ఈ కూరగాయలను తింటే కడుపులో గ్యాస్ సమస్య వస్తుంది జాగ్రత్త..

First Published Jun 27, 2022, 11:51 AM IST

గ్యాస్ ప్రాబ్లమ్ రావడానికి ఎన్నో కారణాలుంటాయి. ముఖ్యంగా మనం తినే కొన్ని రకాల కూరగాయల వల్ల కూడా గ్యాస్ ప్రాబ్లమ్ వస్తుంది. 

ఆధునిక జీవనశైలిలో ఎసిడిటీ, గ్యాస్ సమస్య, మానసిక అలసట వంటి సమస్యలు సర్వసాధారణం అయిపోయాయి. గంటల తరబడి ఒకే దగ్గర కూర్చోవడం వల్ల ఇలాంటి సమస్యలు వస్తుంటాయి. ఈ సమస్య గృహిణులు, యువత, వృద్ధులల్లో కూడా కనిపిస్తుంది. కడుపులో ఏర్పడే వాయువు కొన్నిసార్లు గుండెకు కూడా హానీ చేస్తుంది. ఇలాంటి వారు కొన్నిరకాల ఆహార పదార్థాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. 
 

అయితే చాలాసార్లు తినే కూరగాయల వల్ల కూడా గ్యాస్ట్రిక్ సమస్య వస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవేంటంటే..

gobi manchurian

గోబీ (Gobi): రోజూ గోబీని తినే వారు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే గోబీ కడుపులో గ్యాస్‌ను ఉత్పత్తి చేస్తుంది. గోబీ సులభంగా జీర్ణం అయినా.. గ్యాస్ట్రిక్ సమస్యను తెస్తుంది. అందుకే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్నవారు గోబీని బాగా ఉడకబెట్టే తినాలి. ఇలా చేస్తే గ్యాస్ ఏర్పడే అవకాశాలు తగ్గుతాయి. లేదా తయారుచేసేటప్పుడు ఇంగువ (asafoetida) వేయాలి.

పప్పు ధాన్యాలు ( pulses pulses): పప్పులు ప్రొటీన్‌ని అందజేస్తాయి. ఇది అందరికీ తెలిసిందే. అయితే కడుపులో గ్యాస్‌ను కూడా తయారు చేసే పప్పులు కూడా చాలా ఉన్నాయని మీకు తెలుసా..  నల్ల పప్పు, మిగతా పప్పులు కూడా కడుపులో గ్యాస్‌ను తయారు చేస్తాయి. అందుకే పప్పు కూరను వండటానికి ముందుగా వాటిని కాసేపు వాటర్ లో నానబెట్టండి. అలాగే పప్పు ఉడుకుతున్నప్పుడు కాస్త ఇంగువ వేసినా.. గ్యాస్ ప్రాబ్లమ్ రాదు.. 

జాక్ ఫ్రూట్ ( Jack fruit): గ్యాస్ సమస్య ఉన్నవాళ్లు జాక్ ఫ్రూట్స్ ను తినకపోవడమే మంచిది. ఈ పండును ఎక్కువగా ఎవరు తిన్నా.. కడుపులో వాయువు ఉత్పత్తి అవుతుంది. ఉదర సమస్యలు కూడా వస్తాయి. దీనిని ఎక్కువగా తీసుకోవడం వల్ల మీ కడుపు ఉబ్బరంగా ఉంటుంది. అందుకే జాక్ ఫ్రూట్ ను తక్కువ మొత్తంలోనే తినేట్టు చూసుకోండి. 
 

వైట్ చిక్పీస్ (White Chickpeas): సాధారణంగా చాలా మంది రాజ్మా, వైట్ చిక్పీస్ ఎక్కువగా తింటారు. కానీ ఈ రెండూ కడుపులో చాలా గ్యాస్ ను తయారు చేస్తాయని ఆరోగ్య  నిపుణులు చెబుతున్నారు. అందుకే వీటిని ఎక్కువగా తినికండి. వీటిని తింటే జీర్ణసమస్యలు కూడా వస్తాయి. గ్యాస్ ప్రాబ్లమ్ కూడా వస్తుంది. 
 

ప్రతి మనిషిలో గ్యాస్ ఏర్పడటానికి వివిధ కారణాలు ఉన్నప్పటికీ.. చాలా మందిలో, పాల టీ, చోలే, రాజ్మా, అరబిక్, కాలీఫ్లవర్, పోహా, సలోని, మైదాతో తయారు చేసిన ఫుడ్స్ వల్ల గ్యాస్ ఏర్పడుతుంది. ఒక వేళ వీటిని తింటే.. తిన్న తర్వాత మీరు కాసేపు ఖచ్చితంగా నడవాలి. తద్వారా మీరు ఈ ఆహారాన్ని త్వరగా జీర్ణం చేసుకోగలుగుతారు.

click me!