500కే మినీ ఏసీ ! సమ్మర్ వేడిని తట్టుకోవడానికి ఒక కూల్ ఆలోచన!

First Published May 3, 2024, 12:28 PM IST

వేసవిలో ACలు వంటి ఖరీదైన కూలింగ్ పరికరాలను కోనలేని వ్యక్తులు బడ్జెట్ ధరలలో లభించే ఎయిర్ కూలర్లను కొనవచ్చు.
 

ఎండలు రోజురోజుకు పెరుగుతుండడంతో  మండుతున్న ఎండలకు ప్రజలు ఎన్నో  ఇబ్బందులు పడుతున్నారు. శరీరంలోని వేడిని తగ్గించుకోవడానికి ఎన్నో రకాలుగా చల్లదనాన్ని కోరుకుంటారు. ఈ వాతావరణంలో ఏసీలు వంటి ఖరీదైన కూలింగ్ పరికరాలను కొనలేని వారు బడ్జెట్ ధరలలో లభించే ఎయిర్ కూలర్లను కొనుగోలు చేయవచ్చు.
 

మినీ ఏసీలుగా పిలిచే ఈ చిన్న ఎయిర్ కూలర్లు రూ.499 నుంచి రూ.2000 వరకు వివిధ మోడళ్లలో అందుబాటులో ఉన్నాయి. మినీ ఏసీ వల్ల ఎక్కువ కరెంటు ఖర్చు కానందున కరెంటు బిల్లుల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
 

Latest Videos


 AOXITO మినీ కూలర్ అమెజాన్‌లో రూ.499 ధరకు  లభిస్తుంది. USB ఇంకా బ్యాటరీతో ఈ కూలర్ 10 గంటల వరకు పనిచేస్తుంది. దీనికి ఎక్కువ నీరు కూడా అవసరం లేదు.

USB డెస్క్ ఫ్యాన్‌తో కూడిన NTMY మినీ ఎయిర్ కూలర్‌లో LED లైట్ కూడా ఉంది. 3 స్ప్రే మోడ్‌లు ఉంటాయి. ఇందులో నీరు ఇంకా  ఐస్ క్యూబ్స్ రెండింటినీ ఉపయోగించవచ్చు. ఇంకా 12 గంటల వరకు ఉంటుంది. దీని ధర రూ.1,187.
 

SKYUP మినీ ఎయిర్ కూలర్ రూ.1,848 ధరలో అందుబాటులో ఉంది.  బ్యాంకు కార్డుల ద్వారా చేసే కొనుగోళ్లపై రూ.500  డిస్కౌంట్  కూడా ఇవ్వబడుతుంది. 600 మి.లీ. వాటర్ ట్యాంక్, 7 లైట్స్ మోడ్ వంటి  ఫీచర్లతో కూడిన మినీ ఏసీ ఇది. కరెంట్ కూడా చాలా ఆదా అవుతుంది.
 

ఎన్నో మినీ AC మోడల్‌లు ఇప్పుడు హైడ్రో-సిల్ టెక్నాలజీ అండ్  డ్యూయల్ కూలింగ్ జెట్‌ వంటి ఫీచర్‌లతో వస్తున్నాయి. దీంతో తక్కువ ధరకే ఏసీ లాంటి కూలింగ్ ఉంటుంది.
 

click me!