బియ్యాన్ని సరిగా ఉడికించడం కూడా తెలిసి ఉండాలి. నీరు సరిగా పోస్తేనే అన్నం సరిగా ఉడుకుతుంది. సాధారణంగా ప్రజలు అనుసరించే నియమం ఏమిటంటే బియ్యం , నీటి నిష్పత్తి 1:2 ఉండాలి. అయితే, బియ్యం రకం, వ్యక్తిగత ప్రాధాన్యతపై ఆధారపడి ఈ నిష్పత్తి మారవచ్చు. మీరు కుక్కర్‌లో లేదా ఇన్‌స్టంట్ పాట్‌లో అన్నం వండుతున్నట్లయితే , మీరు బియ్యాన్ని ముందుగా నానబెట్టినట్లయితే, అప్పుడు నీరు తక్కువ అవసరం అవుతుంది.