Manakondur: ఎమ్మెల్యే ఆన్ వీల్స్.. మానకొండూర్ ఎమ్మెల్యే వినూత్న కార్యక్రమం

Published : May 02, 2025, 12:01 AM IST
Manakondur: ఎమ్మెల్యే ఆన్ వీల్స్.. మానకొండూర్ ఎమ్మెల్యే వినూత్న కార్యక్రమం

సారాంశం

Manakondur MLA Kavvampally Satyanarayana: మానకొండూర్  ఎమ్మెల్యే డాక్టర్ సత్యనారాయణ ఒక వైద్యుడు. ఆయన వారానికి మూడుసార్లు నియోజకవర్గంలోని గ్రామాలు సందర్శించి ప్రజల సమస్యలు ప్రత్యక్షంగా వింటారు. వాటి ప‌రిష్కారం దిశ‌గా చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. ఇప్పుడు 'ఎమ్మెల్యే ఆన్ వీల్స్' ను ప్రారంభించారు.   

MLA on Wheels rolls out in Manakondur: ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు తెలుసుకుని వాటి ప‌రిష్క‌రించే దిశ‌గా ఎమ్మెల్యే ఆన్ వీల్స్ ప్రారంభ‌మైంది. ఇదేంటి ప్రజా స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం ఎమ్మెల్యే ఆన్ వీల్స్.. కొత్త‌గా ఉందే అని మీకు అనిపించ‌వ‌చ్చు. ప్రజల సమస్యలను వారి ఇంటి ద‌గ్గ‌ర నుంచే విని పరిష్కరించేందుకు మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ "ఎమ్మెల్యే ఆన్ వీల్స్" అనే వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించారు. 

ఈ కొత్త కార్యక్రమాన్ని గురువారం కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని నుస్తులాపూర్ గ్రామంలో అధికారికంగా ప్రారంభించారు. పెద్ద అంబులెన్స్ ఆకారంలో రూపొందించిన ప్రత్యేక వాహనంపై ఆయన ప్రయాణిస్తూ ప్రజల నుండి వారి ఫిర్యాదులను స్వీకరించారు.

డాక్టర్ సత్యనారాయణ స్వయంగా ఒక వైద్యుడు. ఆయన వారానికి మూడుసార్లు నియోజకవర్గంలోని గ్రామాలు సందర్శించి ప్రజల సమస్యలు ప్రత్యక్షంగా వింటారు. వాటి ప‌రిష్కారం కోసం చ‌ర్య‌లు తీసుకుంటారు. ఎమ్మెల్యే ఆన్ వీల్స్ పై ఆయ‌న మాట్లాడుతూ.. "ప్రజల వద్దకు నేరుగా వెళ్లి వారి సమస్యలు విని, వాటిని త్వరితగతిన పరిష్కరించేందుకు అధికారులు కూడా నాతో పాటు వస్తారు" అని అన్నారు.

ఈ ప్రారంభ కార్యక్రమంలో సాతవాహన అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యే సత్యనారాయణ గారి సతీమణి అనురాధ, వివిధ శాఖలకు చెందిన మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.

అలాగే, ప్రజల ఫిర్యాదులను వేగంగా స్వీకరించేందుకు ప్రత్యేకంగా రూపొందించిన మొబైల్ యాప్‌ను కూడా ఆయన ప్రారంభించారు. "ప్రజలు మన కార్యాలయానికి రావాల్సిన అవసరం లేకుండా, వారి ఊర్ల నుంచే ఫిర్యాదులు ఇవ్వగలిగేలా ఈ వాహనం ఏర్పాటుచేశాం" అని మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ పేర్కొన్నారు.

ఈ కార్యక్రమం ప్రజల ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను మరింత పారదర్శకంగా, పెద్ద‌ ఇబ్బందులు రాకుండా  అందించడమే లక్ష్యంగా ప్రారంభించారు.

మానకొండూర్ ప్రజలు సమస్య ఏదైనా నన్ను నేరుగా కలవచ్చు, మీ సమస్యలను పరిష్కరించడంలోనే నాకు నిజమైన ఆనందం ఉంది, ఇపుడు "MLA ఆన్ వీల్స్" యాప్ ద్వారా కూడా సులభంగా మీ సమస్యలను నాకు చెప్పండి నేను వాటిని పరిష్కరిస్తాను అని డా. కవ్వంపల్లి సత్యనారాయణ తెలిపారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఇక తెలంగాణలో 5°C టెంపరేచర్స్.. ఈ ఏడు జిల్లాలకు రెడ్ అలర్ట్
School Holidays : వచ్చే బుధ, గురువారం స్కూళ్లకు సెలవేనా..?