రోజా ప్రస్తుతం రాజకీయాల్లో సంచలనంగా నిలిచింది కానీ ఒకప్పుడు ఆమె టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్. స్టార్ హీరోలందరితో ఆడిపాడింది. చిరంజీవి, వెంకటేష్, బాలయ్య ఇలా అందరు హీరోలతో నటించింది. ఆంధ్రప్రదేశ్ లో పుట్టి పెరిగిన తెలుగు అమ్మాయిగా రోజా రాణించింది. గ్లామరస్ హీరోయిన్ గా యువతని రోజా ఆకట్టుకుంది.