చిటికెడు ఇంగువతో ఇలా చేస్తే ఊహించని ఆరోగ్య ప్రయోజనాల.. అది ఎలా అంటే?

First Published Oct 23, 2021, 9:49 PM IST

ప్రస్తుత కాలంలో అందరూ అనేక ఆరోగ్య సమస్యలను (Health Problems) ఎదుర్కొంటున్నారు. దీనికి కారణం ఆహారంలోని పోషకాల లోపమే. మన వంటింట్లో ఉండే పోపుల పెట్టెలో ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే మసాలా దినుసులు (Spices) ఉన్నాయి. 

ఈ మసాలా దినుసుల్లో ముఖ్యమైన వాటిలో ఇంగువ (Asparagus) ఒకటి. ఇంగువలో ఔషధ గుణాలు ఎక్కువగా ఉంటాయి. ఇంగువను ఆయుర్వేదంలో ఉపయోగిస్తారు. వెల్లుల్లిలో (Garlic) ఉన్న అన్ని గుణాలు ఇంగువలో కూడా ఉన్నాయి. చిటికెడు ఇంగువను రోజూ వంటకాల్లో వాడితే ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది.
 

ఇంగువను భారతదేశంలోని పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ ప్రాంతాలలో ఎక్కువగా పండుతుంది. చెట్టు కాండం నుంచి లభ్యమయ్యే జిగురు లాంటి ద్రవ పదార్థం ఇంగువ (Asparagus). ఇంగువ అధిక ఘాటు వాసనను కలిగి ఉంటుంది.  
 

ప్రస్తుత కాలంలో అందరూ అనేక ఆరోగ్య సమస్యలను (Health Problems) ఎదుర్కొంటున్నారు. దీనికి కారణం ఆహారంలోని పోషకాల లోపమే. మన వంటింట్లో ఉండే పోపుల పెట్టెలో ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే మసాలా దినుసులు (Spices) ఉన్నాయి. వాటి గురించి సరైన అవగాహన లేక వాటి వాడుకను నిర్లక్ష్యం చేస్తూ ఉంటాము.
 

ఇంగువలో క్యాల్షియం, ఫాస్ఫరస్‌, మెగ్నీషియం, ఇనుము, కెరొటిన్‌, విటమిన్‌- బి, పీచు, మాంసకృత్తులు పుష్కలంగా ఉంటాయి. దీంట్లో పలు రకాల యాంటీక్యాన్సర్‌ (Anticancer) సమ్మేళనాలుంటాయి. ఇంగువను వంటకాల్లో వాడడం వల్ల రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం (Health) కలుగుతుంది.  
 

ఉల్లిరసం, తమలపాకు రసంలో కొంచెం ఇంగువ వేసి తేనెతో (Honey) కలిపి తీసుకుంటే శ్వాసకోశ సమస్యల  నుంచి వెంటనే విముక్తి కలుగుతుంది. అర గ్రాము మోతాదు పచ్చకర్పూరం, చిటికెడు ఇంగువను లేత తమలపాకులో ఉంచి నమిలి మింగితే దగ్గు (Cough) నుంచి విముక్తి కలుగుతుంది.
 

క్రమం తప్పకుండా రోజూ ఆహారంలో (Food) ఇంగువను తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. నిద్రలేమి సమస్యలు తగ్గుతాయి. ఆకలిని పెంచుతుంది. గ్లాసు మజ్జిగలో చిటికెడు ఇంగువను వేసుకొని తాగితే జీర్ణవ్యవస్థ బాగా (Digestive System) పనిచేస్తుంది.
 

ఆస్తమా, దగ్గు, కడుపుబ్బరం, అజీర్తి, గ్యాస్ సమస్యలను తగ్గించడానికి ఇంగువ మంచి ఔషధంగా (Medicine) పనిచేస్తుంది. ఇంగువ రక్తంలోని షుగర్ లెవల్స్ ను అదుపులో ఉంచి మధుమేహం (Diabetes) బారిన పడకుండా కాపాడుతుంది.

click me!