ఈ ఏడాది విడాకులతో షాకిచ్చిన సెలబ్రెటీ కపుల్స్ వీరే....!

First Published Dec 7, 2022, 12:36 PM IST

వారు విడాకులు ప్రకటించడం అందరినీ విస్మయానికి గురి చేసింది. అయితే... ఆ తర్వాత వీరు మళ్లీ కలిసిపోయినట్లు కూడా వార్తలు రావడం గమనార్హం.
 

1.ధనుష్-ఐశ్వర్య..
దాదాపు 18ఏళ్ల వివాహ బంధం తర్వాత....  తమిళ హీరో ధనుష్, ఆయన భార్య ఐశ్వర్య లు విడాకులు ప్రకటించారు. ఈ దంపతులకు ఇద్దరు సంతానం కూడా ఉన్నారు. దాదాపు పెళ్లైన 18 ఏళ్ల తర్వాత.. వారు విడాకులు ప్రకటించడం అందరినీ విస్మయానికి గురి చేసింది. అయితే... ఆ తర్వాత వీరు మళ్లీ కలిసిపోయినట్లు కూడా వార్తలు రావడం గమనార్హం.


2.ఇమ్రాన్ ఖాన్-అవంతిక మాలిక..
ఈ బాలివుడ్ జంట కూడా ఈ ఏడాది విడిపోతున్నట్లు ప్రకటించారు. చాలా కాలం కలిసి ఉన్నవారు.. మనస్పర్థల కారణంగా... తాము విడిపోతున్నట్లు ఈ జంట కూడా ఈ ఏడాదే ప్రకటించడం గమనార్హం.
 

3.టామ్ బ్రాడీ- గిసెల్ బాండ్చెన్..
ప్రముఖ ఫుట్ బాల్ క్రీడాకారుడు టామ్ బ్రాడీ, అతని భార్య, సూపర్ మోడల్-భార్య గిసెల్ బాండ్చెన్ విడాకులు ప్రకటించారు. ఈ ఏడాదిలోనే వీరు తమ 13 సంవత్సరాల వైవాహిక బంధానికి ముగింపు పలకనున్నట్లు వారు తెలిపారు.
 

4.హ్యారీ స్టైల్స్- ఒలివియా విల్డే...
ఈ స్టార్ సెలబ్రెటీలు కూడా ఈ ఏడాదే విడిపోయారు. దాదాపు రెండు సంవత్సరాల డేటింగ్ తర్వాత... ఈ జంట తాము విడిపోతున్నట్లు ప్రకటించడం గమనార్హం.

5.కిమ్ కర్దాషియాన్- కాన్యే వెస్ట్..
ప్రముఖ రాపర్‌ కాన్యే వెస్ట్‌-నటి కిమ్‌ కర్దాషియాన్‌ విడాకులు ఖరారయ్యాయి. ఈ ఏఢాది వీరు విడాకులు ప్రకటించారు. కాన్యే వెస్ట్‌-కిమ్‌ కార్దాషియాన్‌ జంట 2014 లో ఇటలీలో అంగరంగ వైభవంగా పెండ్లి చేసుకున్నారు. కాన్యే నుంచి గత ఏడాది ఫిబ్రవరిలో విడాకుల కోసం కిమ్‌ పిటిషన్‌ దాఖలు చేసింది.కాగా.. ఇటీవల వారి విడాకులు కన్ఫామ్ కావడం గమనార్హం.

6.సోహైల్ ఖాన్- సీమా ఖాన్...
సల్మాన్‌ ఖాన్‌ తమ్ముడు సోహైల్‌ ఖాన్‌ కూడా ఈ ఏడాదే విడాకులు ప్రకటించారు. ఎంతో అన్యోనంగా ఉండే సోహైల్‌ ఖాన్‌- సీమా ఖాన్‌లు పెళ్లయిన 24ఏళ్ల అనంతరం విడిపోయేందుకు నిర్ణయించుకోవడం అందరినీ విస్మయానికి గురి చేసింది.


7.హనీసింగ్- షాలినీ తల్వార్..
రాపర్-సింగర్ యో యో హనీ సింగ్ , షాలిని తల్వార్ 21 సంవత్సరాల వివాహం తర్వాత అధికారికంగా విడిపోయారు. ఈ ఏడాదే వారు విడాకులు ప్రకటించడం గమనార్హం.

click me!