ఈ మూలికా టీ లను తాగితే.. బెల్లీ ఫ్యాట్ ఎంత ఫాస్ట్ గా తగ్గుతుందో.. !

First Published Jan 3, 2023, 4:59 PM IST

ఎన్ని తిప్పలు పడ్డా బెల్లీ ఫ్యాట్ ను మాత్రం కరిగించలేం. కానీ కొన్ని రకాల హెర్బల్ టీలు బెల్లీ ఫ్యాట్ ను కరిగించడంలో ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఈ టీలు శరీరాన్ని నిర్విషీకరణ చేయడానికి కూడా సహాయపడతాయి. 

బరువును, బెల్లీ ఫ్యాట్ ను కరిగించడమంత కష్టం మరొకటి లేదంటుంటారు చాలా మంది. నిజమే వెయిట్ లాస్ అవ్వడం చాలా చాలా కష్టం మరి. దీనికోసం రెగ్యులర్ గా వ్యాయామం చేయాలి. ఏదేమైనా పట్టువిడువకుండా ప్రయత్నిస్తే మాత్రం పక్కాగా బరువు తగ్గుతాయి. అయితే  చేతులు, ముఖం వంటి మీ శరీరంలోని ఇతర భాగాల నుంచి కొవ్వును కరిగించొచ్చు. కానీ బెల్లీ ఫ్యాట్ ను మాత్రం అంత సులువుగా తగ్గించలేం. కడుపు చుట్టూ విసెరల్ కొవ్వు ఉంటుంది. కానీ ఇది ఎన్నో అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. పలు అధ్యయనాల ప్రకారం.. హృదయ సంబంధ వ్యాధులకు, బొడ్డు కొవ్వుకు దగ్గరి సంబంధం ఉంటుంది. బెల్లీ ఫ్యాట్  పెరగడానికి ఎన్నో కారణాలుంటాయి. ఏదేమైనా మీ బెల్లీ ఫ్యాట్ ను తగ్గించడానికి 5 మూలికా టీలు బాగా ఉపయోగపడతాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

green tea

గ్రీన్ టీ

గ్రీన్ టీ లో మన ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో కారకాలుంటాయి. దీనిలో కాటెచిన్స్ అని పిలువబడే యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మొండి బొడ్డు కొవ్వును తగ్గించడానికి సహాయపడతాయి. గ్రీన్ టీని క్రమం తప్పకుండా తాగడం వల్ల బెల్లీ ఫ్యాట్ ఫాస్ట్ గా కరుగుతుందని ఎన్నో అధ్యయనాలు నిరూపించాయి  కూడా. దీనిలో ఉండే కాటెచిన్స్  కొవ్వును కాల్చే కాలేయ సామర్థ్యాన్ని పెంచుతాయి. గ్రీన్ టీలు మన రోగనిరోధక శక్తిని కూడా పెంచుతాయి.

పిప్పరమింట్ టీ

పిప్పరమింట్ టీ బరువును తగ్గించడంలో ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. ఈ టీ గుండెల్లో మంటను కూడా తగ్గిస్తుంది. అలాగే మీ స్కిన్ టోన్ ను మెరుగుపరుస్తుంది కూడా. ఈ టీని తాగితే రాత్రిళ్లు ప్రశాంతంగా నిద్రపోతారు. కడుపు నిండిన సంతృప్తిని పెంచుతాయి. ఇవన్నీ మీరు సులువుగా బరువు తగ్గడానికి సహాయపడతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా పిప్పరమింట్ టీని తాగడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. దీనిని మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు తాగొచ్చు. 

పసుపు టీ

అధిక బరువు, ఊబకాయం లేదా బెల్లీ ఫ్యాట్ ను కరిగించడంలో పసుపు టీ ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. మెటబాలిక్ సిండ్రోమ్ ను తగ్గించడానికి కూడా ఇది సహాయపడుతుంది. పొత్తికడుపు చుట్టూ పేరుకుపోయిన కొవ్వు వల్ల జీవక్రియలో మార్పులు వచ్చి జీవక్రియ సిండ్రోమ్ కు దారితీస్తుంది. పసుపు కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ స్థాయిలను బాగా తగ్గిస్తుంది. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. 
 

cinnamon tea

నిమ్మకాయ దాల్చిన చెక్క టీ

నిమ్మకాయలో విటమిన్ సి తో పాటుగా పెక్టిన్ ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీమన రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అలాగే ఆకలిని నియంత్రిస్తాయి. అంతేకాదు బెల్లీ ఫ్యాట్ ను కరిగిస్తాయి కూడా. బరువును తగ్గించే ప్రభావవంతమైన పానీయాలో లెమన్ టీ ఒకటి. నిమ్మరసంలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. ఇది బరువు తగ్గడానికి బాగా సహాయపడుతుంది. దాల్చినచెక్కలో క్రోమియం అనే ఖనిజ సమ్మేళనం పుష్కలంగా ఉంటుంది. ఇది ఆకలిని నియంత్రించడానికి బాగా సహాయపడుతుంది. ఈ మసాలా టీలో ఫైబర్, విటమిన్లు, మన శరీరానికి అవసరమైన ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ మీరు వేగంగా బరువు తగ్గడానికి సహాయపడతాయి. 

తులసి టీ

తులసి ఆకుల్లో ఎన్నో ఔషదగుణాలుంటాయి. ఈ ఆకులు జీవక్రియను ప్రేరేపిస్తాయి. మీ జీవక్రియ ఎంత ఫాస్ట్ గా ఉంటే.. మీరు అంత ఎక్కువ కేలరీలను కరిగించగలుగుతారు.  తులసి ఆకులు జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తాయి. అలాగే శరీరం నుంచి విషాన్ని తొలగించడానికి కూడా ఈ తులసి టీలు సహాయపడుతాయి. 

click me!