Rohit Sharma: ఐపీఎల్ లో రోహిత్ శర్మ సూపర్ రికార్డు

Published : May 02, 2025, 12:45 AM IST

Rohit Sharma: రోహిత్ శర్మ రాజస్థాన్ రాయల్స్‌పై అర్ధ సెంచరీతో జట్టుకు మంచి ఆరంభం ఇచ్చాడు. ఈ క్రమంలోనే 6000 పరుగుల మైలురాయిని అధిగమించి కొత్త రికార్డు సృష్టించాడు.

PREV
15
Rohit Sharma: ఐపీఎల్ లో రోహిత్ శర్మ సూపర్  రికార్డు

Rohit Sharma: ఐపీఎల్ 2025 ప్రారంభ మ్యాచ్‌లలో తడబడ్డ హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ తన ఫామ్‌లోకి వచ్చాడు. గత 4 మ్యాచ్‌లలో 3 అర్ధ సెంచరీలు సాధించాడు. రాజస్థాన్ రాయల్స్‌పై 53 పరుగులతో ముంబై ఇండియన్స్‌కు మంచి ఆరంభం ఇచ్చాడు. అతని చక్కని ఇన్నింగ్స్ తో ముంబై జట్టు 217 పరుగుల భారీ స్కోరు చేసింది. 

25

ముంబై ఇండియన్స్‌కు 5 ఐపీఎల్ టైటిళ్లు అందించిన రోహిత్ మరో రికార్డు నెలకొల్పాడు. ముంబై ఇండియన్స్ తరఫున 6000 పరుగులు చేసిన తొలి బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. టీ20 క్రికెట్‌లో ఈ మైలురాయిని అధిగమించిన రెండో ఆటగాడిగా అవతరించాడు. అతనికి ముందు విరాట్ కోహ్లీ 8871 పరుగులతో ఈ జాబితాలో టాప్ లో ఉన్నాడు. ఇప్పుడు హిట్‌మ్యాన్ కూడా అందులో చేరాడు.

35

ఒకే జట్టుకు టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్లు 

  • విరాట్ కోహ్లీ: 8871 (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు)
  • రోహిత్ శర్మ: 6024 (ముంబై ఇండియన్స్)
  • జేమ్స్ విన్స్: 5939 (హాంప్‌షైర్)
  • సురేష్ రైనా: 5528 (చెన్నై సూపర్ కింగ్స్)
  • ఎంఎస్ ధోనీ: 5269 (చెన్నై సూపర్ కింగ్స్)

 

45

ముంబై ఇండియన్స్‌కు రోహిత్ శర్మ ఐపీఎల్ కెరీర్

రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ తరపున 231 మ్యాచ్‌లు ఆడి 6024 పరుగులు చేశాడు. ఇందులో ఛాంపియన్స్ లీగ్ కూడా ఉంది. 2 సెంచరీలు, 39 అర్ధ సెంచరీలు బాదాడు. ఈ మైలురాయిని అధిగమించిన తొలి MI బ్యాట్స్‌మన్ రోహిత్.

 

55

రికార్డు సృష్టించడానికి ముందు రోహిత్‌కు లైఫ్ లైన్

రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్‌లో రోహిత్‌కు ఒక లైఫ్ లైన్ దక్కింది. ఫజల్హక్ ఫाరుఖీ బంతికి LBW అవుట్ ఇచ్చిన అంపైర్ నిర్ణయాన్ని DRS ద్వారా రద్దు చేయించుకున్నాడు. బాల్ ట్రాకింగ్‌లో బంతి లెగ్ స్టంప్ బయట పడుతున్నట్లు తేలింది. దీంతో అంపైర్ నిర్ణయం మార్చుకున్నాడు. రోహిత్ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు.

Read more Photos on
click me!

Recommended Stories