New Year 2022: న్యూ ఇయర్ సంబరాలు చేసుకోవడానికి సూపర్ ప్లేసులు ఇవే..!

First Published Dec 18, 2021, 3:22 PM IST

ఈ నూతన సంవత్సర వేడుకలను ఆనందంగా జరుపుకోవడానికి అనువైన ప్రదేశాలు మన దేశంలో చాలా ఉన్నాయి. ఆ ప్రదేశాల్లో.. న్యూ ఇయర్ వేడుకలను అంగరంగ వైభంగా నిర్వహిస్తారు. మరి ఆ ప్రదేశాలేంటో ఓసారి చూసేద్దామా...

మనమంతా కొద్ది రోజుల్లో నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం. ప్రతి సంవత్సరం న్యూ ఇయర్ వేడుకలను ఆనందంగా.. జరుపుకోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అయితే.. ఈ నూతన సంవత్సర వేడుకలను ఆనందంగా జరుపుకోవడానికి అనువైన ప్రదేశాలు మన దేశంలో చాలా ఉన్నాయి. ఆ ప్రదేశాల్లో.. న్యూ ఇయర్ వేడుకలను అంగరంగ వైభంగా నిర్వహిస్తారు. మరి ఆ ప్రదేశాలేంటో ఓసారి చూసేద్దామా...

1.గోవా..

భారత్ లోని అత్యంత సుందరమైన ప్రదేశాల్లో గోవా ఒకటి. గోవాని భారత్  లాస్ వెగాస్ గా పోలుస్తారు. ఈ ప్రాంతానికి ప్రతి సంవత్సరం కొన్ని వేల మంది పర్యాటకులు వస్తూ ఉంటారు. కాగా.. ఈ గోవాలో.. న్యూ ఇయర్ వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు. ఇక్కడ.. బీర్ చాలా చీప్ గా లభిస్తుంది. లైవ్ మ్యూజిక్,  నైట్ లాంగ్ పార్టీలు అక్కడ నిర్వహిస్తారు. చాలా సరదాగా ఉంటుంది. బాగా ఎంజాయ్ చేయవచ్చు.
 

2.ఢిల్లీ..

దేశ రాజధాని ఢిల్లీలోనూ న్యూఇయర్ వేడుకలు ఎక్కువగా నిర్వహిస్తారు. ఇక్కడ నిత్యం ఏదో ఒక పార్టీలు చేస్తూనే ఉంటారు. లైవ్ మ్యూజిక్, డ్యాన్స్ పార్టీలు ఎక్కువగా నిర్వహిస్తారు. ఇండియాగేట్ వద్ద వేడుకలు బాగా నిర్వహిస్తారు.
 

3.ఉదయ్ పూర్ (రాజస్థాన్)

న్యూ ఇయర్ వేడుకలను బాగా ఎంజాయ్ చేయాలని అనుకునేవారు.. రాజస్థాన్ లోని ఉదయ్ పూర్  కి వెళ్లొచ్చు. అక్కడ న్యూ ఇయర్ వేడుకలను చాలా అందంగా నిర్వహిస్తారు. న్యూఇయర్ ని స్వాగతించడానికి అక్కడ వారు.. విభిన్న రీతిలో పార్టీలు నిర్వహిస్తారు.
 

4.కోల్ కతా ( పశ్చిమ బెంగాల్)

దేశంలోని అందమైన ప్రాంతాల్లో కోల్ కతా కూడా ఒకటి. ఇక్కడ కూడా న్యూ ఇయర్ ని చాలా అందంగా నిర్వహిస్తారు. ఇప్పటి వరకు న్యూ ఇయర్ ఎక్కడ చేసుకోవాలని అనే ప్లాన్ చేసుకోకపోతే.. అక్కడకు వెళ్లి చక్కగా కొత్త సంవత్సరాన్ని స్వాగతించవచ్చు.
 


5.షిల్లాంగ్..
చాలా ప్రశాంతంగా న్యూ ఇయర్ వేడుకలను నిర్వహించాలనుకుంటే.. నేచర్ మధ్యలో ఎంజాయ్ చేయాలి అనుకుంటే.. న్యూ ఇయర్ సమయానికి.. షిల్లాంగ్ కి బ్యాగ్ సర్దేసుకోవాలి. అక్కడ.. బాగా రిలాక్స్ అవ్వచ్చు.  నచ్చినట్లు ఎంజాయ్ చేయవచ్చు.

6.గుల్మార్గ్( జమ్మూకశ్మీర్)
ఈ బ్యూటిఫుల్ ప్లేస్ లో...  న్యూ ఇయర్ ని హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చు. లైవ్ మ్యూజిక్, పార్టీలకు ఇది బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. ఇక్కడ వినూత్నంగా.. కొత్త సంవత్సరానికి స్వాగతం పలకవచ్చు.

7.కేరళ..
ఎప్పుడైనా బీచ్ పార్టీలు చాలా సరదాగానే ఉంటాయి. అయితే.. కేరళలో న్యూ ఇయర్ వేడుకలు ఇంకా అందంగా ఉంటాయి. బోట్ హౌస్ లో కూడా పార్టీలను ఎంజాయ్ చేయవచ్చు.  కేరళ చూడటానికి కూడా చాలా అందంగా ఉంటుంది. చూడటానికి రెండు కళ్లు సరిపోవనే చెప్పొచ్చు.

click me!