పరిగడుపున వాము వాటర్ తాగితే ఒకటి కాదు.. రెండు కాదు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందుతారు

First Published Dec 23, 2022, 5:02 PM IST

ఖచ్చితంగా బరువు తగ్గాలని ప్లాన్ వేసుకున్నారా? అయితే మీకు వాము వాటర్ అద్భుతంగా పనిచేస్తుంది. ప్రతి రోజూ ఉదయం పరిగడుపున గ్లాస్ వాము వాటర్ ను తాగితే ఎన్నో అనారోగ్య సమస్యలు నయమవుతాయి. 
 

మన వంటగదిలో ఉండే మసాలా దినుసుల్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. అజీర్థి, వెయిట్ లాస్, దగ్గు, జలుబు వరకు ఎన్నో  అనారోగ్య సమస్యలను వంటింట్లో ఉండే పదార్థాలతోనే తగ్గించుకోవచ్చు. చాలా మంది ఆడవారు చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకు వంటింటి చిట్కాలనే ఉపయోగిస్తుంటారు. ఉదయాన్నే వాము వాటర్ తాగమని పెద్దలు చెప్తుంటారు. ముఖ్యంగా పదేపదే కడుపునకు సంబంధించిన సమస్యలు, అజీర్ణంతో బాధపడేవారికి వాము నీళ్లు బాగా ఉపయోగపడతాయి. వాము జుట్టు, బరువు తగ్గడం, పిసిఒఎస్ సమస్యలను కూడా తగ్గిస్తుంది. వామును రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయం తాగడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలను పొందుతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 

వామును చాలా మంది పచ్చిగానే తింటుంటారు. అలాగే ఆహారంలో కూడా ఎక్కువగా కలుపుతుంటారు. నిజానికి వామును తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందుతారు. అందులో బరువు తగ్గడం ఒకటి. ఖచ్చితంగా బరువు తగ్గాలనుకుంటే.. మీకు వాము నీరు అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే ఉదయం పరిగడుపున ఒక గ్లాసు వాము నీటిని తాగితే ఎన్నో సమస్యల నుంచి బయటపడతారు.అవేంటంటే.. 
 

బరువు తగ్గడానికి సహాయపడుతుంది

ఒకటి రెండు రోజుల్లో బరువు తగ్గడం చాలా చాలా కష్టం. కానీ రెగ్యులర్ గా పరిగడుపున వాము వాటర్ ను తాగితే మాత్రం ఖచ్చితంగా బరువు తగ్గుతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.  మీ జీవనశైలి బరువు తగ్గించే ప్రయాణాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ఈ నీళ్లు ఈ ప్రక్రియకు సహాయపడుతుంది.
 

జీవక్రియను వేగవంతం చేస్తుంది

జీవక్రియను వేగవంతం చేయడంలో వాము వాటర్ చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది మీ జీర్ణక్రియ ప్రక్రియను వేగవంతం చేస్తుంది. అలాగే అజీర్థాన్ని నివారించడానికి సహాయపడుతుంది. ఈ విధంగా మెటబాలిక్ యాక్టివిటీని పెంచడం వల్ల మలబద్ధకం, ఊబకాయం వంటి సమస్యలు తగ్గిపోతాయి. 
 

దురద, బొబ్బలను వదిలిస్తుంది

మీరు ఏదైనా బొబ్బలు, దురద లేదా తామరతో బాధపడుతుంటే.. వామును తీసుకుని గోరువెచ్చని నీటితో పేస్ట్ చేసి ఆ ప్లేస్ లో పెట్టండి. ఇది బొబ్బలను తగ్గించడానికి ఎంతో సహాయపడుతుంది. 
 

గట్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది

గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడేవారికి వాము వాటర్ చాలా మంచిది. కడుపు నొప్పి లేదా తిమ్మిరిని తగ్గించడానికి కూడా ఇది సహాయపడుతుంది. పరిగడుపున వాము వాటర్ ను తాగినప్పుడు మీ గట్ లోని ఎంజైమ్లు సక్రియం అవుతాయి. దీంతో జీర్ణక్రియ మరింత మెరుగ్గా పనిచేస్తుంది. గ్యాస్ సమస్య తొలగిపోతుంది. 
 

శ్వాసకోశ సమస్యలకు సహాయపడుతుంది

వాము నీరు ఆస్తమా రోగులకు దివ్య ఔషదంలా పనిచేస్తుంది. ఎందుకంటే గాలి మార్గాన్ని సడలించడానికి సహాయపడుతుంది. ఇది శ్వాస సులువుగా తీసుకోవడానికి సహాయపడుతుంది. ఇది ఊపిరితిత్తులను, స్వరపేటికను శుభ్రంగా ఉంచుతుంది. ఏవైనా అడ్డంకులు ఉంటే తొలగిస్తుంది.

click me!