'బీట్ రూట్'తో ఇలా చేస్తే అందమైన చర్మం మీ సొంతం.. అవి ఏంటంటే?

First Published Nov 24, 2021, 3:52 PM IST

ఆరోగ్యంగా ఉండాలన్నా అందంగా కనిపించాలన్నా మనం తీసుకునే ఆహారపు అలవాట్లలో తగిన పోషకాలు (Nutrients) తప్పనిసరిగా ఉండాలి. అప్పుడే మన ఆరోగ్యంతోపాటు చర్మ సౌందర్యం (Skin beauty) కూడా బాగుంటుంది. మనం నిత్యం వాడుకునే కూరగాయలలో బీట్ రూట్ చర్మ సౌందర్యాన్ని పెంచడానికి చక్కగా పనిచేస్తుంది. శరీరంలోని రక్తాన్ని వృద్ధి చేసి అనేక ఆరోగ్య సమస్యల నుంచి కాపాడుకునేలా చేస్తుంది బీట్ రూట్. ఇలాంటి బీట్ రూట్ లో చర్మ సౌందర్యాన్ని మెరుగుపరిచే అనేక రహస్యాలు దాగి ఉన్నాయి. ఇప్పుడు ఈ ఆర్టికల్ ద్వారా బీట్ రూట్ తో చర్మ సౌందర్యాన్ని ఏ విధంగా మెరుగుపరుచుకోవాలో తెలుసుకుందాం..

బీట్ రూట్ (Beat root) జ్యూస్ తాగితే చర్మ సౌందర్యం మెరుగుపడుతుంది. బీట్ రూట్ జ్యూస్ పొడిబారిన చర్మాన్ని (Dry skin) తగ్గించడానికి చక్కగా పనిచేస్తుంది. బీట్ రూట్ లో విటమిన్లు, ఖనిజ లవణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది చర్మం నిగారింపును పెంచుతాయి. చర్మానికి తగినంత తేమను అందించి ఆరోగ్యంగా ఉంచుతుంది.

దీంతో చర్మం పొడిబారకుండా ఉంటుంది. బీట్ రూట్ జ్యూస్ తాగడంతో పాటు ముఖానికి అప్లై చేసుకోవడంతో చర్మంపై ఉన్న మృత కణాలు (Dead cells) తగ్గిపోతాయి. అనేక కారణాలచేత ముఖంపైన మొటిమలు (Pimples)  ఏర్పడతాయి. ఇలా ఏర్పడిన మొటిమలను వాటి తాలూకు మచ్చలను తగ్గించుకోవడానికి బీట్ రూట్ జ్యూస్ చక్కగా పనిచేస్తుంది.

ఒక చెంచా పెరుగులో (Curd) రెండు చెంచాల బీట్ రూట్ జ్యూస్ ను కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖం పై ఏర్పడిన మొటిమలు (Pimples), మచ్చలు ఉన్న ప్రదేశంలో రాయాలి. అరగంట తర్వాత చల్లటి నీటితో ముఖాన్ని శుభ్రపరుచుకోవాలి. ఇలా చేయడంతో మొటిమలు, మొటిమల తాలూకు మచ్చలు తొందరగా తగ్గుతాయి. పెదాలు పొడిబారి నిర్జీవంగా కాంతిహీనంగా కనిపిస్తాయి.
 

పెదాలను తిరిగి కాంతివంతంగా మారడానికి బీట్ రూట్ జ్యూస్ చక్కగా పనిచేస్తుంది. బీట్రూట్ జ్యూస్ లో కొద్దిగా చక్కెర (Sugar) కలిపి ఆ మిశ్రమాన్ని పెదవులపై సున్నితంగా మసాజ్ (Massage) చేసుకోవాలి. బీట్ రూట్ లో సహజసిద్ధమైన గులాబిరంగు ఉంటుంది. ఇది పెదాలను తిరిగి కాంతివంతంగా చేయడంతోపాటు పెదాలకు పింక్ కలర్ ను అందిస్తాయి.  

కళ్ల కింద ఏర్పడే నల్లని వలయాలను (Black circles) తగ్గించుకోవడానికి బీట్ రూట్ జ్యూస్ ను అప్లై చేసుకోవాలి. ఇలా రోజూ బీట్ రూట్ జ్యూస్ ను అప్లై చేసుకోవడంతో కళ్ళకింద నల్లని వలయాలు తగ్గుతాయి. జుట్టుకు మంచి నిగారింపును ఇవ్వడానికి బీట్ రూట్ జ్యూస్ ను వాడితే మంచి ఫలితం ఉంటుంది. ఇందుకోసం బీట్ రూట్ జ్యూస్ ను కొద్దిగా వేడి చేసుకుని జుట్టు (Hair) కుదుళ్ల నుండి జుట్టు మొత్తానికి మర్దన చేసుకోవాలి.

ఇది  జుట్టుకు తగినంత తేమను అందించి ఒత్తుగా పెరగడానికి సహాయపడుతుంది. ముఖంపై ఉండే మచ్చలను తగ్గించుకోవడానికి  బీట్ రూట్ జ్యూస్ (Beetroot Juice) లో టమోటా జ్యూస్ (Tomato juice) కలిపి ముఖానికి అప్లై చేసుకోవాలి. ఇరవై నిమిషాల తరువాత ముఖాన్ని నీటితో శుభ్రపరుచుకోవాలి. ఇలా తరచూ చేయడంతో ముఖంపై ఉండే మచ్చలు తగ్గుతాయి.

click me!