Vaibhav Suryavanshi: భారత జట్టులోకి వైభవ్ సూర్యవంశీ.. సచిన్ రికార్డును బద్దలు కొడతాడా?

Published : May 02, 2025, 12:22 AM IST

Vaibhav Suryavanshi: చిన్న వయసులోనే సునామీ బ్యాటింగ్ తో వైభవ్ సూర్యవంశీ సంచలనం రేపాడు. ఫాస్టెస్ట్ టీ20 సెంచరీ కొట్టిన ఈ యంగెస్ట్ ప్లేయర్ భారత జట్టులో ఎప్పుడు కనిపిస్తాడనేది అందరి ప్రశ్న. ఈ విషయంలో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొడతాడా? 

PREV
15
Vaibhav Suryavanshi: భారత జట్టులోకి వైభవ్ సూర్యవంశీ.. సచిన్ రికార్డును బద్దలు కొడతాడా?

Vaibhav Suryavanshi Team India: ఐపీఎల్ 18వ సీజన్ చాలా ఆసక్తికరంగా సాగుతోంది. చాలా మంది యువ ఆటగాళ్ళు తమ ప్రతిభ చూపించారు. కానీ, అందరికంటే ఎక్కువగా హాట్ టాపిక్ అవుతున్న పేరు వైభవ్ సూర్యవంశీ. 14 ఏళ్ల చిచ్చర పిడుగు కేవలం 35 బంతుల్లోనే సెంచరీ చేసి సంచలనం రేపాడు. గుజరాత్ టైటాన్స్‌పై వైభవ్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో ప్రపంచమంతా అతని బ్యాటింగ్ ప్రత్యేకతపై మాట్లాడుకుంటోంది.

25
Vaibhav Suryavanshi

14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్‌లో రెండో వేగవంతమైన సెంచరీ కొట్టాడు. అలాగే, టీ20 సెంచరీ కొట్టిన యంగెస్ట్ ప్లేయర్ గా ఘనత సాధించాడు. ఐపీఎల్‌లో వేగవంతమైన సెంచరీ చేసిన మొదటి భారతీయ బ్యాట్స్‌మన్ గా నిలిచాడు. ఒకే ఇన్నింగ్స్‌లో 11 సిక్సర్లు కొట్టిన ఇండియన్ ప్లేయర్ గా రికార్డు కొట్టాడు. దీంతో ఇప్పుడు అందరూ ఈ జెన్ బోల్డ్ గురించి మాట్లాడుకుంటున్నారు. భారత జట్టులోకి అతని ఎంట్రీ పై కూడా చర్చ మొదలైంది.

35

వైభవ్ సూర్యవంశీ ఎప్పుడు భారత్ తరపున ఆడతాడు?

వైభవ్ సూర్యవంశీ కోచ్ మనీష్ ఓజా టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ, వైభవ్ త్వరలోనే భారత జట్టులో ఆడవచ్చని అన్నారు. మనీష్ ప్రకారం, రెండేళ్లలో వైభవ్‌కు టీం ఇండియాలో ఆడే అవకాశం వస్తుంది. అతని కలలు నెరవేరడానికి ఎక్కువ సమయం పట్టదని అన్నారు.

45

వైభవ్ అరంగేట్రంపై సంజు శాంసన్ ఏమన్నారు?

యంగ్ బోల్డ్ వైభవ్ సూర్యవంశీ విషయమే అందరూ మాట్లాడుకుంటున్నారు. రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్ కూడా వైభవ్ త్వరలోనే భారత్ తరపున ఆడవచ్చని అన్నారు. అయితే, కోచ్ మనీష్ లాగా సంజు ఎప్పుడు ఆడతాడో చెప్పలేదు. కానీ, భారత జట్టులోకి తప్పకుండా వస్తాడనీ, మంచి ఇన్నింగ్స్ లను చూస్తామని అన్నాడు. 

55

సచిన్ రికార్డ్ బద్దలు కొట్టే అవకాశం వైభవ్‌కు ఉందా?

వైభవ్ సూర్యవంశీ తన తొలి ఐపీఎల్ సీజన్ లోనే దుమ్మురేపే సెంచరీతో అదరగొట్టాడు. దేశవాళీ క్రికెట్ లో కూడా ఇప్పటికే మంచి ఇన్నింగ్స్ లను ఆడాడు. కాబట్టి త్వరలోనే టీం ఇండియా తరపున ఆడవచ్చు. ఒకటి లేదా రెండేళ్లలో అతను మెన్ ఇన్ బ్లూ జెర్సీ వేసుకుంటే, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ రికార్డ్ బద్దలవుతుంది. సచిన్ 16 ఏళ్ల వయసులో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. 15 నవంబర్ 1989న పాకిస్తాన్‌పై అరంగేట్రం చేశాడు. వైభవ్ కు ఇప్పుడు 14 ఏళ్లు. అతనికి రెండేళ్ల సమయం ఉంది. అంతకుముందే అతను భారత జట్టులోకి వచ్చే ఛాన్స్ ఉంది. 

Read more Photos on
click me!

Recommended Stories