బాత్రూం అందాన్ని పెంచే మొక్కలు ఇవే.. ట్రై చేయండి..

First Published Apr 23, 2021, 4:45 PM IST

బాత్రూంలోని తేమకు, తక్కువ కాంతి, ఎండలేని ప్రాంతానికి సూటయ్యే మొక్కల్ని ఎంచుకుంటే.. మీరు బాత్రూంలో గడిపే క్షణాల్ని కూడా పచ్చదనంతో నింపేయచ్చు. 

పచ్చందనమే పచ్చదనమే.. తొలి తొలి వలపే పచ్చదనమే. పచ్చిక నవ్వుల పచ్చదనమే.. ఇలా పచ్చదనం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇంట్లో ఓ మొక్క ఉంటే ఆ ఇల్లు అందమే మారిపోతుంది.
undefined
ఇంట్లో పాజిటివ్ వైబ్స్ వచ్చేస్తాయి. ఆ పచ్చటి మొక్కల్ని చూసినప్పుడు మనసు తేలికవుతుంది. ప్రశాంతంగా మారిపోతుంది. చికాకు మూడ్ సరి అవుతుంది.
undefined
అందుకే ప్రతీ ఇంట్లోనూ ఓ చక్కటి మొక్క ఒకటి పెంచుకోవాలని చెబుతారు. అయితే బాత్రూంలో కూడా మొక్కలు పెంచుకోవచ్చు. అదెలా అంటారు. కాస్త కష్టమైన పనే.. బాత్రూంలోని తేమకు, తక్కువ కాంతి, ఎండలేని ప్రాంతానికి సూటయ్యే మొక్కల్ని ఎంచుకుంటే.. మీరు బాత్రూంలో గడిపే క్షణాల్ని కూడా పచ్చదనంతో నింపేయచ్చు.
undefined
అలాంటి కొన్ని మొక్కల గురించి ఇప్పుడు చూద్దాం. ఏ నర్సరీలోనైనా ఈ మొక్కలు దొరుకుతాయి.
undefined
పోథోస్.. మనీ ప్లాంట్ మొక్క.. దీన్ని ఎక్కడైనా పెంచుకోవచ్చు. ఒక మూలలో వేలాడదీయవచ్చు.. ప్యాకెట్ లో పెంచచ్చు, వాష్‌బేసిన్ కౌంటర్ ల మీద కుండీల్లో గానీ, గాజు జార్స్ లో గానీ పెట్టుకోవచ్చు. ఇవి చాలా త్వరగా పెరుగుతాయి. ఎలాంటి పరిస్తితుల్లోనైనా తట్టుకుని బతుకుతాయి.
undefined
పీస్ లిల్లీ : తేమ ప్రదేశం..తక్కువ కాంతితో ఎటువంటి సమస్య లేని మొక్క. ముదురు ఆకుపచ్చ రంగులో ఉండే ఈ మొక్క తెల్లటి కాడ పుష్ఫాలు పూస్తుంది. ఈ పీస్ లిల్లీ ఉన్న ప్రదేశాన్ని వైబ్రెంట్ గా మార్చేస్తుంది. అంతేకాదు ఈ మొక్క గాలిని కూడా శుద్ధి చేస్తుంది
undefined
పీస్ లిల్లీ : తేమ ప్రదేశం..తక్కువ కాంతితో ఎటువంటి సమస్య లేని మొక్క. ముదురు ఆకుపచ్చ రంగులో ఉండే ఈ మొక్క తెల్లటి కాడ పుష్ఫాలు పూస్తుంది. ఈ పీస్ లిల్లీ ఉన్న ప్రదేశాన్ని వైబ్రెంట్ గా మార్చేస్తుంది. అంతేకాదు ఈ మొక్క గాలిని కూడా శుద్ధి చేస్తుంది
undefined
బోస్టన్ ఫెర్న్ : బాత్రూంలోని తేమను తట్టుకుని బతికే మరొక అద్భుతమైన మొక్క బోస్టన్ ఫెర్న్. దీన్ని కిటికీ దగ్గర లేదా బాత్ టబ్, బాత్రూం ఎంట్రెన్స్ ల దగ్గర ఏర్పాటు చేసుకోవచ్చు.. ఎంతో అందంగా కూడా ఉంటుంది.
undefined
బెగోనియాస్ : రంగురంగుల ఆకులు కలిగిన ఈ మొక్కలను జాగ్రత్తగా చూసుకోవడం చాలా ఈజీ. వీటి అందమైన ఆకులగ అన్ని రకాల వాతావరణ పరిస్థితులను తట్టుకుని పెరుగుతాయి. గదికి మరింత అందంగా మార్చేస్తాయి.
undefined
స్పైడర్ ప్లాంట్ : ఈ మొక్క అస్సలు చనిపోదు. పెంచడం చాలా ఈజీ.. ఎలాంటి వాతావరణ పరిస్థితుల్నేనా తట్టుకుంటుంది. అంతేకాదు గాలిని శుద్ది చేస్తుంది. పెంపుడు జంతువులకు కూడా సురక్షితం. మీ బాత్రూంలో అందంతో పాటు గాలి శుద్దికి బాగా పనిచేస్తుంది.
undefined
కలబంద : అస్సలు చచ్చిపోని మొండిమొక్క. ఎన్నో సుగుణాలు కలిగి ఉంది. జుట్టుకు, మొహానికి, శరీరానికి ఎన్నో ప్రయోజనాలు చేకూరుస్తుంది. అంతేకాదు ఇది ఎడారి మొక్క కాబట్టి పెంచడం సులభం.
undefined
click me!