

పీరియడ్స్ నొప్పిలో ఉపశమనం

చాలా మంది ఆడవారు పీరియడ్స్ నొప్పితో బాధపడుతుంటారు.  కొంతమందికి తక్కువ, కొంతమందికి ఎక్కువ ఉంటుంది. అల్లం పొడి రుతుస్రావం నొప్పిని తగ్గిస్తుందని నిపుణులు చెబుతారు. బహిష్టు సమయంలో రోజూ ఒక గ్రాము అల్లం పొడిని తీసుకోవాలి.
 

కొలెస్ట్రాల్ లెవల్స్ తక్కువ అవుతాయి.. 

చెడు కొలెస్ట్రాల్ గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది. ఆయిలీ ఫుడ్స్ తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి. ఈ సమస్య ఉన్నవాళ్లు రోజూ 3 గ్రాముల అల్లం పొడిని తీసుకోవాలి.

click me!