చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చరణ్, వైరల్ అవుతున్న వీడియో..

Published : May 03, 2024, 01:05 PM IST

గ్లోబల్ స్టార్ ఇమేజ్ వచ్చినా కాని.. తండ్రి చాటు తనయుడిగానే ఉంటాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. నాన్న కోసం ఏం చేయడానికైనా వెనకాడడు. మెగాస్టార్ కోసం ఓ సందర్భంలో పాట కూడా పాడాడట చరణ్.. ఎప్పుడంటే...?   

PREV
16
చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చరణ్, వైరల్ అవుతున్న వీడియో..

టాలీవుడ్ ను దాటి.. పాన్ ఇండియాను టచ్ చేసి.. వరల్డ్ సినిమాను ఆకర్శించాడు రామ్ చరణ్. తాజాగా ఆయనకు గ్లోబల్ స్టార్ అని బిరుదు కూడా ఇచ్చారు. ఎంత స్టార్ గా ఎదిగినా.. తండ్రి దగ్గర ఒదిగే ఉంటాడు రామ్ చరణ్. నాన్న మాట మీరని తనయుడిగా చరణ్ కు మంచి పేరు ఉంది. గతంలో ఎలా ఉన్నా.. ప్రస్తుతం ఎదిగే కొద్ది ఒదిగి ఉండటం చరణ్ కు బాగా అలవాటు అయ్యింది. 

రోజా, లయ, గౌతమి కూతుర్లను చూశారా..? హీరోయిన్లను మించిన అందం వారి సొంతం..

26

చిరంజీవి తనయుడిగా ఇండస్ట్రీలోకి  ఎంట్రీ ఇచ్చినప్పటికీ తనకంటూ ప్రత్యేకమైన  గుర్తింపు తెచ్చుకున్నాడు రామ్ చరణ్. మగధీర సినిమాతో భారీ హిట్ అందుకున్న ఆయన.. రంగస్థలం సినిమాతో నటుడుగా తనను తాను నిరూపించుకున్నాడు. ఈసినిమాలో డీ గ్లామర్ రోల్ తో..విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు చరణ్. 

ధనుష్ లేకుండానే ఐశ్వర్య రజినీకాంత్ గృహ ప్రవేశం.. కొత్తిల్లు కొన్న సూపర్ స్టార్ కూతురు..

36

ఆర్ఆర్ఆర్ రామ్ చరణ్ కు ప్రపంచ స్థాయి గుర్తింపు తీసుకువచ్చింది. ఆసినిమా చూసిన జేమ్స్ కామరూన్ లాంటి దిగ్గజ దర్శకులు కూడా చరణ్ నటనను ప్రశంసించకుండా ఉండలేకపోయారు. రెండు సార్లు రామ్ చరణ్ ను అభినందించారు. ఇలా ఉన్నత శిఖరాలు  చాలా చిన్నవయస్సులోనే చూసిన రామ్ చరణ్.. ఎంత ఎదిగిన  వినయంగా ఉంటాడు. 

46

మెగాస్టార్ నుంచి నేర్చుకున్న  డిసిప్లేన్ తనను తాను తీర్చిదిద్దుకునేలా చేసిందని పలు సందర్భాల్లో చెప్పారు చరణ్. ఇక తండ్రీ కొడుకులు సినిమాల విషయంలో ఒకరికి ఇంకొకరు సహకరించుకోవడం జరుగుతూనే ఉంటుంది. ఆ క్రమంలోనే చిరంజీవి కోసం రామ్ చరణ్ పాట పాడిన సందర్భం ఒకటి ప్రస్తుతం వైరల్ అవుతోంది. 

56

అవును చిరంజీవి కోసం రామ్ చరణ్ మొదటి సారి సింగర్ గా మారారు. చిరంజీవి ప్రజారాజ్యం పేరుతో రాజకీయ పార్టీ పెట్టిన విషయం తెలిసిందే. ఆ పార్టీ కోసం మెగాస్టార్ చాలా కష్టపడ్డారు. తండ్రి కష్టం చూసి..  రామ్ చరణ్ కూడా తండ్రికి సహాయం చేయడానికి ముందుకు వచ్చాడు. మెగాస్టార్ కోసం  సింగర్ గా మారారు చరణ్. 
 

66

 పార్టీ కోసం మణిశర్మ సంగీతంలో చరణ్ ఓ పాటను పాడారు. ఈ పాటకు సంబందించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చిరంజీవి హీరోగా నటించిన రాజా విక్రమార్క సినిమాలోని సాంగ్ ను ప్రజారాజ్యం కోసమా రీమిక్స్ చేశారు. ఆ పాట అప్పటిలో ఓ ఊపు ఊపేసింది. ఇక ఇప్పుడు ఈ న్యూస్ వైరల్ అవుతోంది. 

click me!

Recommended Stories