ప్రభాస్‌కి ఇష్టమైన ఆట ఏంటో తెలుసా?.. హైట్‌ ఉన్నాడని అందులోకి తోసేశారట.. ఆరుదైన విషయాలు పంచుకున్న డార్లింగ్‌

First Published Apr 25, 2024, 10:44 AM IST

గ్లోబల్‌ స్టార్‌ ఇమేజ్‌ని సొంతం చేసుకున్న ప్రభాస్‌ కి ఆటలంటే ఇష్టం. తనకిష్టమైన ఆట గురించి, అది ఎలా ప్రారంభమయ్యిందో తెలిపారు ప్రభాస్‌. 
 

ప్రభాస్‌ ప్రస్తుతం పాన్‌ ఇండియా స్టార్‌గా రాణిస్తున్నారు. ఇండియాలోనే అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోగా రాణిస్తున్నారు. అంతేకాదు ఇండియాలోనే అత్యధిక మార్కెట్‌ హీరోగానూ నిలిచారు. ఆయన సినిమాలు రిలీజ్‌కి ముందే వెయ్యి కోట్ల బిజినెస్‌ చేస్తున్నాయంటే అతిశయోక్తి కాదు. ప్రభాస్‌ రేంజ్‌ని తెలియజేసేందుకు ఇవన్నీ ఉదాహరణలుగా చెప్పొచ్చు. 

రెబల్‌ స్టార్‌ కృష్ణంరాజు వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు ప్రభాస్‌. యంగ్‌ రెబల్‌ స్టార్‌ ఇమేజ్‌ని సొంతం చేసుకున్నారు. `బాహుబలి` చిత్రంతో పాన్‌ ఇండియా స్టార్‌గా ఎదిగాడు. అంతేకాదు ఇండియన్‌ సినిమాకి ఫేస్‌గా మారిపోయాడు. ఇప్పుడు భారీ సినిమాలతో బిజీగా ఉన్నాడు ప్రభాస్‌.
 

ప్రభాస్‌కి సంబంధించిన ఓ పాత వీడియో క్లిప్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. ప్రస్తుతం బయట ఐపీఎల్‌ సీజన్‌ రన్‌ అవుతుంది. సినిమా కంటే వాటికే ప్రయారిటీ ఇస్తున్నారు ఆడియెన్స్. ఐపీఎల్‌ మ్యాచ్‌లు అంతగా ఎంటర్‌టైన్‌మెంట్‌ని పంచుతుండటం విశేషం. ఈ క్రమంలో ప్రభాస్‌కి సంబంధించిన ఇష్టమైన ఆట ఏంటి? అనేది ఇప్పుడు వైరల్‌గా మారడం విశేషం. 
 

గతంలో రాజమౌళి కమాన్‌ ఇండియా పేరుతో ఓ సెలబ్రిటీ షో చేశారు. ఇందులో స్పోర్ట్స్ గురించి అవగాహన, ఆటలను ఎంకరేజ్‌ చేయాలని, ప్రభుత్వాలు వీటిపై ఫోకస్‌ చేయాలనే ఉద్దేశ్యంతో ఈ ప్రోగ్రామ్‌ చేశారు. ఇందులో సెలబ్రిటీలను గెస్ట్‌ లుగా పిలిచి వారికి నచ్చిన ఆట ఏంటి? ఎలా ఇష్టమైన ఆటగా మారింది, ఎలా స్టార్ట్ అయ్యింది, ఇప్పుడు ఇండియాలో క్రీడా రంగం ఎలా ఉంది? ఎలాంటి ఎంకరేజ్‌మెంట్‌ కావాలనే విషయాలను చర్చించారు. 

అందులో భాగంగా ఓ సారి ప్రభాస్‌.. రాజమౌళి షోకి గెస్ట్ గా వచ్చారు. ఈ సందర్బంగా ప్రభాస్‌.. తనకిష్టమైన ఆట గురించి వెల్లడించారు. అది ఎలా ప్రారంభమైందో తెలిపారు. తనకు వాలీబాల్‌ అంటే ఇష్టమట. ఇప్పుడు కూడా(ఈ షోలో పాల్గొన్న టైమ్‌కి) వాలీబాల్‌ ఆడుతానని తెలిపారు. తన గెస్ట్ హౌజ్‌లో వాలీబాల్‌ కోర్ట్ ఉంటుందట. వారానికి ఒకసారి, ఫ్రీగా ఉన్న సమయంలో వాలీబాల్‌ ఆడతానని తెలిపారు ప్రభాస్‌. 
 

అయితే వాలీబాల్‌ ఇష్టం ఎలా వచ్చిందో తెలిపారు. చిన్నప్పుడు స్కూల్‌ టైమ్‌లో వాలీబాల్‌ ఆడటం స్టార్ట్ అయ్యిందట. `స్కూల్‌లో టీములు చేసేసమయంలో నేను హైట్‌ ఉన్నానని తోసేశారు. అలా నెమ్మదిగా ఆ గేమ్‌ ఆడటం స్టార్ట్ చేశాను. ఆ తర్వాత నెమ్మది నెమ్మదిగా దానిపై ఇష్టం పెరిగింది. ఇప్పుడు ఫ్రీ టైమ్‌లో ఆడుతుంటాను` అని తెలిపారు ప్రభాస్‌. 
 

ఇండియాలో క్రీడల పరిస్థితిని వివరిస్తూ, మన వద్ద అంతగా ఎంకరేజ్‌మెంట్‌ లేదని తెలిపారు. విలేజ్‌ స్థాయిలోనే పేరెంట్స్, పెద్దలు ఇలాంటి ఆటలను ఎంకరేజ్‌ చేయాలన్నారు. అయితే ఆటలు ఆడితే లైఫ్‌లో సెక్యూరిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ ఆట ఆడితే, మంచి కెరీర్‌ ఉంటుంది, లైఫ్‌ ఉంటుంది, జాతీయంగా, అంతర్జాతీయంగా సత్తా చాటవచ్చు అనే విషయాలను పిల్లలకు చెప్పాలి, ఆ దిశగా మంచి కోచ్‌, గ్రౌండ్‌, బేసిక్‌ ఫెసిలిటీస్‌తో అరెంజ్‌ చేయాల్సి ఉంటుందని, అప్పుడే ఈ ఆటలపై ఆసక్తి ఏర్పడుతుందన్నారు. కేవలం క్రికెట్‌ మాత్రమే కాదు, మిగిలిన అన్ని ఆటలను ఎంకరేజ్‌ చేయాలన్నారు ప్రభాస్‌. 
 

ఇక ఆటలు ఆడటం వల్ల ఉపయోగాలేంటి? అనేది చెబుతూ, ఆరోగ్యం ఉంటుందని, రోజూ ఏదో ఒక ఆట ఆడితే బాడీ యాక్టివ్ గా ఉంటుందని, మానసికంగానూ ఆరోగ్యంగా ఎనర్జిటిక్‌గా ఉంటారని తెలిపారు. ఇప్పుడు పొల్యూషన్‌, వర్క్ ప్రెజర్స్ వల్ల చిన్న వయసులోనే బీపీలు, షుగర్లు వస్తున్నాయని, యాభై ఏళ్లైనా మంచి ఆరోగ్యంతో ఉండాలని ఇలాంటి ఆటలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు ప్రభాస్‌. 

ప్రస్తుతం ప్రభాస్‌.. `కల్కి2898ఏడీ` చిత్రంలో నటించారు. ఈ మూవీ జూన్‌లో రిలీజ్‌ కాబోతుంది. మరోవైపు మారుతి దర్శకత్వంలో `ది రాజాసాబ్‌` చిత్రంలో నటిస్తున్నారు. ఇది చిత్రీకరణ దశలో ఉంది. త్వరలోనే `సలార్‌ 2` ప్రారంభం కానుంది. ఈ ఏడాది చివర్లో `స్పిరిట్‌`ని వచ్చే ఏడాది హను రాఘవపూడితో సినిమాని చేయబోతున్నారు ప్రభాస్. ఇలా నాలుగైదు సినిమాలతో దాదాపు రెండు మూడేళ్లు ఆయన బిజీగా ఉన్నారు. 

click me!