మహిళల్లో కనిపించే ఈ లక్షణాలు.. థైరాయిడ్ హెచ్చరికలేనట..

First Published Oct 7, 2021, 12:47 PM IST

థైరాయిడ్ గ్రంథి ఒక ముఖ్యమైన హార్మోన్ రెగ్యులేటర్. ప్రపంచవ్యాప్తంగా 8 మంది మహిళలలో ఒకరికి ఈ సమస్య ఉంటుంది. థైరాయిడ్ సమస్యలు ఉన్న 60శాతం మంది మహిళలకు తమకు కనిపించే లక్షణాలు అర్థం కావు. 

ఎప్పుడూ లేంది అలసట, జుట్టు రాలడం, రుతుక్రమంలో ఇబ్బందులు, ఆలస్యంగా రావడం..వణుకు, ఆత్రుత, చెమటలు పట్టడం, తీవ్రమైన ఆకలి ఉంటోందా? అసలేం జరుగుతుందో అర్థం కావడం లేదా? అయితే ఇది థైరాయిడ్ కూడా కావచ్చేమో. 

ఇవి కొన్ని సాధారణంగా అందరిలోనూ కనిపించే లక్షణాలైనప్పటికీ, అన్ని వయసుల వారిలోనూ కనిపించినప్పటికీ.. మీకు థైరాయిడ్ గ్రంథి యాక్టివేట్ అయితే ఈ లక్షణాలు కనిపిస్తాయి. థైరాయిడ్ గ్రంథి ఒక ముఖ్యమైన హార్మోన్ రెగ్యులేటర్. ప్రపంచవ్యాప్తంగా 8 మంది మహిళలలో ఒకరికి ఈ సమస్య ఉంటుంది. థైరాయిడ్ సమస్యలు ఉన్న 60శాతం మంది మహిళలకు తమకు కనిపించే లక్షణాలు అర్థం కావు. 

థైరాయిడ్ ఎలాంటి పాత్ర పోషిస్తుంది?

శరీరంలోని ఇతర అవయవాల మాదిరిగానే, థైరాయిడ్ గ్రంథి పనితీరు సరిగా ఉండడం చాలా కీలకం. థైరాయిడ్ గ్రంథి సీతాకోకచిలుక ఆకారంలో మెడ ప్రాంతంలో ఉంటుంది. ఇది ట్రైయోడోథైరోనిన్ (T3), థైరాక్సిన్ (T4) నుండి ముఖ్యమైన హార్మోన్ల ఉత్పత్తికి బాధ్యత వహిస్తుంది. ఇది బరువు తగ్గడం, జీవక్రియ, శక్తి వంటి కీలక విధులను నియంత్రిస్తుంది. అందుకే చర్మం, జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుకోవడం లేదా మీ శరీర ఉష్ణోగ్రతను ప్రభావితం చేయడంలాంటివి దీని ఆధీనంలో ఉంటాయి. 

థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ (TSH) అనేది T3, T4 స్థాయిలను ఎక్కువగా ఉత్పత్తి చేయమని థైరాయిడ్‌కు మరింత సూచించే మరొక ముఖ్యమైన హార్మోన్. అందుకే, ఈ ముఖ్యమైన హార్మోన్లలో కనిపించే హెచ్చుతగ్గులు శరీరంలో మంటలు పెరగడం లేదా తగ్గడానికి దారి తీస్తుంది. 

అందుకే థైరాయిడ్ హార్మోన్ల స్థాయిల్లో అకస్మాత్తుగా హెచ్చుతగ్గులు వచ్చినప్పుడు అనేక రకాల లక్షణాలు కనిపిస్తాయి. థైరాయిడ్ శరీరంలోని ఇతర అవయవాలను ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా థైరాయిడ్ ఉందని తెలుసుకోకముందు.. లక్షణాలను గుర్తించడం, చెప్పడం కష్టమవుతుంది. అందుకే కొన్ని హెచ్చరిక సంకేతాలు, లక్షణాల విషయంలో మహిళలు శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. వీటివల్ల మీరు హైపర్‌థైరాయిడిజం (ఓవర్‌యాక్టివ్ థైరాయిడ్) లేదా హైపోథైరాయిడిజం (అండరాక్టివ్ థైరాయిడ్) తో బాధపడుతున్నారో లేదో తెలుసుకోవచ్చు. 

సడెన్ గా బరువు తగ్గడం లేదా పెరగడం : థైరాయిడ్ స్థాయిలు మీ మొత్తం జీవక్రియపై భారీ ప్రభావాన్ని చూపుతాయి.  మీ బరువును కూడా అదుపులో ఉంచుతాయి. బరువు తగ్గడానికి లేదా పెరగడానికి చాలా కారణాలు ఉన్నప్పటికీ,  మీ బరువులో అకస్మాత్తుగా లేదా వివరించలేని మార్పులు గమనిస్తే.. ఫస్ట్ మీరు చేయాల్సిన పని మీ థైరాయిడ్‌ని టెస్ట్ చేయించుకోవడం. థైరాయిడ్ హార్మోన్లు తక్కువగా ఉండడం బరువు పెరగడానికి దారితీస్తుండగా, థైరాయిడ్ హార్మోన్లు ఎక్కువగా స్రవించడం.. ఊహించని విధంగా బరువు తగ్గడానికి సాయపడుతుంది. హైపో థైరాయిడిజానికి సంబంధించిన బరువు తగ్గడం అనేది మహిళల్లో కనిపించే అత్యంత సాధారణ మార్పులలో ఒకటి.

మెడ చుట్టూ చర్మం మడతలు నల్లబడటం : థైరాయిడ్  సాధారణ ప్రారంభ లక్షణం మీ మెడ చుట్టూ చర్మం నల్లబడటం. ప్రత్యేకించి, మెడ చుట్టూ చర్మపు మడతలు నల్లబడటం అనేది సాధారణంగా హార్మోన్ల మంట కారణంగా, థైరాయిడ్ పని చేస్తున్నప్పుడు సర్వసాధారణంగా ఉంటుందని పరిశోధనలో తేలింది. ఇది ఒక సంకేతం. అందుకే థైరాయిడ్ అనుమానం రాగానే ముందుగా స్త్రీలు, పురుషులలో ముందుగా ఈ లక్షణం గురించే వెతుకుతారు. 

అంతే కాకుండా, థైరాయిడ్ వల్ల చర్మం, జుట్టు ఆరోగ్యం దెబ్బతింటుంది. T3,  T4 స్థాయిల్లో అంతరాయం కలుగుతుంది.పొడి చర్మం, చర్మం దురద, జిడ్డు చర్మం లేదా గోళ్ళలో పెళుసుదనానికి కారణమవుతుంది.

అలసట, బలహీనత :  తరచుగా శక్తిని కోల్పోయినట్టుగా అనిపించడం, అలసిపోవడం అనేవి వయసు మీద పడడం లేదా రోజువారీ ఒత్తిడి వల్ల కనిపించే లక్షణాలు. అయితే దీర్ఘకాలిక అలసట, శక్తి హీనత అనేవి అంతర్లీనంగా థైరాయిడ్ సమస్యగా కూడా ఉండొచ్చు. థైరాయిడ్ గ్రంథి జీవక్రియ పనితీరును గణనీయంగా ప్రభావితం చేస్తుంది. కాబట్టి,  థైరాయిడ్ గ్రంథి పనిచేయకపోవడం వల్ల జీవక్రియ మందగించడానికి దారితీస్తుంది. దీనివల్ల తరచుగా తొందరగా అలసిపోతారు. నీరసంగా తయారవుతారు. అలాగే, థైరాయిడ్ గ్రంథి అతిగా పనిచేయడం వల్ల జీవక్రియ పనితీరు శక్తివంతంగా మారి మంటకు కారణమవుతుంది. శక్తి నష్టపోవడానికి కారణమవుతుంది. థైరాయిడ్‌తో సంబంధం ఉన్న అలసట, బలహీనత కూడా గుండె దడ, కండరాల బలహీనత, వణుకుకు కారణమవుతాయి.

నిద్రపట్టడంలో ఇబ్బందులు : థైరాయిడ్ సమస్యను గుర్తించడానికి మరో సంకేతం- నిద్ర పట్టడంలో సమస్యలు. థైరాయిడ్ గ్రంథి పనిచేయకపోవడం మీ నిద్రను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. రాత్రిపూట నిద్రలో ఇబ్బందులు.. ఇది చివరికి పగటి నిద్రకు కూడా దారితీస్తుంది. అలాగే అతి చురుకైన, అధిక ఫంక్షనల్ థైరాయిడ్ మీ మానసిక స్థితి, నాడీ వ్యవస్థ, అలసట, కండరాల బలహీనతను ప్రభావితం చేస్తుంది. దీంతోపాటు ఇతర లక్షణాలుగా రాత్రిపూట చెమటలు పట్టడం, తరచుగా మూత్రవిసర్జనకు దారితీస్తుంది. 

ఆందోళన, భయం, మెదడులో గందరగోళం : మానసిక ఆరోగ్యం బలహీనపడటం లేదా దిగజారడంలాంటివి ఏవైనా లక్షణాలను ఎప్పుడూ తేలికగా తీసుకోకూడదు.  థైరాయిడ్‌తో బాధపడుతున్న మహిళలు ఆందోళన సమస్యలు, భయం, వణుకు, చిరాకు, తీవ్రమైన మానసిక కల్లోలాలు అలాగే మెదడులో ఫాగ్ లాంటి లక్షణాలను ఎదుర్కొనే ప్రమాదం ఎక్కువగా ఉందని చెబుతున్నారు. హైపోథైరాయిడిజం మరిన్ని లక్షణాలు జ్ఞాపకశక్తి కోల్పోవడం, ఏకాగ్రత స్థాయిలు తగ్గడం, రోజువారీ కార్యకలాపాలు, నిత్యకృత్యాలను నిర్వర్తించడంలో శక్తి చాలకపోవడం కనిపిస్తాయి. థైరాయిడ్ నిర్ధారణ లేదా చికిత్స ఆలస్యం అయితే మరింత ఆందోళన సమస్యలు కూడా సంభవించవచ్చు.

రుతుక్రమంలో ఇబ్బందులు : మహిళల్లో, రుతుచక్రంలో మార్పులు లేదా ఆలస్యంగానో, తొందరగానో రావడం.. ఏవైనా ప్రధానంగా పిసిఒఎస్ లేదా వంధ్యత్వ సమస్యల హెచ్చరికలుగా చూస్తారు. అయితే, ఇది అన్ని వేళలా అదే కాకపోవచ్చు... థైరాయిడ్ పునరుత్పత్తి వ్యవస్థను నేరుగా నియంత్రిస్తుంది కాబట్టి, థైరాయిడ్ స్థాయిల్లో హెచ్చుతగ్గులు సాధారణ రుతుచక్రాన్ని ఇబ్బందుల్లో పడేస్తుంది.  థైరాయిడ్ హార్మోన్ల స్థాయిలు చాలా తక్కువ లేదా అధిక స్థాయిలో ఉంటే, పీరియడ్స్ తేలికగా, భారీగా లేదా తక్కువగా ఉండవచ్చు, 35 ఏళ్లు పైబడిన వారు చాలా కాలం పాటు పీరియడ్స్ రాకుండా ఉండొచ్చు. మెనోపాజ్‌ను కారణం కావచ్చు. 

click me!