భార్య గర్భవతిగా ఉన్నప్పుడు భర్త ఏం చేయాలో తెలుసా?

First Published | May 4, 2024, 10:45 AM IST

ప్రెగ్నెన్సీ టైంలో ఆడవారు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. అయితే ఆడవారే అన్నింటిని చూసుకోలేరు. కాబట్టి ప్రెగ్నెంట్ గా ఉన్న భార్యలకు ప్రతి భర్త చేయాల్సిన కొన్ని పనుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

భార్య గర్భవతిగా ఉన్నప్పుడు ప్రతి భర్త ఆమెను ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి. పుట్టబోయే బిడ్డ జీవితం భార్య ఆరోగ్యంలోనే ఉంటుంది. కాబట్టి ఆమెను ఎప్పుడూ ఆరోగ్యంగా, సంతోషంగా ఉంచాలి. ఒక్క భర్తే కాదు కుటుంబ సభ్యులు కూడా ఆమెను ఎంతో జాగ్రత్తగా చూసుకోవాలి. 
 

గర్భిణులు తమ ఆరోగ్యం పట్ల ఎంత జాగ్రత్తగా ఉంటేనే నార్మల్ డెలివరీ అవుతుంది. గర్భిణులు ఏదైనా తప్పు చేస్తే దాని పర్యవసానాలు వారి ఆరోగ్యంపైనే కాకుండా పుట్టబోయే బిడ్డపై కూడా పడతాయి. కాబట్టి భార్య గర్భవతిగా ఉన్నప్పుడు భర్త ఆమెను ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి. అప్పుడే తల్లి, బిడ్డ ఆరోగ్యం బాగుంటుంది. భార్యా, బిడ్డ ఆరోగ్యం కోసం భర్త చేయాల్సిన కొన్ని పనుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..


అవగాహన

ఆరోగ్య నిపుణుల ప్రకారం.. భార్య గర్భవతిగా ఉన్నప్పుడు ఎలాంటి పోషకాహారం ఇవ్వాలి అనేది నిపుణులను సంప్రదించాలి.  లేదా తల్లిబిడ్డ ఆరోగ్యం పూర్తి సమాచారం కోసం పుస్తకాలను చదవండి. లేదా ఇంటర్నెట్ లో శోధించాలి.

pregnancy

నిద్రపోవడానికి సమయం 

గర్భిణీ స్త్రీలకు విశ్రాంతి చాలా చాలా అవసరం. కాబట్టి ప్రెగ్నెన్సీ సమయంలో  వీలైనంత ఎక్కువగా నిద్రపోవడానికి ప్రయత్నించాలి. ఇది తల్లి, పుట్టబోయే బిడ్డకు చాలా మంచిది. కాబట్టి భర్తలు తమ భార్యలు గర్భవతిగా ఉన్నప్పుడు విశ్రాంతి తీసుకోవడానికి తగినంత సమయాన్ని కేటాయించాలి. 
 

Pregnancy

పాదాల మసాజ్

పాదాల మసాజ్ ఆరోగ్యానికి మంచి మేలు చేస్తుంది. గర్భిణులకు పాదాల మసాజ్ చేయడం వల్ల ఎంతో మేలు కలుగుతుంది. ఇది వారి శరీరంలో రక్తప్రసరణను పెంచడంతో పాటుగా విశ్రాంతి కూడా కలిగిస్తుంది. ప్రెగ్నెన్సీ టైం లో వారి పాదాలకు మసాజ్ చేయడం వారికి మరింత సౌకర్యవంతంగా ఉంటుంది.

pregnancy

వంట

సాధారణంగా ఆడవారు గర్భధారణ సమయంలో మామిడి, చింతకాయ, ఉసిరికాయ వంటి కొన్ని పుల్లని, తీపి పదార్ధాలను తినాలన్న కోరిక ఎక్కువగా కలుగుతుంది. అందుకే వారికి ఎలాంటి ఆహారాలు తినాలనిపిస్తుందో వారిని అడగండి. వాటిని ప్రేమతో తీసుకురండి.  లేదా వారికి నచ్చింది వండండి.

భార్య అందాన్ని మెచ్చుకోండి

గర్భధారణ సమయంలో ఆడవారి శరీరంలో ఎన్నో మార్పులు వస్తాయి. అంటే లావు పెరగడం, ముఖంపై మచ్చలు ఏర్పడటం వంటి సమస్యలు వస్తాయి. ఇది వారిని తక్కువ చేసి చూపుతుంది. ప్రెగ్నెన్సీ సమయంలో వారు తమ అందంపై ఫోకస్ పెట్టలేరు. దీనివల్ల వారి శరీరం వారికి నచ్చదు. అందుకే ప్రతి భర్త తమ భార్యకు ఇలాంటి ఫీలింగ్ రాకుండా వారి అందాన్ని పొగడాలి. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు తక్కువ బరువుతో ఉంటే ప్రసవించడం ప్రమాదకరం.

ఓపిక పట్టండి

గర్భధారణ సమయంలో మహిళలు ఎన్నో హార్మోన్ల మార్పులకు గురవుతారు. ఫలితంగా వారు తరచుగా కోపం, యాంగ్జైటీ  భావాలను కలిగి ఉంటారు. దీనివల్ల భార్యలపై కోపం తెచ్చుకోకుండా ఈ విషయాన్ని భర్త అర్థం చేసుకోవాలి.అలాగే ఓపిక పట్టాలి. ప్రతిదాన్ని నిశితంగా గమనించండి. అలాగే ఆమె నొప్పితో ఉన్నప్పుడు లేదా ఏడుస్తున్నప్పుడు ఆమెను ఓదార్చండి. ప్రేమతో కౌగిలించుకోండి.

Latest Videos

click me!