వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్.. అలెర్జీల మధ్య తేడాలు ఎలా కనిపెట్టవచ్చంటే...

First Published Apr 9, 2021, 12:37 PM IST

కరోనా మహమ్మారి ప్రపంచమానవాళిపై విరుచుకుపడి సంవత్సరం గడిచిపోతోంది. అయినా దాని విస్తరణ ఆగడం లేదు. ప్రపంచం మొత్తాన్నీ గడగడా వణికిస్తోంది. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ కొంత ఊరటను కలిగిస్తుంది. అయితే వ్యాక్సిన్ మొదటి డోసు వేసుకున్న కొంతమందిలో కరోనాపాజిటివ్ బారిన పడుతుండగా, రెండో డోస్ పూర్తైన మరికొంతమందిలో సైడ్ఎఫెక్ట్స్ లాగా కోవిడ్ 19లాంటి కొన్ని లక్షణాలు కనిపిస్తున్నాయి.

కరోనా మహమ్మారి ప్రపంచమానవాళిపై విరుచుకుపడి సంవత్సరం గడిచిపోతోంది. అయినా దాని విస్తరణ ఆగడం లేదు. ప్రపంచం మొత్తాన్నీ గడగడా వణికిస్తోంది. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ కొంత ఊరటను కలిగిస్తుంది. అయితే వ్యాక్సిన్ మొదటి డోసు వేసుకున్న కొంతమందిలో కరోనాపాజిటివ్ బారిన పడుతుండగా, రెండో డోస్ పూర్తైన మరికొంతమందిలో సైడ్ఎఫెక్ట్స్ లాగా కోవిడ్ 19లాంటి కొన్ని లక్షణాలు కనిపిస్తున్నాయి.
undefined
చలికాలంలో కోవిడ్ 19 కేసులు ఎక్కువవుతాయనుకుంటే అది తిరగబడింది. వేసవిలో కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. దీనికి తోడు వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల రకరకాల అలెర్జీలు, జ్వరాలు బాధపెడుతున్నాయి. వీటి లక్షణాలు కోవిడ్ 19 లక్షణాలకు దగ్గరగా ఉండడంతో ఏది కరోనానో... ఏది అలెర్జీనో.. దేన్ని సీరియస్ గా తీసుకోవాలో తెలియని కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది.
undefined
కరోనా, వ్యాక్సిన్ అలెర్జీ, సైడ్ ఎఫెక్ట్స్ ల లక్షణాలు ఒకే రకంగా ఉండడం వల్ల గందరగోళం ఏర్పడుతుంది. వీటి మధ్య తేడాలు గుర్తించడం కష్టమే. కరోనా లక్షణాలను జ్వరమో, అలెర్జీనో సైడ్ ఎఫెక్ట్సో అని నిర్లక్ష్యం చేస్తే ప్రమాదం. అలాగని ఈ లక్షణాలను కరోనా అనుకుని కంగారు పడితే ఇంకా ప్రమాదం.
undefined
ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో మీలో కనిపిస్తున్న లక్షణాలు అసలు ఏంటి అనేది మీరెలా గుర్తిస్తారు? అలెర్జీ, కరోనాల మధ్య తేడాను గుర్తించే మార్గం ఏమిటి?
undefined
మీరు ఇప్పటికే వ్యాక్సిన్ తీసుకున్నట్లైతే.. టీకా తరువాత కనిపించే లక్షణాలను, కరోనా లక్షణాల నుంచి ఎలా వేరు చేసి చూడొచ్చు? అలెర్జీలు, కరోనా లక్షణాలు రెండూ ఒకేలాగా ఎందుకు ఉన్నాయి? ఇలాంటి అనేక సందేహాలు ఉక్కిరి బిక్కిరి చేస్తుంటాయి
undefined
నిజానికి కోవిద్, అలెర్జీ లక్షణాల మధ్య తేడాలు గుర్తించడం అంత సులభం కాదు. ముఖ్యంగా రెండూ కలిసిపోయినట్టుగా ఉంటున్న నేటి కాలంలో.
undefined
ఈ కీలకమైన వ్యత్యాసాన్ని కనిపెట్టడం వల్ల మీ ఇంట్లోని చిన్న పిల్లలకు కూడా సహాయపడినవారవుతారు. పిల్లలు వెంటనే అలెర్జీల బారిన పడతారు. వారిలో రోగనిరోధక శక్తి తక్కువతా ఉండడం వల్ల కరోనా బారిన కూడా తొందరగా పడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా సెకండ్ వేవ్ టైంలో వ్యాధి బారిన పడుతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంటోంది.
undefined
అలెర్జీ, కోవిడ్ ల మధ్య ముఖ్యంగా గుర్తించదగిన లక్షణం ఒకటుంది.. శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది, ఎడతెరిపిలేని దగ్గు, వాసన కోల్పోవడం, జలుబు, కన్నీళ్లు, దద్దుర్లు, తలనొప్పి వంటి లక్షణాలు ఎక్కువగా కోవిడ్ లక్షణాలుగా పరిగణించవచ్చు.
undefined
శ్వాసకు ఇబ్బంది పడడం, చాతిలో బరువుగా ఉండడం లాంటివి చాలా అలెర్జీలో చాలా అరుదుగా కనిపించే లక్షణాలు.
undefined
డాక్టర్ల ప్రకారం ఈ రెండింటి మధ్య చాలా సున్నితమైన తేడాలు మాత్రమే ఉన్నాయని కాబట్టి.. వ్యాక్సిన్ తీసుకున్న వారిలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తే.. ముందు మానసికంగా దృఢంగా ఉండడం, తగిన జాగ్రత్తలు తీసుకోవడం, కంగారు పడకుండా ఉండడం, టెస్ట్ చేయించుకోవడం అవసరం అంటున్నారు
undefined
click me!