`ఫ్యామిలీ స్టార్‌` ఓటీటీ రెస్పాన్స్.. విజయ్‌ దేవరకొండ, మృణాల్‌ ల సినిమాపై ఆడియెన్స్ రియాక్షన్‌ ఏంటంటే?

Published : Apr 30, 2024, 02:11 PM IST
`ఫ్యామిలీ స్టార్‌` ఓటీటీ రెస్పాన్స్.. విజయ్‌ దేవరకొండ, మృణాల్‌ ల సినిమాపై ఆడియెన్స్ రియాక్షన్‌ ఏంటంటే?

సారాంశం

విజయ్‌ దేవరకొండ, మృణాల్‌ ఠాకూర్‌ జంటగా నటించిన `ఫ్యామిలీ స్టార్‌` మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. అక్కడ సినిమాకి రెస్పాన్స్ ఎలా ఉందంటే?  


రౌడీ బాయ్‌ విజయ్‌ దేవరకొండ, మృణాల్‌ ఠాకూర్ జంటగా నటించిన `ఫ్యామిలీ స్టార్‌` మూవీ ఈ నెల ప్రారంభంలో విడుదలైంది. సినిమా రిలీజ్‌ అయిన ఇరవై రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చింది. అమెజాన్‌ ప్రైమ్‌లో `ఫ్యామిలీ స్టార్‌` స్ట్రీమింగ్‌ అవుతుంది. అయితే ఓటీటీలో ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వస్తుండటం విశేషం. అంతేకాదు ఇది మొదటి స్థానంలో ట్రెండింగ్‌ అవుతుంది. థియేటర్లో నెగటివ్‌ టాక్‌ని ఫేస్‌ చేసిన ఈ చిత్రానికి ఓటీటీలో దుమ్మురేపుతుండటం విశేషం. 

చాలా సినిమాలు థియేటర్లలో ఆడటం లేదు. నెగటివ్‌ టాక్‌, సమ్మర్‌, ఎన్నికల ఎఫెక్ట్ వంటి కారణాలతో థియేటర్లలో సినిమాలు ఆడటం లేదు. బాగున్నా చిత్రాలకు కూడా ఆడియెన్స్ వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో వీటికి ఓటీటీలో మంచి ఆదరణ దక్కుతుంది. రికార్డు వ్యూస్‌ వస్తున్నాయి. ఆ మధ్య `గామి`కి కూడా థియేటర్లలో ఆదరణ దక్కలేదు. కానీ ఓటీటీలో బాగానే ఆడింది. ఇప్పుడు `ఫ్యామిలీ స్టార్‌` కూడా అదే కోవాలో దూసుకుపోతుంది. 

ఇది ఇండియాలోనే టాప్‌ 10 జాబితాలో నెంబర్‌ 1 పొజీషియన్‌లో ట్రెండింగ్ అవుతుండటం విశేషం. ఈ సమ్మర్‌లో పెద్ద సినిమాలు లేవు, బాగా ఆకట్టుకునే చిత్రాలు ఇండియావైడ్‌గా లేవు. ఈ నేపథ్యంలో ఫ్యామిలీ స్టార్‌ మూవీకి పాజిటివ్‌ రియాక్షన్‌ దక్కుతుండటం విశేషం. అయితే సినిమా థియేటర్లలో విడుదలైన రోజు దారుణంగా కామెంట్లు చేశారు. బాగా నెగటివ్‌ ట్రోల్‌ నడిచింది. కొందరు నెటిజన్లు కావాలని కుట్ర చేసినట్టుగా టీమ్‌ ఆరోపించింది. కొందరు హీరోల అభిమానులు ప్రమేయం కూడా ఉందన్నారు. దీనిపై చర్యలు తీసుకోవాలని టీమ్‌ రియాక్ట్ అయ్యింది. కానీ జరగాల్సిన నష్టం జరిగింది. 

అయితే ఆ లోటుని ఓటీటీ తీర్చేస్తుంది. `ఫ్యామిలీ స్టార్‌` మూవీ ఓటీటీలో మొదటి స్థానంలో ట్రెండ్‌ అవుతుండటం నిజంగా ఆశ్చర్యంగా ఉంది. ఈ సినిమాపై ఫ్యామిలీ ఆడియెన్స్ పాజిటివ్‌ గా రియాక్ట్ అవుతున్నారు. నెగటివ్‌ ప్రచారం కారణంగా తాము సినిమా చూడలేదని, కానీ ఓటీటీలో చూసినప్పుడు మంచి ఫీలింగ్‌ కలిగిందని, ఎంజాయ్‌ చేస్తున్నామని ఫ్యామిలీ ఆడియెన్స్ చెప్పడం విశేషం. విజయ్, మృణాల్ ఫర్ ఫార్మెన్స్ బాగుందని, హీరో తన గురించి ఆలోచించుకోకుండా ఫ్యామిలీ కోసం నిలబడటం ఇన్ స్పైరింగ్ గా ఉందని పోస్ట్ చేస్తున్నారు. 

సినిమాకి ఓటీటీలో వస్తోన్న రెస్పాన్స్ ని చూస్తుంటే, సినిమాపై నెగటివ్‌ ప్రచారం తేలిపోయింది. కావాలని కుట్ర చేసినట్టు అర్థమవుతుందని టీమ్‌ ఆనందం వ్యక్తం చేస్తుంది. ఆమెరికాలోనూ దీనికి మంచి స్పందన దక్కడం ఆనందంగా ఉందన్నారు. విజయ్‌ దేవరకొండ, మృణాల్‌ ఠాకూర్‌ జంటగా నటించిన `ఫ్యామిలీ స్టార్‌` చిత్రానికి పరశురామ్‌ దర్శకత్వం వహించగా, దిల్‌ రాజు నిర్మించారు. ఏప్రిల్ 5నీ మూవీ విడుదలైన విషయం తెలిసిందే. 

ఇక విజయ్‌ దేవరకొండప్రస్తుతం.. గౌతమ్‌ తిన్ననూరితో ఓ సినిమా చేస్తున్నారు. దీంతోపాటు దిల్‌ రాజు ప్రొడక్షన్‌లోనే మరో సినిమా చేయబోతున్నారు విజయ్‌. కొత్త దర్శకుడు రూపొందించనున్నారు. మరోవైపు ఆ మధ్య ప్రశాంత్‌ నీల్‌ కూడా విజయ్‌ దేవరకొండని కలిశాడు. ఈ ఇద్దరి కాంబోలో సినిమా ఉంటుందని ప్రచారం జరుగుతుంది. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Mahesh Babu : శ్రుతి హాసన్ ముందు అలీ ని ఇరికించిన మహేష్ బాబు, సూపర్ స్టార్ మామూలోడు కాదు?
రామ్ పోతినేనితో సినిమా చేసిన డైరెక్టర్ అరెస్ట్ కి ఆదేశాలు ? అసలేం జరిగింది, క్లారిటీ ఇదే