సెక్స్ కు ముందు, తర్వాత వీటిని ఫాలో అవ్వకపోతే ఎన్నో సమస్యలొస్తయ్ జాగ్రత్త..

First Published Mar 20, 2023, 9:54 AM IST

లైంగిక జీవితం మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కానీ చాలా మంది లైంగిక పరిశుభ్రత నియమాలను మాత్రం పాటించరు. దీనివల్ల లైంగిక ఆరోగ్యమే కాదు మీ మొత్తం  ఆరోగ్యం దెబ్బతింటుంది తెలుసా? 
 


సెక్స్ మీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. హై బీపీ నుంచి బ్లడ్ షుగర్ లెవెల్స్ వరకు ఎన్నో సమస్యలను నియంత్రణలో ఉంచుతుంది. గుండెను  ఆరోగ్యంగా ఉంచుతుంది. అనవసరమైన కొవ్వును కరిగించడంతో పాటుగా ఎన్నో విధాలుగా ప్రయోజనకరంగా ఉంటుంది. కానీ చాలా మంది లైంగిక ఆరోగ్యం గురించి పట్టించుకోరు. గుడ్డిగా ముందుకు వెళతారు. దీనివల్లే ఎన్నో సమస్యలను కోరి తెచ్చుకుంటున్నారు. దీనివల్లే లైంగిక అవయవాలలో అంటువ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. ఇవి కోలుకోలేని విధంగా ఉంటాయి. చాలా ఎక్కువ సమయం పడుతుంది కూడా. అంతేకాదు ఇవి పిల్లలు పుట్టే సామర్థ్యాన్ని తగ్గిస్తాయి. అదే లైంగిక అవయవాల పట్ల పరిశుభ్రంగా ఉంటే వంధ్యత్వం వంటి ముఖ్యమైన ఆరోగ్య సమస్యల ప్రమాదం తగ్గుతుంది. లైంగిక కార్యకలాపాలకు కూడా అంతరాయం కలగదు. ఇంతకీ సెక్స్ లైఫ్ బాగుండటం కోసం ఎలాంటి పరిశుభ్రత నియమాలను పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 

ప్రైవేటు ప్రాంతాలను శుభ్రం చేయడం

ఇది ప్రత్యేకకంగా చెప్పాల్సిన అవసరం లేదు. లైంగిక ఆరోగ్యం మెరుగ్గా ఉండాలంటే ప్రైవేట్ ప్రాంతాలను ఖచ్చితంగా శుభ్రపరచాలి. ఎందుకంటే ఈ ప్రాంతాల్లో కొంచెం అపరిశుభ్రంగా ఉన్నా సూక్ష్మక్రిము విపరీతంగా పెరిగిపోతాయి. అయితే ప్రైవేటు ప్రాంతాలను సాదా నీటితోనే సున్నితంగా శుభ్రం చేయాలి. టీవీలో వచ్చే యాడ్ లను చూసి గుడ్డిగా రసాయన ఉత్పత్తులను ఉపయోగించకూడదు. 
 

శృంగారానికి ముందు, తరువాత 

సెక్స్ లో పాల్గొనడానికి ముందు,  ఆ తర్వాత మిమ్మల్ని మీరు శుభ్రం చేసుకోవాలి. ఎందుకంటే ఇది శారీరక ద్రవాల వల్ల కలిగే ప్రమాదాలను తగ్గిస్తుంది. మీరు గోరువెచ్చని నీరు, తేలికపాటి సబ్బుతో స్నానం చేయండి. అలాగే మీ ప్రైవేట్ ప్రాంతాలను కూడా శుభ్రం చేయాలి. 
 

డౌచింగ్ 

చాలా మంది ఆడవారు యోనిని శుభ్రంగా ఉంచడానికి డౌచింగ్ ను ఉపయోగిస్తుంటారు. కానీ ఇది అంటువ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది, యోని సాధారణ పీహెచ్ స్థాయిని దెబ్బతీస్తుంది. అలాగే ఇతర ఆరోగ్య ప్రమాదాలను కూడా కలిగిస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. యోని తనను తాను శుభ్రపరుచుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. అవసరమైతే సాదా నీళ్లు పోసి శుభ్రం చేయండి చాలు. 
 

సెక్స్ తర్వాత మూత్రాశయాన్ని ఖాళీ చేయండి

సెక్స్  ముగిసిన వెంటనే నేరుగా టాయిలెట్ కెళ్లి మూత్రవిసర్జన చేయండి. తర్వాత యోనిని నీళ్లతో కడకండి. మూత్రవిసర్జన శరీరంలోకి ప్రవేశించే అవకాశం ఉన్న క్రిములను బయటకు పంపడానికి సహాయపడుతుంది. మీరు, మీ భాగస్వామి ఎంత పరిశుభ్రంగా ఉన్నా సూక్ష్మక్రిములు సంక్రమించే అవకాశాలను చాలానే ఉన్నాయి. అందుకే సెక్స్ తర్వాత ప్రైవేట్ భాగాలను ఖచ్చిచంగా శుభ్రం చేసుకోవాలి. .
 

సెక్స్ టాయ్స్ ని మీరు ఉపయోగిస్తుంటే..

మిమ్మల్ని మీరు ఆరోగ్యంగా ఉంచుకోవడం ఎంత ముఖ్యమో.. మీరు ఉపయోగించే వస్తువులను కూడా శుభ్రంగా ఉంచడం కూడా అంతే ముఖ్యం. ఒకవేళ మీరు సెక్స్ టాయ్స్ ను ఉపయోగిస్తుంటే దాన్ని యూజ్ చేసిన ప్రతి సారి శుభ్రం చేయాలి. వాటిని అప్పుడే క్లీన్ చేయాలి. ఎక్కువ సేపు అలాగే ఉంచకూడదు. 

కండోమ్ లను మార్చండి

సంభోగంలో ప్రతి రౌండ్ తర్వాత ఖచ్చితంగా కండోమ్ ను మార్చాలి. సెక్స్ భంగిమలను మార్చినప్పుడు కూడా కండోమ్ లను మార్చాల్సి ఉంటుంది. అంటే anal sex, ఓరల్ సెక్స్ లకు ఖచ్చితంగా మార్చాలి. అదే కండోమ్ ను ఉపయోగిస్తే ఇన్ఫెక్షన్ల ప్రమాదం పెరుగుతుంది. 
 

ఈ సంకేతాలను తేలిగ్గా తీసుకోకండి

ప్రతి ఇన్ఫెక్షన్ కూడా తేలికపాటి లక్షణాలతో ప్రారంభమవుతుంది. ఈ లక్షణాలను గనుక నిర్లక్ష్యం చేస్తేత వ్యాధులు తీవ్రదశకు చేరుకుంటాయి. ప్రైవేటు ప్రాంతాల్లో దద్దుర్లు, దురదలు, మంట వంటి లక్షణాలను గమనిస్తే వీలైనంత తొందరగా హాస్పటల్ కు వెళ్లండి. 

click me!