తుమ్మినప్పుడు యూరిన్ పడిపోతోందా..? ఇలా చేస్తే ఆ సమస్య ఉండదు..!

First Published May 2, 2024, 10:51 AM IST

అలాంటి సమయంలో మనకు తుమ్ము, దగ్గు వచ్చినప్పుడు ముత్రాశయం మీద ఒత్తిడి పడేలా చేస్తుంది. అప్పుడు మనం కంట్రోల్ చేసుకోలేని విధంగా మూత్రం పడిపోతూ ఉంటుంది.

తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు  చాలా మందికి యూరిన్ తెలీకుండానే పడిపోతూ ఉంటుంది. ఆపుకుందామని ఎంత ప్రయత్నించినా కూడా ఆగదు. అసలు దానిని ఆపుకోవాలనే ఆలోచన వచ్చేంతలోనే పడిపోతుంది. ఈ సమస్యతో చాలా మంది బాధపడపుతూనే ఉంటారు. ఇలాంటి సమస్య ఉందని చాలా మంది చెప్పుకోవడానికి కూడా సంకోచిస్తూ ఉంటారు.  పెల్విక్ మజిల్స్ సరిగా పని చేయని  సమయంలో ఇలా జరుగుతూ ఉంటుంది.  మరి ఈ సమస్యకు పరిష్కారమే లేదా అంటే.. కచ్చితంగా ఉంది. మనం ఇంట్లోనే ఈ సమస్యను పరిష్కరించవచ్చు.
 

పెల్విక్ ఫ్లోర్ కండరాల బలం మూత్రం, మలాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది. అంతేకాదు లైంగిక ఆరోగ్యానికి కూడా ముఖ్యమైనది. కానీ గర్భం దాల్చినప్పుడు, డెలివరీ సమయంలో, ప్రొస్టేట్ క్యాన్సర్ చికిత్స, ఉబకాయం, మలబద్దకం కారణంగా పెల్విక్ ఫ్లోర్ కండరాలు బలహీనంగా మారడం ప్రారంభిస్తాయి. అలాంటి సమయంలో మనకు తుమ్ము, దగ్గు వచ్చినప్పుడు ముత్రాశయం మీద ఒత్తిడి పడేలా చేస్తుంది. అప్పుడు మనం కంట్రోల్ చేసుకోలేని విధంగా మూత్రం పడిపోతూ ఉంటుంది.
 

ఈ సమస్య ముఖ్యంగా మహిళల్లోనే ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఈ సమస్య తగ్గని సమయంలో.. మానసిక సమస్యలకు కూడా దారితీస్తుంది.  అయితే... దీని గురించి ఎక్కువగా బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. ఇంట్లోనే కొన్ని యోగాసనాలు వేయడం వల్ల  ఈ యూరిన్ లీకేజ్ సమస్యను తగ్గించవచ్చు. మరి ఎలాంటి యోగాసనాలు మీరు చేయాలో ఇప్పుడు చూద్దాం...
 


1.ఉత్కటాసన..
ఉత్కటాసన యోగా భంగిమను రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేయడం వల్ల మీరు ఈ యూరిన్ లీకేజీ సమస్య నుంచి బయటపడతారు.  దీనినే కుర్చీ భంగిమ అని కూడా పిలుస్తారు. ఈ ఆసనం వేయడం వల్ల  పెల్విక్ కండరాలు బలంగా మారతాయి. అంతేకాకుండా..  పొట్ట, గుండెలకు కూడా మేలు చేస్తుంది. మీకు ఉన్న ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది.


2.సేతు బంధాసన పద్ధతి..

ఈ సేతు బంధాసన యోగా భంగిమను బ్రిడ్జ్ పోస్ అని కూడా పిలుస్తారు. దీని వల్ల కూడా పెల్విక్ కండరాలు బలపడతాయి. మూత్రం లీకేజీ సమస్యను కంట్రోల్ చేస్తుంది. దీని వల్ల మీ వీపు, తుంటి కండరాలు కూడా బలపడతాయి. ఒత్తిడిని తగ్గిస్తుంది. మెదడును ప్రశాంత పరుస్తుంది. పీరియడ్స్ కి సంబంధించిన సమస్యలను తగ్గించడానికి సహాయపడుతుంది. కడుపు సంబంధిత సమస్యలను కూడా దూరం చేస్తుంది. ఈ ఆసనం వేయడం వల్ల మన శరీరంలో రక్త ప్రసరణ వ్యవస్థ ఎంతో మెరుగ్గా ఉంటుంది. ఈ ఆసనం వేయడం వల్ల మనలో ఉన్నటువంటి ఆత్రుత, టెన్షన్, ఆందోళన పూర్తిగా తగ్గిపోవడమేకాకుండా కాళ్లు వెనుకభాగం మరింత చక్కగా సాగి ప్రశాంతమైన నిద్రను కూడా కలిగిస్తుంది. మానసిక ఒత్తిడిని తగ్గించడంలో బ్రిడ్జి పోజ్ ఆసనం ఎంతో కీలకమైనది.


3.నౌకాసన పద్ధతి..
నౌకాసన  యోగా భంగిమను  బోట్ పోస్ అని కూడా పిలుస్తారు. దీని వల్ల కూడా.. మీ మూత్రం లీకేజ్ సమస్య తగ్గుతుంది. మీ పొట్ట, నడుము దగ్గర కొవ్వును తగ్గిస్తుంది. వెన్నుముక బలంగా తయారౌతుంది. జీర్ణ వ్యవస్థను బలపరుస్తుంది. మలబద్దక సమస్య తగ్గుతుంది.  ఒత్తిడి తగ్గుతుంది. కాళ్ల కండరాలు బలపడతాయి.

click me!