8 దేశాల్లో షూటింగ్, 40 భాషల్లో రిలీజ్.. RRR కంటే పెద్ద సినిమా.. హీరో ఎవరో తెలుసా..?

First Published | May 4, 2024, 11:43 AM IST

పాన్ ఇండియా సినిమాలతో సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ సత్తా చాటుతోంది. ఒకరిని మించి మరొకరు అద్భుతమైన సినిమాలు చేస్తూ.. బాలీవుడ్ కు షాక్ మీద షాక్ ఇస్తున్నారు. త్వరలో మరో పాన్ ఇండియా చిత్రం రికార్డ్ లు బ్రేక్ చేయడం కోసం రెడీ అవుతోంది. 
 

ఒకప్పుడు సౌత్ సినిమాను బాలీవుడ్ వారు చాలా చిన్న చూపు చూసేవారు.. పెద్ద సినిమాలు అంటే బాలీవుడ్ కే సాధ్యం అన్నట్టు ఉండేవారు. సినిమా అంటే వాళ్లదే.. సౌత్ సినిమాను అసలు లెక్కే చేసేవారు కాదు. కాని  కానీ ఇప్పుడు పరిస్థితి మారింది.  రాజమౌళి చరిత్రను తిరగరాశాడు. బాలీవుడ్ ను పక్కను కూర్చోబెట్టి.. ఇండియాన్సినిమా అంటే తెలుగు సినిమా.. సౌత్ సినిమా అన్న రేంజ్ కు తీసుకెళ్ళాడు. 

మన సౌత్ సినిమాలు ముఖ్యంగా తెలుగు సినిమాలు..  ప్రపంచ వ్యాప్తంగా కూడా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అవుతున్నాయి. ముఖ్యంగా తెలుగు దర్శక దిగ్గజం రాజమౌళి తీసిన బాహుబలి సిరీస్‌తోపాటు ఆర్ఆర్ఆర్ మూవీ.. ఇతర  దక్షిణాది సినిమాలు ఎలా సత్తా చాటుతున్నాయో చూసూనే ఉన్నాం. దాంతో సౌత్ సినిమాలు  ప్రాధాన్యం పెరిగింది. తాజాగా మరో పాన్ ఇండియా సినిమా సత్తా చాటడానికి రెడీగా ఉంది. 

2000 కోట్ల ఆస్తి ఉన్న హీరో.. కాని చిన్న గదిలో సంసారం.. సైకిల్ పై షూటింగ్ కు.. ఎవరో తెలుసా..?


ఇప్పటి వరకు పెద్ద పాన్ ఇండియా మూవీ అంటే బాహుబలి, ఆర్ఆర్ఆర్, కెజియఫ్ లాంటివిమాత్రమే గుర్తుకు వస్తాయి. కాని వాటిని మించిన  బిగ్గెస్ట్ పాన్ ఇండియా సినిమా ఒకటి రిలీజ్ కాబోతోంది. ఈసినిమా విశేషం ఏంటంటే.. ఈమూవీ ఏకంగా 40  భాషల్లో రిలీజ్ కాబోతోంది. అంతే కాదు 8 దేశాల్లో ఈమూవీ షూటింగ్ చేశారు. ఇంతకీ ఆ మూవీ ఏంటీ అనుకుంటున్నారా..? అదే  సూర్య హీరోగా, శివ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న పీరియాడికల్ డ్రామా ‘కంగువ’

పవన్ కళ్యాణ్ నైట్ నిద్ర పట్టకపోతే ఏం చేస్తారో తెలుసా..? పవర్ స్టార్ సీక్రెట్..?

ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప 2: ది రైజ్, జూనియర్ ఎన్టీఆర్ దేవర, ప్రభాస్ కల్కి 2898 AD వంటి పాన్-ఇండియా సినిమాలపై మంచి హైప్‌ క్రియేట్ అయింది. అయితే స్కేల్, రీచ్‌లో కంగువ వీటిని అధిగమించింది. ఈ ఏడాది రానున్న అతిపెద్ద పాన్ ఇండియా సినిమాగా ఈ మూవీ నిలుస్తోంది.
 

బాలయ్య బాబాయ్ చేయల్సిన సినిమా.. అబ్బాయి ఎన్టీఆర్ దగ్గరకు ఎలా వచ్చి చేరింది..?

ఇప్పుడున్న సినిమాల్లో కంగువ పెద్ద సినిమా అనడానికి చాలా కారణాలు ఉన్నాయి. 350 కోట్ల బడ్జెట్ తో పాటు.. పాన్ ఇండియా సినిమా అంటే.. 5 భాషల్లో..మహా అయితే 10 భాషల్లో రిలీజ్అవుతుంది.. కాని ఈమూవీ ఏకంగా 40 భాషల్లో రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారట. మూవీ కోసం రియల్ లోకేషన్స్ ను టచ్ చేశారట మేకర్స్. 

ఈ సినిమాలో భారీ యుద్ధ సన్నివేశాలు ఉన్న మేజర్ షెడ్యూల్‌ను శ్రీలంకలో 60 రోజుల పాటు చిత్రీకరించారు. కొన్ని ముఖ్యమైన సీన్లను చెన్నై, పాండిచ్చేరిలో తీశారు. సూర్య నటించిన ఒక ముఖ్యమైన సన్నివేశాన్ని ఇటీవల కేరళ, కొడైకెనాల్ అడవులలో చిత్రీకరించారు. ఇలా ఏడు దేశాల్లోని రియల్ లొకేషన్స్‌లో కంగువ మూవీని గ్రాండ్‌గా తీస్తున్నారు.

ఇక ఈ మూవీలో  సూర్యతో పాటు బాలీవుడ్ స్టార్స్ బాబీ డియోల్, దిశా పటాని, టాలీవుడ్ స్టార్ జగపతి బాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. స్టూడియో గ్రీన్ నిర్మించిన ఈ సినిమా ఈ ఏడాది సెకండ్ హాఫ్ లో రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు. త్వరలో రిలీజ్ డేన్ ను అనౌన్స్ చేస్తారని తెలుస్తోంది. 

Latest Videos

click me!