ఈ ఆహారాలు సెక్స్ కోరికలను, సంతానోత్పత్తిని పెంచుతాయి..

First Published Dec 25, 2022, 11:50 AM IST

కొన్ని రకాల ఆహారాలు లిబిడోను బాగా పెంచుతాయి. దీంతో మీ సెక్స్ డ్రైవ్ బాగా పెరుగుతుంది. సంతానోత్పత్తి కూడా మెరుగుపడుతుంది.  
 

ఈ రోజుల్లో చాలా మంది ఆడవారిలో, మగవారిలో సెక్స్ కోరికలు బాగా తగ్గిపోతున్నాయి. వాతావరణంలో మార్పు, కాలుష్యం, జీవన శైలి, వ్యాయామం లేకపోవడం, తినే ఆహారం వల్ల ఇలా జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. కానీ దీనివల్ల సంతానం కలగడం కష్టమవుతుంది. అయితే కొన్ని రకాల ఆహారాలను తింటే సెక్స్ కోరికలు బాగా పెరుగుతాయి. సంతోత్పత్తి కూడా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే మంచి సెక్స్ డ్రైవ్, మెరుగైన సంతానోత్పత్తి కోసం మీ గట్ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలని నిపుణులు చెబుతున్నారు. 
 

మీ శరీరం శక్తి సామర్థ్యాలను పెంచడానికి, ఆరోగ్యకరమైన సమతుల్యతను నిర్వహించడానికి సహాయపడటానికి ప్రోబయోటిక్స్, ఎంజైమ్లు ఎక్కువగా ఉండే పులియబెట్టిన ఆహారాన్ని మీరోజు వారి ఆహారంలో చేర్చండి.  కేఫీర్, మిసో, సౌర్క్రాట్, కిమ్చి, సహజ పెరుగు వంటివి రోజూ తినండి.

ఉల్లిపాయలు, వెల్లుల్లి, ఆర్టిచోకెస్, అరటిపండ్లు, చిక్కుళ్ళు, ఆస్పరాగస్, షికోరీ, ఆపిల్ వంటి  ఆహారాలు గట్ లోని మంచి బ్యాక్టీరియాను పోషించడానికి సహాయపడతతాయి. వీటిలో ప్రీబయోటిక్ ఫైబర్స్ పుష్కలంగా ఉంటాయి. ఈ ఆహారాల్లో  ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుది. ఇది అదనపు ఈస్ట్రోజెన్ ను తొలగించడానికి సహాయపడుతుంది.

లీన్ ప్రోటీన్ అంటే..బీన్స్, చికెన్, సన్నని గొడ్డు మాంసం,  సాల్మన్, సార్డినెస్, మాకేరెల్ వంటి చేపలను, ఆరోగ్యకరమైన కొవ్వులైన ఆలివ్ ఆయిల్, కాయలు, విత్తనాలు, అవోకాడో, తృణధాన్యాలు..క్వినోవా, బ్రౌన్ రైస్, స్పెల్లింగ్ ను పుష్కలంగా తినండి. ఇవి మీ గట్ ను ఆరోగ్యంగా ఉంచడానికి, మీ లైంగిక శక్తిని పెంచడానికి సహాయపడతాయి. 
 

యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ ను తినండి. ముఖ్యంగా కూరగాయలను ఎక్కువగా తినండి. ఈ రకమైన ఆహారం పేగులను ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాగే మంటను తగ్గించడానికి సహాయపడుతుంది. అలాగే ఆరోగ్యకరమైన గట్ మైక్రోబయోమ్ ను ప్రోత్సహించడానికి సహాయపడుతుంది. ఇది మీ సెక్స్ డ్రైవ్ కు అనుకూలంగా పనిచేస్తుంది. అలాగే సంతానోత్పత్తిని పెంచుతుంది. 
 

ప్రాసెస్ చేసిన ఆహారాలను, స్వీట్లను ఎక్కువగా తినకండి. ముఖ్యంగా ఆల్కహాల్ తాగడం తగ్గించండి. ఎందుకంటే ఇవి మంట, పేగు అసమతుల్యతను కలిగిస్తాయి. ఆరోగ్యం  బాగుండటానికి, సెక్స్ డ్రైవ్  మెరుగ్గా ఉండేందుకు ఫ్రెష్ ఆహారాలనే తినండి. 
 

click me!