ప్రతీ ఒక్కరిలోనూ మంచీ-చెడులు ఉన్నట్టుగానే చీకటి కోణాలూ, రహస్యాలు ఉంటాయి. అవి వారి స్వభావంలో భాగమై ఉంటాయి. సందర్భం వచ్చినప్పుడు బయటపడుతూ సదరు వ్యక్తుల్ని చెడ్డవారిగా, ప్రమాదకారులుగా చిత్రీకరిస్తాయి. కొన్నిసార్లు ఈ లక్షణాల వల్ల అసహ్యకరమైన పరిస్థితుల్లోకి నెట్టబడతారు. ఇరకాటంలో పడతారు. సాధారణంగా కోపం, నిరాశ, దు:ఖం, అపరాధభావన, పరిస్థితులు తలకిందులవ్వడం లాంటి సందర్బాల్లో ఇవి బయటపడుతుంటాయి. వీటిని కనిపెట్టడం ఎలా.. అంటే జ్యోతిష్యశాస్త్రం పన్నెండు రాశుల్లో.. ఈ లక్షణాలు ఎక్కువగా ఉండే కొన్ని రాశుల్ని గుర్తించింది. ఆ రాశులేంటో చూడండి..

మిథునం (Gemini) : మిథున రాశి వారు అన్ని రాశుల వారికంటే అత్యంత సామాజిక రాశి. అంతేకాదు అద్భుతంగా విషయాల్ని తారుమారు చేయడంలో, మానిప్యూలేట్ చేయడంలో కూడా సిద్ధహస్తులు. మనుషులతో ఎలా కనెక్ట్ అవ్వాలో వారికి బాగా తెలుసు. ఎదుటివారిని ఏ విషయాలు భయపెడతాయో..దేవివల్ల వారికి హాని కలుగుతుందో బాగా తెలుసు. దీన్నే వారు అలుసుగా తీసుకుంటారు. ఎదుటివారిపై దాడి చేయడానికి, ఊహించని దెబ్బ కొట్టడానికి దీనిని ఒక అవకాశంగా వారు ఉపయోగించుకుంటారు.
వృశ్చికం (Scorpio) : తమను ఎవరైనా బాధపెడితే.. అలా చేసిన వారిని వీరు ఎప్పటికీ క్షమించరు. వదిలిపెట్టరు. వారిని తమ శత్రువులుగా భావిస్తారు. వారిని శిక్షించడానికి ఎన్నో విధాల ప్రయత్నాలు చేస్తారు. క్లిష్టమైన ప్రణాళికను రూపొందిస్తారు. వీరి ప్లాన్ లో చిక్కుకుని అవతలి వ్యక్తి తీవ్రంగా బాధపడేలా చేస్తారు. తమను బాధించిన వారి పట్ల చాలా దారుణంగా, ప్రమాదకరంగా వ్యవహరిస్తారు.
మీనం (Pisces) : వారు చాలా సున్నితంగా ఉంటారు. తాము వారు ఇష్టపడే వ్యక్తికి ఫిక్స్ అయి ఉంటారు. ఒకవేళ వారు తమ భాగస్వామిని పూర్తిగా నమ్మకపోతే మాత్రం చాలా దారుణంగా మారిపోతుంది. దాడికి దారి తీస్తుంది. ఈ రాశివారు నిరాశకు గురైనప్పుడు, తమకు ఏది నచ్చితే అది చేసి తీరతారు. తాము చేస్తున్న దానివల్ల ఎంత ప్రమాదకరమైనా వారు పట్టించుకోరు. ప్రతీకారం తీర్చుకుంటారు.
మేషం (Aries) : ఆశయం, అధికారం కోసం చాలా తాపత్రయపడతారు. ఈ దాహమే వారిని అజేయంగా నిలుపుతుంది. దీనికోసం వీరు చాలా నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తారు. ఇతరులు నిర్దేశించిన సరిహద్దులకు కట్టుబడి ఉండడం ఇష్టం ఉండదు. ప్రపంచంలోని ప్రతీ విలువైనదీ తమ చేతుల్లోనే ఉండాలని కోరుకుంటారు. దాన్ని పొందడం కోసం ఎంత వరకైనా వెడతారు.
కుంభం (Aquarius) : ఈ రాశివారు తమ భావోద్వేగాలను దాచిపెట్టి, అదుపులో ఉంచుకోగలుగుతారు. అయినప్పటికీ, తమకు ద్రోహం చేసిన వారిని ఒదిలిపెట్టరు. నాశనం చేసేదాకా ఊరుకోరు. ఎదుటివారిని దెబ్బకొట్టే అత్యంత దారుణమైన ప్రణాళికను రూపొందిస్తారు. ఈ సమయంలో వారు చాలా మిస్టీరియస్ గా ఉంటారు.