తీయని మామిడి పండ్లను ఎలా గుర్తించాలి?

First Published | May 2, 2024, 10:56 AM IST

ముందే ఇది మామిడి పండ్ల సీజన్. ఇంకేముంది మార్కెట్ లోకి రకరకాల మామిడి పండ్లు వస్తుంటాయి. అయితే మామిడి పండ్లన్నీ ఒకే రంగులో కనిపిస్తాయి. ఏవి తీయగా ఉంటాయి? ఏవి పుల్లగా ఉంటాయో కనిపెట్టడం కష్టంగా ఉంటుంది. కానీ కొన్ని సింపుల్ చిట్కాలతో మీరు తీయని మామిడి పండ్లను గుర్తించి కొనొచ్చు. 
 

Image: Getty

ఒక్క ఎండాకాలంలోనే మామిడి పండ్లు దొరుకుతాయి. అందుకే రెగ్యులర్ గా మామిడి పండ్లను తింటుంటారు. అయితే కొన్ని కొన్ని సార్లు మనం కొనే మామిడి పండ్లు తీయగా కాకుండా పుల్లగా ఉంటాయి. సాధారణంగా మామిడి పండ్లన్నీ ఒకే రంగులో కనిపిస్తాయి. కాబట్టి తీయని మామిడి పండ్లను గుర్తించడం కష్టంగా ఉంటుంది. అయితే కొన్ని ట్రిక్స్ తో మీరు తీయని, నాణ్యమైన , కమ్మని మామిడి పండ్లను గుర్తించొచ్చు. 
 

Image: Getty

మామిడి పండ్లను ఇలా తాకండి

మార్కెట్ లో రకరకాల మామిడి ఉంటాయి. ఇవి చూడటానికి అందంగా కనిపిస్తాయి. చాలా మంది కంటికి నచ్చితే చాలు వాటిని తాకకుండానే కొంటుంటారు. కానీ మామిడి పండ్లను ముట్టుకున్నాకే కొనాలి. మామిడి పండ్లు తేలికగా, మెత్తగా ఉంటే.. అవి తీయగా ఉన్నాయని అర్థం. అందుకే మామిడి పండ్లను కొనే ముందు వాటిని ఖచ్చితంగా ముట్టుకుని చూడండి. 
 

Latest Videos


Image: Getty Images

ఈ విషయాన్ని గుర్తుంచుకోండి

మామిడి పండ్లను కొనేముందు వాటిని చేతితో ఖచ్చితంగా పట్టుకోండి. అయితే మీరు కొనే మామిడి పండ్లను చేతిలో పట్టుకునేటప్పుడు మరీ మెత్తగా అనిపిస్తే పక్కన పెట్టండి. మామిడి పండ్లు పాడైనప్పుడు మాత్రమే మెత్తగా అవుతాయి. 

Image: Getty Images

రంగు చూడండి

మార్కెట్ లో మామిడి పండ్లను కొనేటప్పుడు వాటి రంగును ఖచ్చితంగా చూడండి. మీరు కొనే మామిడి పండ్లు ముదురు పసుపు రంగులో ఉండేట్టు చూసుకోండి. ఇలాంటి మామిడి పండ్లు తీయగా ఉంటాయి. 
 

mango

వాసన చూడండి

మామిడి పండ్లను కొనడానికి ముందు వాటిని తాకడంతో పాటుగా వాటి వాసన కూడా ఖచ్చితంగా చూడండి. తీయగా ఉండే మామిడి పండ్లు మంచి వాసన వస్తాయి. పుల్లగా ఉండే మామిడి పండ్ల వాసన ఇలా ఉండదు. 
 

Mangoes

ఇలాంటి మామిడి పండ్లను కొనొద్దు

మామిడి పండ్ల వాసన.. కెమికల్స్, ఆల్కహాల్, మందుల వాసనలా వస్తుంటే అస్సలు కొనకండి. ఇలాంటి మామిడి పండ్లను తింటే మీ ఆరోగ్యం దెబ్బతింటుంది. మార్కెట్ లో మీకు పూర్తిగా ఫ్రెష్ గా కనిపించే మామిడి పండ్లనే కొనండి. ఫ్రెష్ మామిడి పండ్లపై ఎలాంటి గీతలు లేదా ముడతలు ఉండవు. అలాగే తీయని, మంచి నాణ్యమైన మామిడి పండ్లను కొనడానికి, వాటి ఆకారంపై కూడా శ్రద్ధ వహించండి. కొద్దిగా గుండ్రని ఆకారంలో ఉండే మామిడి పండ్లు తీయగా ఉంటాయి. 

click me!