ఈ దేశాలు ఒక్కరోజులో చుట్టిరావచ్చు తెలుసా?

First Published Jan 2, 2024, 11:28 AM IST

అలాంటి వారికి ఈ విషయం తెలిస్తే.. కచ్చితంగా ఈ సారి హాలిడే ట్రిప్ ఫారిన్ కే వేస్తారు. ఆ విషయం ఏమిటంటే... ఈ కింది దేశాలను మనం కేవలం ఒక్క రోజులోనే చుట్టేయవచ్చు. పర్యాటకంగానూ అదిరిపోయే  ఆ దేశాలేంటో ఓసారి చూద్దాం...

ఎప్పుడూ మన చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలను చూసి చూసి, చాలా మందికి బోర్ వచ్చేసి ఉండొచ్చు. అందుకే.. ఏవైనా ఇతర దేశాలకు ట్రిప్ కి వెళ్తే బాగుండు అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. కానీ, విదేశాలకు ట్రిప్ అంటే ఎక్కువ  రోజులు సెలవలు పెట్టాలి. ఖర్చు కూడా ఎక్కువ అనుకుంటూ ఉంటాం. అందుకే.. విదేశీ ట్రిప్ లకు పెద్దగా ఆసక్తి చూపించరు. అలాంటి వారికి ఈ విషయం తెలిస్తే.. కచ్చితంగా ఈ సారి హాలిడే ట్రిప్ ఫారిన్ కే వేస్తారు. ఆ విషయం ఏమిటంటే... ఈ కింది దేశాలను మనం కేవలం ఒక్క రోజులోనే చుట్టేయవచ్చు. పర్యాటకంగానూ అదిరిపోయే  ఆ దేశాలేంటో ఓసారి చూద్దాం...
 

1.లిచెన్ స్టెయిన్..

ఇదొక చిన్న దేశం.. స్విట్జర్లాండ్, ఆస్ట్రియా మధ్య ఉంటుంది. చాలా చిన్న పరిమాణంలో ఉంటుంది. కానీ..చూడటానికి చాలా రమణీయమైన ప్రదేశాలతో నిండి ఉంటుంది. బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. అయితే పరిమాణం చిన్నది కాబట్టి...  ఇది చుట్టిరావడానికి ఎక్కువ సమయం ఏమీ పట్టదు. కేవలం ఒక్కరోజులో ఈ దేశాన్ని మనం చుట్టేసి రావచ్చుు.
 

Latest Videos


2.శాన్ మారినో..

శాన్ మారినో ఇది మరో చిన్న దేశం. క్రీస్తు శకం 301నాటి మూలాలు కలిగిన దేశం ఇది.  అత్యంత పురాతన కట్టడాలు ఈ దేశంలో అడుగడుగునా ఉంటాయి. విస్తీరణం మాత్రం 61 చదరపు కిలోమీటర్లు మాత్రమే కావడం విశేషం.అందుకే.. ఒక్కరోజులో దేశం మొత్తం చుట్టేయవచ్చు.

Tuvalu pacific island


3.తువాలు..
పేరు కూడా చాలా భిన్నంగా ఉన్న ఈ దేశం ఆస్ట్రేలియాకు ఈ శాన్యంగా పసిఫిక్ మహాసముద్రం సమీపంలో ఉంటుంది. ఇది కూడా విస్తీరణంలో చాలా చిన్న దేశం. మహా అంటే ఈ దేశంలో పదివేల మంది జీవించగలరు.దేశం మొత్తంలో ఒకే ఒక హాస్పిటల్ ఉంటుంది. అంటే ఎంత చిన్న దేశమో అర్థం చేసుకోవచ్చు. కానీ... దేశం చిన్నదైనా పర్యాటకులను ఆకర్షించే చాలా ప్రకృతి దృశ్యాలు ఇక్కడ ఉండటం విశేషం.

4.మొనాకో..

ఇది కూడా చాలా చిన్నదేశం అనే చెప్పొచ్చు. ఒక చదరుపు మైలు కంటే తక్కువ విస్తీరణంలో ఈ దేశం ఉంటుంది. చూడటానికి మాత్రం భూతల స్వర్గంలా ఉంటుంది. ఆకర్షించే పర్యాటక క్షేత్రాలు చాలానే ఉన్నాయి. ఐకానిక్ హార్బర్, కాసిసోలు కూడా ఉంటాయి. చాలా క్లాసీగా అందరినీ ఆకర్షించేలా ఉంటుంది.
 

5.వాటికన్ సిటీ..
ఇది కూడా చాలా చిన్న దేశం. న్యూయార్క్ సెంట్రల్ పార్క్ పరిణామంలో ఎనిమిదో వంతు మాత్రమే ఉంటుంది. కానీ.. చాలా కళాత్మక ప్రాంతం. ఆధ్యాత్మికతకు సాక్ష్యంగా నిలుస్తుంది. సాంస్కృతిక గొప్పదనాన్ని చాటుతుంది. ఈ దేశాన్ని కూడా ఒక్కరోజులోనే మనం చూసేయవచ్చు.
 

click me!