తండ్రి చనిపోతే కూడా వెళ్ళలేదు.. కోవై సరళకి అంత డబ్బు పిచ్చా, అలీ ఎదుటే ఇలా..

Published : May 05, 2024, 08:50 PM IST

లేడి కమెడియన్ గా ఇటీవల కాలంలో అత్యంత ఆదరణ పొందిన నటి కోవై సరళ. క్షేమంగా వెళ్లి లాభంగా రండి, సందడే సందడి, దేశముదురు లాంటి చిత్రాల్లో కోవై సరళ నవ్వులు పూయించింది. 

PREV
17
తండ్రి చనిపోతే కూడా వెళ్ళలేదు.. కోవై సరళకి అంత డబ్బు పిచ్చా, అలీ ఎదుటే ఇలా..

కామెడీ ప్రియులకు కోవై సరళ గురించి పరిచయం అవసరం లేదు. లేడి కమెడియన్ గా ఇటీవల కాలంలో అత్యంత ఆదరణ పొందిన నటి కోవై సరళ. క్షేమంగా వెళ్లి లాభంగా రండి, సందడే సందడి, దేశముదురు లాంటి చిత్రాల్లో కోవై సరళ నవ్వులు పూయించింది. 

27

దేశముదురు చిత్రంలో అలీ, కోవై సరళ కాంబినేషన్ భలేగా ఆకట్టుకుంది. మీ అమ్మకి తీసిచ్చావు పట్టు చీర.. మీ చెల్లికి తీసిచ్చావు. నాకెందుకు ఇవ్వలేదురా అంటూ కోవై సరళ చేసిన కామెడీ అంతా ఇంతా కాదు. ఇటీవల కోవైసరళ జోరు తగ్గింది. అయితే అయితే అప్పుడప్పుడూ సినిమాల్లో నటిస్తూనే ఉంది. 

37

తాజాగా కోవై సరళ కమెడియన్ అలీ హోస్ట్ గా చేస్తున్న అలీతో సరదాగా అనే షోకి అతిథిగా హాజరైంది. మీ అమ్మకి పట్టు చీర ఇచ్చావు అంటూ దేశముదురు చిత్రంలోని డైలాగ్ చెబుతూ కోవై సరళ ఈ షోకి ఫన్నీ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత అలీ.. కోవై సరళకి తన ప్రశ్నలు సంధించాడు. అసలు కోవై అంటే ఏంటి అని అడిగారు. 

47

మా సొంత ఊరు కోయంబత్తూర్. కోయంబత్తూర్ ని షార్ట్ గా కోవై అని అంటారు. ఆ విధంగా నన్ను కోవై సరళ అని పిలుస్తూ అదే నా ఇంటి పేరుగా మారిపోయింది. తనకి నలుగురు సిస్టర్స్ ఒక బ్రదర్ ఉన్నట్లు కోవై సరళ తెలిపింది. గతంలో కోవై సరళకి కమల్ హాసన్ పక్కన హీరోయిన్ గా నటించే ఛాన్స్ కూడా వచ్చింది అని అర్థం వచ్చేలా అలీ ఒక ప్రశ్న అడిగారు. 

57
kovai sarala

ఆ ప్రశ్నకి కోవై సరళ ఎలాంటి సమాధానం ఇచ్చిందో కంప్లీట్ ఎపిసోడ్ లో చూడాల్సిందే. టాలీవుడ్ లో తనకి ఇష్టమైన డైరెక్టర్ పూరి జగన్నాధ్ అని కోవై సరళ తెలిపింది. ఆయన దర్శకత్వంలో దేశముదురులో మనిద్దరం నటించాం కదా అని గుర్తు చేసుకుంది. 

67
kovai sarala

కోవై సరళ ఎందుకు పెళ్లి చేసుకోలేదు అని ప్రశ్నించగా.. పెళ్లి అవసరం ఏముందండీ.. పెళ్లి చేసుకునే జీవించాలని కండిషన్ ఏమీ లేదు అని తెలిపింది. ఇక తన జీవితంలో తండ్రి మరణించడం ఎంతో విషాదకరం అని కోవై సరళ పేర్కొంది. నేను ఊటీలో షూటింగ్ లో ఉన్నపుడు మా నాన్న చనిపోయారు. 

 

77

kovai sarala

నేను సినిమా చేస్తున్న నిర్మాణ సంస్థ చాలా చిన్నది. నా కోసం కాంబినేషన్ మొత్తం అక్కడే ఉంది. మా నాన్న చనిపోయారు అని చెప్పి వెళ్లిపోలేను. ఎందుకంటే ఆ కాంబినేషన్ మళ్ళీ కుదరదు. నిర్మాతలకు భారీ నష్టం వస్తుంది. తప్పని పరిస్థితుల్లో షూటింగ్ అయ్యే వరకు ఉండాల్సి వచ్చింది. కానీ అందరూ.. ఈ సినిమా వాళ్ళకి డబ్బు పిచ్చి ఎక్కువ. అందుకే తండ్రి మరణించినా షూటింగ్స్ చేస్తూనే ఉన్నారు అంటూ నిందలు వేశారని కోవై సరళ కంటతడి పెట్టుకుంది.  

click me!

Recommended Stories