చంద్రబాబు , రేవంత్ రెడ్డి ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. వీరులో ఎవరు రిచ్..?  

First Published Apr 24, 2024, 11:44 AM IST

Chandrababu Naidu Vs Revanth Reddy: ఎన్నికల సమయంలో నామినేషన్లు దాఖలు చేస్తున్న క్రమంలో అభ్యర్థులు తమ అఫిడవిట్ లలో ఆస్తులు, అప్పులు చూపించాల్సి ఉంటుంది. ఇక ఏపీలో చంద్రబాబు, ఇటు తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ఆస్తుల వివరాలు ఏంటీ..? ఎవరి ఆస్తి పెరిగింది..? ఆస్తులవిషయంలో ఎవరు ముందున్నారు.. అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.  

Chandrababu Naidu

దేశమంతా ఎన్నికల పండగ మొదలైంది. ఇటు ఆంధ్రప్రేదేశ్ లో కూడా ఎన్నికల సందడి మొదలైంది. నాయకుల ప్రచారాలతో ఆంధ్రరాష్ట్రమంతా దద్దరిల్లిపోతుంది. పార్టీల అధినేతలు చంద్రబాబు, పవన్, జగన్ ల నామినేషన్లు.. అందులో వారు చూపిన ఆస్తులు హాట్ టాపిక్ గా మారాయి. అలాగే ఇటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆస్తుల లెక్కలు కూడా ఎన్నికల సమయంలో బహిర్గతం అయ్యాయి.   

Chandrababu naidu

 ఏపీలో చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల నామినేషన్ కోసం సమర్పించిన అఫిడవీట్ లో పొందుపరిచిన తమ సొంత ఆస్తులు.. తమ కుటుంబ సభ్యులు పేరుమీద ఉన్న ఆస్తుల వివరాల ప్రకారం ఎవరు ముందున్నారు అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. 

ఇటీవల తెలుగు దేశం అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు త‌ర‌ఫున ఆయ‌న భార్య భువ‌నేశ్వ‌రి శుక్ర‌వారం నామినేషన్‌ పత్రాలను దాఖలు చేసిన విష‌యం తెలిసిందే. ఈ సంద‌ర్భంగా సమర్పించిన అఫిడవిట్‌లో  చంద్రబాబు, భువనేశ్వరి, లోకేష్, బ్రాహ్మణి, దేవాన్ష్ ల పేరుపై ఉన్న ఆస్తుల వివరాలను ఎన్నికల సంఘానికి  అందించారు.

 తాజా అఫిడవిట్ ప్రకారం చంద్ర‌బాబు నాయుడు పేరిట రూ.4.80 లక్షల చరాస్తులు ఉన్నాయి. ఇక హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ వైస్ ప్రెసిడెంట్, మేనేజింగ్ డైరెక్టర్ అయిన‌ భువనేశ్వరి రూ. 763.93 కోట్ల విలువైన హెరిటేజ్‌ షేర్లు సహా రూ. 810.37 కోట్ల చరాస్తులను కలిగి ఉన్నారు. 

ఇక నారా లోకేష్ కుటుంబ ఆస్తులు విలువ 542 కోట్ల వరకూ ఉంది. ఇక చంద్రబాబు కుటుంబ ఆస్తుల విలువ టోటల్ గా 1,473 కోట్లుగా ఉంది. ఈ సంద‌ర్భంగా సమర్పించిన అఫిడవిట్‌లో చంద్రబాబుకు 1994లో కొనుగోలు చేసిన అంబాసిడర్ కారు ఉండగా, ఆయన భార్య‌ భువనేశ్వరికి సొంత వాహ‌నం లేద‌ని వెల్ల‌డైంది. అలాగే గత ఐదేళ్లలో ఈ దంప‌తుల‌ ఆస్తులు 39 శాతం పెరిగిందని వెల్లడించారు.

revanth reddy family

 ఇక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆస్తుల వివరాల్లోకెళితే ఆయన నికర ఆస్తుల విలువ రూ.30 కోట్లుగా ఉందని తెలుస్తుంది. రేవంత్ రెడ్డి అఫిడవిట్ లో తెలిపిన దాని ప్రకారం ఆయన వద్ద సుమారుగా  రూ.5,34,000 నగదు, ఆయన భార్య గీతా రెడ్డి ఆస్తులతో కలుపుకుని స్థిర చర ఆస్తుల విలువ ప్రస్తుతం  రూ.30,95,52625 గా ఉందని ఆయన ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్ లో పేర్కొన్నారు.

అలాగే సీఎం రేవంత్ రెడ్డి భార్య వద్ద 1235 గ్రాముల బంగారం, వజ్రాల ఆభరణాలు ఉండగా, 9700 గ్రాముల వెండి వస్తువులు ఉన్నాయని తెలిపారు. అలాగే ఆయన వద్ద  ఒక మెర్సిడిస్ బెంజ్, ఒక హోండా సిటీ  వాహనాలు కూడా ఉన్నాయని తెలిపారు.  వాటితో పాటుగానే రేవంత్ రెడ్డి వద్ద ఓ రైఫిల్ ,  పిస్టల్ ఉండగా వాటి విలువ సుమారుగా రూ.250000 గా ఆయన  అఫిడవిట్లో పేర్కొన్నారు. ఇక అప్పుల విషయానికొస్తే సీఎం రేవంత్ రెడ్డి, ఆయన సతీమని గీతారెడ్డి పేర్ల మీద సుమారుగా 1,30,19,901 మేర అప్పులు ఉన్నాయని తెలిపారు.
 

click me!