2023 న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం స్పెషల్ వంటకాలు.. మీకోసం..

First Published Dec 27, 2022, 10:03 AM IST

2022 కి గుడ్ బాయ్ చెప్పేసి.. 2023 కొత్త సంవత్సరానికి వెల్ కమ్ చెప్పేసే టైం వచ్చేసింది. ఇంకేంటి ఈ  సెలబ్రేషన్స్ ను గ్రాండ్ గా చేసుకోవాలనుకుంటున్నారా. అయితే ఈ న్యూ ఇయర్ వేడుకల కోసం రుచికరమైన వంటకాలు ఏం చేయాలో తెలియడం లేదా.. అయితే మీకోసం కొన్ని టేస్టీ టేస్టీ వంటకాలు.. 


ఏ పండగైనా సరే నోరూరించే వంటకాలు లేకుండా సెలబ్రేట్ చేసుకోవడం దాదాపుగా అసాధ్యమేనండి. ఎందుకంటే మనం జరుపుకునే ఏ పండుగకైనా.. స్పెషల్ వంటకాలు ఖచ్చితంగా ఉండాల్సిందే. అందులోనూ న్యూయర్ వేడుకలు మామూలుగా జరగవు. అందుకే పాత సంవత్సరానికి టాటా చెప్తూ.. కొత్త సంవత్సరానికి వెల్ కమ్ చెప్పేయడానికి రుచికరమైన వంటకాలను ఖచ్చితంగా సిద్దం చేయాల్సిందే.  అలాగని ఏదో ఒకటి తింటే మాత్రం హెల్త్ పాడవుతుంది. ఏ పండుగైనా సరే ముందు ఆరోగ్యమే ముఖ్యం. మీరు తయారుచేసుకునే ఏవంటకమైనా సరే పోషకవిలువలు కలిగినదై ఉండాలి. 

ఇలాంటి వాటిలో గింజలు ఒకటి. గింజలు ప్రోటీన్లకు, ఫైబర్ కు గొప్ప వనరులు. గింజల్లో ఎన్నో రకాల విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. ఇవి మన శరీరానికి చాలా అవసరమైన ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలను కూడా అందిస్తాయి. అయితే ఈ గింజలను ఉపయోగించి కొన్ని టేస్టీ టేస్టీ వంటకాలను తయారుచేసేయొచ్చు. అవి కూడా న్యూ ఇయర్ వేడుకల కోసం. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం... 
 

చాక్లెట్ కేక్

కావలసిన పదార్థాలు: పాలు,  2 కప్పుల నీళ్లు,  2 ఖర్జూరాలు

 కేక్ పిండి కోసం.. 1/2 కప్పు నూనె లేదా వెన్న,  1/2 కప్పు చక్కెర,  1 కప్పు పెరుగు,  1/4 కప్పు పాలు, 2 టేబుల్ స్పూన్ల చాక్లెట్ స్ప్రెడ్,  1 కప్పు మైదా (ఆల్ పర్పస్ పిండి), 2 టేబుల్ స్పూన్ల కోకో పౌడర్,  1 టీస్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ల బేకింగ్ సోడా, చిటికెడు ఉప్పు
 

తయారుచేసే విధానం

ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో నూనె , చక్కెర వేసి వాటిని బాగా కలపండి. ఆ తర్వాత దానిలో పెరుగు, పాలు, చాక్లెట్ స్ప్రెడ్ నే వేసి వాటన్నింటినీ బాగా మిక్స్ చేయండి. దీన్ని పక్కన పెట్టేసీ.. ఒక జల్లెడ తీసుకుని పిండిని, కోకో పౌడర్ ను, బేకింగ్ పౌడర్ ను, బేకింగ్ సోడా, ఉప్పును జల్లెడ పట్టండి. వీటిని కూడా పక్కన పెట్టేసేసిన పదార్థాలతో కలపండి. దీనిని మరీ మెత్తగా కాకుండా కలపండి. అతిగా కూడా కలపకూడదు. ఈ పిండి పాక్షిక స్థిరత్వంలో ఉండాలి. ఆ తర్వాత  పార్చ్మెంట్ కాగితాన్ని బేకింగ్ ట్రేలో పరిచి.. పిండిని ట్రేలో పోయండి. దీన్ని 180° C వద్ద 40 నిమిషాలు బేక్ చేయండి. ఇది రెడీ అయిన తర్వాత పైన చాక్లెట్ డస్ట్ ను వేసి వెచ్చగా తినండి. 

కోకోనట్ బాల్స్

కావాల్సిన పదార్థాలు:  50 గ్రా కొబ్బరి తురుము, 1 టేబుల్ స్పూన్ ఆయిల్,  1/2 టేబుల్ స్పూన్ పిస్తా పౌడర్,  70-80 గ్రా Condensed Milk
 

Coconut Balls

తయారీ విధానం

ముందుగా ఒక నాన్ స్టిక్ పాన్ తీసుకుని దానిలో కొబ్బరి తురుము వేసి మెత్తగా అయ్యేంత వరకు వేయించాలి. దీనిలో జనపనార నూనె, పిస్తా పొడి వేసి బాగా కలపండి. ఆ తర్వాత ఘనీభవించిన పాలను దీనిలో పోయండి. పిండి జిగటగా మారేందుకు అన్ని పదార్థాలను వేసి కలపండి. ఈ పిండి కొద్దిగా చల్లబడిన తర్వాత చిన్న చిన్న బాల్స్ గా చేయండి. వీటిని కొబ్బరి డస్ట్ లోవేయండి. వీటిని తినడానికి ముందు చాక్లెట్ సాస్లో డిప్ చేయండి. 

click me!