ఏపీలో ప్రధాని మోడీ సుడిగాలి పర్యటన.. ఏ ఏ నియోజకవర్గాల్లోనే ప్రచారం చేయనున్నరంటే..?  

By Rajesh KarampooriFirst Published May 4, 2024, 11:14 AM IST
Highlights

PM Modi: పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నారు. రెండు రోజుల పాటు సాగనున్న మోదీ ప్రచారంలో పలు నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో పాల్గొని ప్రసంగించనున్నారు.

PM Modi: సార్వత్రిక ఎన్నికల సమరం తార స్థాయికి చేరింది. పోలింగ్ సమయం దగ్గర పడుతున్న కొద్ది రాజకీయం మరింత రసవత్తరంగా మారుతుంది. గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీలు ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. ఇప్పటికే తమ హామీల తో ఓటరు మహాశయులను తమ వైపుకు తిప్పుకోవాలని భారీ హామీల వర్షాన్ని గుప్పిస్తున్నారు. తాడోపేడోగా సాగుతున్న ఎన్నికల ప్రచార పర్వంలో అగ్ర నాయకుల సైతం అలుపెరుగకుండా ప్రచార బాధ్యతలను తమ మీద వేసుకొని ప్రచారం నిర్వహిస్తున్నారు.

ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ మూడోసారి గెలుపొంది బీజేపీని అధికారంలోకి తీసుకురావాలని దేశ వ్యాప్తంగా చాలా పార్లమెంట్ నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రధాని మోడీ ఆంధ్రప్రదేశ్లో పర్యటించనున్నారు. ఈ క్రమంలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ను అధికారికంగా బిజెపి  ప్రకటించింది. ఈ నెల 6, 8 తేదీలలో బీజేపీ అగ్రనేత, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎన్నికల ప్రకారాన్ని నిర్వహించనున్నారని ఆ పార్టీ తెలిపింది.

ఈ ఎన్నికల ప్రచారంలో భాగంగా 6వ తేదీ మధ్యాహ్నం 3.30 గంటలకు ముందుగా రాజమండ్రి విమానాశ్రయానికి చేరుకోనున్నారు ప్రధాని మోదీ. అక్కడినుండి చంద్రబాబు, పవన్‎లతో కలిసి వేమగిరి సభా ప్రాంగణానికి వెళ్లనున్నారు. సభ అనంతరం సాయంత్రం 5.45 గంటల విశాఖపట్నం ఎయిర్ పోర్టుకు చేరుకోనున్నారు.

అదే రోజు సాయంత్రం అనకాపల్లిలో సీఎం రమేష్, ఎమ్మెల్యే అభ్యర్థుల గెలుపుకు కృషి చేయాల్సిందిగా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. విజయ శంఖారావం పేరిట నిర్వహించే ఈ సభలో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా పాల్గొంటారని వివరించారు. రాజమండ్రి బీజేపీ పార్లమెంటు అభ్యర్థి దగ్గుబాటి పురంధేశ్వరి, ఎమ్మెల్యే అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ సభలో ప్రసంగించనున్నారు. 

ఇక మే 8న మధ్యాహ్నం 2 గంటలకు తిరుపతి విమానాశ్రయానికి చేరుకోనున్న ప్రధాని మోడీ తొలుత పీలేరు అసెంబ్లీ పరిధిలో కలికిరి వద్ద ఏర్పాటుచేసి బహిరంగ సభలో పాల్గొననున్నారు. అనంతరం సాయంత్రం 5 గంటలకు విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వద్దకు చేరుకుని బెంజ్ సర్కిల్ వరకు రోడ్ షోలో ప్రధాని మోడీ  పాల్గొననున్నారు. ఈ మూడు సభలు, రోడ్ షోలలో ప్రధాని మోదీతో పాటు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి ప్రచారం చేయనున్నారు. దీనికి సంబంధించిన అన్ని భద్రతాపరమైన పోలీసు అధికారులు చర్యలను చేపట్టారు .

click me!