Italy Prison భాగస్వామితో సెక్స్: భలే ఛాన్స్ కదా..! దాన్ని జైలంటారా.. హోటలా?

ఖైదీల సెక్స్ జీవితం: ఖైదీలైనా మనుషులే కదా.. వారికీ హక్కులుంటాయి. నేరస్థులైనా న్యాయంగా వారికీ గౌరవప్రదమైన జీవితం అందించాలని కోరుతాయి మానవ హక్కుల సంఘాలు. ఆ హక్కులు, గౌరవం ఒక్కో దేశంలో ఒక్కోలా దక్కుతుంది. కానీ వాళ్లకూ కొన్ని ఆశలు ఉంటాయి కదా. ముఖ్యంగా ఏళ్లకొద్దీ జైళ్లలో మగ్గిపోయే ఖైదీలకు సెక్స్ మాటేంటి? అది అర్థం చేసుకుంది ఇటలీ దేశం. ఇక నుండి జైలు ఖైదీలు కూడా తమకు నచ్చిన వ్యక్తితో జైలు లోపలే సన్నిహితంగా గడపవచ్చనే నిబంధన తీసుుకొచ్చింది.

Italy prison intimacy new rules for inmates in telugu
జైళ్లోనే రొమాన్స్

జైలు జీవితం చాలా కఠినమైనది. ఉదయం నుండి రాత్రి వరకు - ప్రతి పనిని భద్రతా గార్డుల పర్యవేక్షణలో చేయాలి. వ్యక్తిగత స్వేచ్ఛ అంటూ ఏమీ ఉండదు. రోజూ ఒకేలా గడుస్తుంది. అయితే ఇప్పుడు జైలు ఖైదీల జీవితంలో పెద్ద మార్పు రానుంది. ఇక నుండి జైలు ఖైదీలు కూడా తమకు నచ్చిన వ్యక్తితో జైలు లోపలే రొమాన్స్ చేయవచ్చు.

Italy prison intimacy new rules for inmates in telugu
రెండు షరతులు

అయితే దీనికి ఖైదీలు రెండు షరతులు పాటించాలి. ఒకటి ప్రియమైన వ్యక్తితో నిర్ణీత గదిలో గడపడానికి తలుపు తెరిచి ఉంచాలి. సన్నిహితంగా గడపడానికి రెండు గంటల సమయం పాటించాలి. దీనికోసం ఇటలీ జైళ్లలో సన్నిహిత గది ప్రారంభించారు. ఆ గదిలో మంచం, దిండు ఉంచారు. గదికి ఆనుకుని ఒక టాయిలెట్ కూడా ఏర్పాటు చేశారు.


ఖైదీల దాంపత్య హక్కు

ఇటలీలో ఖైదీల దాంపత్య హక్కు చట్టంలో కొత్త మార్పు చోటు చేసుకోవడంతో ఈ మార్పులు మొదలయ్యాయి. ఇక నుండి జైలులోనే భార్య లేదా ప్రియురాలితో శృంగారంలో పాల్గొనే హక్కు పురుష ఖైదీలకు ఇస్తున్నారు. అదేవిధంగా మహిళా ఖైదీలు కూడా తమ భర్త లేదా ఇష్టమైన పురుషుడితో జైలులోనే కలవవచ్చు.

న్యాయస్థానం ఆదేశాలతో..

 ఇటలీ ఖైదీలకు ఈ అవకాశాన్ని ఆ దేశ న్యాయస్థానం కల్పించింది. అనుమతి పొందిన ఖైదీలు ఆ గదిలో నిర్ణీత సమయంలో తమ భార్య లేదా భాగస్వామితో గడపవచ్చని న్యాయస్థానం ఆదేశాల్లో పేర్కొంది. జైలులోనే ప్రత్యేక గది ఏర్పాటు చేయాలి. ఇటలీలోని మిలన్ నగరంలోని అంబ్రియా ప్రాంతంలోని టెర్ని అనే జైలులో ప్రత్యేకంగా తయారు చేసిన గదిలో ఓ ఖైదీకి తన భాగస్వామిని కలిసే అవకాశం మొదటిసారి కల్పించినట్లు వార్తా సంస్థలు తెలిపాయి.

గోప్యతా హక్కు

ఈ సందర్భంలో అతిపెద్ద అడ్డంకి గోప్యత హక్కు. శృంగార సమయంలో కూడా తలుపు తెరిచి ఉంచాలని న్యాయస్థానం ఆదేశించింది. ఇది వారి గోప్యతకు భంగం కలిగించినట్టే కదా అని కొందరు వాదిస్తున్నారు.  2024 జనవరిలో వెలువడిన ఈ తీర్పులో, ఖైదీలకు తమ భర్త, భార్య లేదా దీర్ఘకాల భాగస్వామిని ఏకాంతంగా కలిసే హక్కు ఉండాలని న్యాయస్థానం పేర్కొంది. ఆ సమావేశంలో కఠినమైన పర్యవేక్షణ అవసరం లేదు. అయితే, భద్రత దృష్ట్యా తలుపులు మూసివేయడానికి న్యాయస్థానం అనుమతి ఇవ్వలేదు.

యూరప్ ముందంజ

జైలు ఖైదీల దాంపత్య హక్కులను కాాపాడటంలో యూరప్ ముందంజలో ఉంది. ఖండంలోని అనేక దేశాల్లో ఈ అవకాశం కల్పించారు. జాబితాలో ఫ్రాన్స్, జర్మనీ, స్పెయిన్, నెదర్లాండ్స్, స్వీడన్ ఉన్నాయి. ఇప్పుడు ఆ జాబితాలో ఇటలీ పేరు చేరింది.

Latest Videos

vuukle one pixel image
click me!