పాముని చంపినట్లు కల వస్తే దాని అర్థం ఏంటి..?

Published : Apr 30, 2024, 02:54 PM IST

మీకు ఒకవేళ కలలో పాము కనిపిస్తే దాని అర్థం ఏంటో ఈ రోజు తెలుసుకుందాం.. కేవలం పాము కనిపించడమే కాదు..  పాము మనల్ని కాటు వేసినట్లు.. లేదంటే మనం పాముని చంపినట్లు కలలో వస్తే.. ఆ కలకు అర్థం ఏంటో ఈ రోజు చూద్దాం...  

PREV
15
పాముని చంపినట్లు కల వస్తే దాని అర్థం ఏంటి..?
snake

మనకు ప్రతిరోజూ చాలా కలలు వస్తూ ఉంటాయి. కొన్ని కలలు మనకు సంతోషాన్ని కలిగిస్తాయి. కొన్ని కలలు మాత్రం విపరీతంగా భయపెడుతూ ఉంటాయి.  ఏది మంచి శకునమో, ఏది చెడు శకునమో మనకు తొందరగా అర్థం కాదు. అలాంటి సమయంలో ఆ కళ అర్థం ఏంటో తెలుసుకోవాలని ఆత్రుత పెరిగిపోతుంది. మీకు ఒకవేళ కలలో పాము కనిపిస్తే దాని అర్థం ఏంటో ఈ రోజు తెలుసుకుందాం.. కేవలం పాము కనిపించడమే కాదు..  పాము మనల్ని కాటు వేసినట్లు.. లేదంటే మనం పాముని చంపినట్లు కలలో వస్తే.. ఆ కలకు అర్థం ఏంటో ఈ రోజు చూద్దాం...

25

1.పాముని పట్టుకున్నట్లు కల వస్తే..

మీరు లేదంటే... ఇంకెవరైనా పాముని పట్టుకున్నట్లు కలలో వచ్చింది అంటే... ఇది చాలా మంచి సంకేతం. దాని అర్థం.. మీకు భవిష్యత్తులో  ఎక్కువ మొత్తంలో డబ్బు వస్తుందని అర్థం. అంతేకాదు... మీకు ఏవైనా సమస్యలు ఉంటే.. అవి తీరిపోతాయి అని అర్థం కూడా.

35

2.పాముని చంపినట్లు కలలో వస్తే...

మీరు కానీ.. లేదా ఇంకెవరైనా పాముని చంపినట్లు మీకు కల వస్తే... ఇది కూడా శుభ సంకేతమేనట. దాని అర్థం.. మీ శత్రువుపై మీరు విజయం సాధిస్తారు అని అర్థమట. ఈ సారి అలాంటి కల వస్తే.. మీరు భయపడాల్సిన అవసరం లేదు.
 

45

3.పాము, ముంగిస కొట్టుకుంటున్నట్లు కలలో వస్తే...

పాము, ముంగిసలు శత్రువులు అనే విషయం తెలిసిందే. ఈ రెండూ కనపడితే.. కొట్టుకోకుండా ఉండవు. రెండింటిలో ఏదో ఒకటి ప్రాణం పోయేదాకా అవి కొట్టుకుంటూనే ఉంటాయి. మీకు కనుక ఆ రెండూ కొట్టుకుంటున్నట్లు కల వస్తే... మీకు కోర్టు సమస్యలు వచ్చే అవకాశం ఉంది. త్వరలోనే కోర్టు నోటీసులు కూడా వస్తాయని అర్థమట.

55

4.పాము కరిచినట్లు కలలో వస్తే...
మీ కలలో పాము మిమ్మల్ని కరిచినట్లు చూడటం భవిష్యత్తులో పెద్ద ఇబ్బందులకు సంకేతంగా ఉంటుందని నిపుణులు మాకు చెప్పారు. మీరు సమీప భవిష్యత్తులో కొన్ని ఆరోగ్యం, ఉద్యోగం లేదా వ్యాపార సంబంధిత సమస్యలను ఎదుర్కోవచ్చు.

5. పాము ఏదైనా  రంధ్రంలోకి వెళ్ళినట్లు కలలో వస్తే...
మీ కలలోని రంధ్రంలోకి పాము వెళ్లడాన్ని చూడటం మీకు శుభం కలిగిస్తుందట. ఇది భవిష్యత్తులో మీకు సంపద లభిస్తుందని సూచిస్తుంది.

click me!

Recommended Stories