Cancer Risk: ఆడ, మగ లో.. వీళ్లకే క్యాన్సర్ ఎక్కువగా వస్తుంది..

First Published Aug 13, 2022, 1:06 PM IST

Cancer Risk: ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది క్యాన్సర్ బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే ఈ రోగం ఆడవారికంటే మగవారికే ఎక్కువగా వస్తుందట. 
 

 ప్రస్తుత కాలంలో క్యాన్సర్ సర్వసాధారణ సమస్యగా మారిపోయింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. ప్రపంచవ్యాప్త మరణాలకు క్యాన్సర్ ఒక ప్రధాన కారణంగా నిలుస్తోంది. 2020 గణాంకాల ప్రకారం.. ఈ ఏడాది  క్యాన్సర్ బారిన పడి కోటి మంది చనిపోయారు. అంటే ప్రతి ఆరుగురి మరణాలలో ఒకరు క్యాన్సర్ వల్లే చనిపోతున్నారట. దీనిలో ఊపిరితిత్తుల క్యాన్సర్, ప్రోస్టేట్ వల్లే ఎక్కువగా చనిపోతున్నారని తేలింది. ఇంకా ఎన్నో రకాల క్యాన్సర్ల బారిన పడి జనాలు అర్థాంతరంగా చనిపోతున్నారు. 

క్యాన్సర్ ఎలా పుడుతుంది?

మన శరీరంలో కణాలు ఎప్పుడూ ఏర్పడుతూనే ఉంటాయి. చనిపోతూనే ఉంటాయి. పాత కణాల ప్లేస్ లో కొత్త కణాలు పుట్టుకొస్తూనే ఉంటాయి. అయితే క్యాన్సర్ బారిన పడితే ఈ ప్రక్రియ దెబ్బతింటుంది. అయితే దీనిలో కొన్ని కణాలు చనిపోకుండా అలాగే ఉంటాయి. వాటి సంఖ్య బాగా పెరుగుతుంది. ఇది ఒక కణితిగా మారుతుంది. ఈ కణితే తర్వాత ప్రాణాంతక క్యాన్సర్ కు దారితీస్తుంది. ఇటీవల జరిగిన ఒక పరిశోధనలో ఈ వ్యాధి ఎవరికి ఎక్కువగా వస్తుందో వెల్లడైంది. 

పురుషులు, స్త్రీలలో.. క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంది?

అమెరికన్ క్యాన్సర్ సొసైటీ చేసిన తాజా అధ్యయనంలో ఆశ్చర్యకరమైన విషయం వెల్లడైంది.  క్యాన్సర్ మహిళల కంటే పురుషులకే వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని తేలింది. ఎందుకంటే పురుషులే ఆల్కహాల్, స్మోకింగ్,  గుట్కా, బీడీలన ఎక్కువగా తీసుకోవడమే కారణం. ఈ పరిశోధన 2,94,100 మంది రోగులపై చేశారు. 

 పురుషులకు ఈ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది
 
ఆడవారికి బ్రెస్ట్ క్యాన్సర్, గర్బాశయ క్యాన్సర్లే ఎక్కువగా వచ్చే ప్రమాదం ఉంది. ఇవి పురుషులకు రావు. ఇక పురుషుల గురించి చెప్పుకున్నట్టైతే వీళ్లకు అన్నవాహిక క్యాన్సర్ (Esophageal cancer) ప్రమాదం 10.8 రెట్లు ఎక్కువగా ఉంటే..  స్వరపేటిక  (larynx) ప్రమాదం 3.5 రెట్లు ఎక్కువగా ఉంది. అలాగే  మూత్రాశయ క్యాన్సర్ (bladder cancer) 3.3 రెట్లు, గ్యాస్ట్రిక్ కార్డియా (Gastric cardia) 3.5 రెట్ల  ప్రమాదం ఎక్కువగా ఉంది. అయితే థైరాయిడ్,  పిత్తాశయం క్యాన్సర్‌ లు మాత్రం పురుషుల కంటే స్త్రీలే ఎక్కువగా గురవుతున్నారని పరిశోధన వెల్లడించింది.

click me!