రాత్రి 7 గంటల లోపు డిన్నర్ చేస్తే ఏమౌతుందో తెలుసా?

First Published | Apr 30, 2024, 2:46 PM IST

చాలా మందికి రాత్రిపూట లేట్ గా తినే అలవాటు ఉంటుంది. అంటే కొంతమంది 9 తర్వాత తింటే మరి కొంతమంది 10, 11 తర్వాతే తింటుంటారు. కానీ ఇలా లేట్ గా తినడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. అసలు రాత్రి 7 గంటల లోపు డిన్నర్ చేస్తే ఏమౌతుందో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

డిన్నర్ త్వరగా తినాలి అన్న సంగతి ప్రతి ఒక్కరికీ తెలుసు. కానీ చాలా మంది రాత్రి 9,10 దాటిన తర్వాతే డిన్నర్ చేస్తుంటారు. ఇలా తినే అలవాటు చాలా మందికి ఉంటుంది. దీనికి కారణాలు ఎన్నో ఉండొచ్చు. కానీ ఇలా లేట్ గా తినే అలవాటు మిమ్మల్ని ఎన్నో రోగాల బారిన పడేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మీకు తెలుసా? రాత్రి 7 గంటల లోపు డిన్నర్ కంప్లీట్ చేయడం వల్ల మీరు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందుతారు. అవేంటో ఓ లుక్కేద్దాం పదండి. 
 

dinner

జీర్ణక్రియ ఆరోగ్యంగా..

రాత్రిపూట త్వరగా తినడం వల్ల జీర్ణక్రియ ఆరోగ్యంగా ఉంటుంది. మీరు రోజూ 7 గంటల లోపు తినడం అలవాటు చేసుకుంటే మీరు తిన్న ఆహారం జీర్ణం కావడానికి తగినంత సమయం దొరుకుతుంది. అలాగే అజీర్ణం, మలబద్ధకం, అసిడిటీ వంటి సమస్యలు కూడా రావు. అందుకే ఉదర సమస్యలున్న వారు రాత్రి 7 గంటల లోపు తినడం అలవాటు చేసుకోవాలి. 
 


గుండెను ఆరోగ్యంగా..

రాత్రి భోజనం త్వరగా చేస్తే రక్తపోటు, హృదయ స్పందన రేటు అదుపులో ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇలా తినడం అలవాటు చేసుకుంటే మీకు హృదయ సంబంధ సమస్యలొచ్చే ప్రమాదం చాలా వరకు తగ్గుతుంది. కాబట్టి ఎవరికైనా హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటే త్వరగా డిన్నర్ చేయడం అలవాటు చేసుకోవాలి. 
 

షుగర్ నియంత్రణలో..

ఉదయాన్నే డిన్నర్ చేయడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. నిజానికి సరైన సమయానికి రాత్రి భోజనం చేయడం వల్ల మన శరీరం ఇన్సులిన్ ను సమర్థవంతంగా వినియోగించుకోగలుగుతుంది.  దీంతో బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి. 

మంచి నిద్రకు..

మీరు రాత్రిపూట భోజనం త్వరగా చేసినప్పడుు జీర్ణక్రియ మెరుగ్గా ఉంటుంది. ఇది మీరు కంటినిండా నిద్రపోవడానికి సహాయపడుతుంది. జీర్ణ సమస్యల వల్ల రాత్రిపూట సరిగ్గా నిద్రరాదు. మీరు రాత్రి 7 గంటల లోపు తినడం అలవాటు చేసుకుంటే మీరు ఎలాంటి డిస్టబెన్స్ లేకుండా నిద్రపోగలుగుతారు. 
 

eating

హార్మోన్ల సమతుల్యత

రాత్రిపూట తొందరగా డిన్నర్ చేయడం వల్ల హార్మోన్లు సమతుల్యంగా ఉంటాయి. దీంతో హార్మోన్ల అసమతుల్యత వల్ల కలిగే సమస్యలు తగ్గిపోతాయి. ముఖ్యంగా ఆడవారికి ఇది ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే హార్మోన్ల అసమతుల్యత వల్ల ఆడవారు ఎన్నో సమస్యలను ఫేస్ చేయాల్సి వస్తుంది. 
 

మానసిక ఆరోగ్యానికి మేలు 

రాత్రి త్వరగా తినడం వల్ల బాగా నిద్రపడుతుంది. ఇది మానసిక ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. నిజానికి మంచి జీర్ణక్రియ, మంచి నిద్రవల్ల ఒక వ్యక్తి మానసికంగా మంచి అనుభూతి చెందుతాడు. దీంతో ఒత్తిడి, ఆందోళన, ఇతర మానసిక సమస్యలు తగ్గిపోతాయి. 

Latest Videos

click me!