అది గుండెపోటా? లేక కార్డియాక్ అరెస్టా? తేడాను ఎలా గుర్తించాలంటే?

First Published May 25, 2023, 2:05 PM IST

ప్రస్తుతం గుండెపోటు కేసులు బాగా పెరిగిపోతున్నాయి. చిన్న వయసు వారు కూడా గుండెపోటుతో చనిపోతున్నారు. అయితే తమకొచ్చింది గుండెపోటా? లేక కార్డియాక్ అరెస్టా అనేది గుర్తించలేకతున్నారు చాలా మంది. మరి వీటి లక్షణాల మధ్య తేడాను ఎలా గుర్తించాలంటే? 
 

ప్రస్తుతం గుండెపోటు కేసులు బాగా పెరిగిపోతున్నాయి. గుండె జబ్బులనే కొరోనరీ ఆర్టరీ డిసీజెస్ అంటారు. కార్డియాక్ అరెస్ట్, గుండెపోటుతో సహా వివిధ హృదయనాళ సమస్యలనే కొరోనరీ ఆర్టరీ వ్యాధులు అంటారు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది చనిపోవడానికి గుండె జబ్బులే ప్రధాన కారణమని సర్వేలు వెళ్లడిస్తున్నాయి. జీవనశైలి మార్పులు, వైద్యంతో గుండె జబ్బులను  తగ్గించుకోవచ్చు. అయితే చాలా మంది కార్డియాక్ అరెస్ట్, గుండెపోటు మధ్య తేడాలను సరిగ్గా గుర్తించకపోతుంటారు. వీటిని ఎలా గుర్తించాలో ఇప్పుడు తెలుసుకుందాం..

హార్ట్ ఎటాక్

గుండె కండరాలకు రక్తాన్ని మోసుకెళ్లే ఒకటి లేదా అంతకంటే ఎక్కువ కొరోనరీ ధమనులు మూసుకుపోయినప్పుడు హార్ట్ ఎటాక్ వస్తుంది. దీనినే మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్ అని కూడా అంటారు. ధమనులు మూసుకుపోవడానికి ప్రధాన  కారణం రక్తం గడ్డకట్టడం. దీనివల్ల గుండెకు రక్తం చేరదు. తగినంత రక్త ప్రవాహం లేకపోవడం వల్ల గుండె కండరాల కణాలు చనిపోతాయి.
 

గుండెపోటు లక్షణాలు చాలానే ఉన్నాయి. అవేంటంటే.. ఛాతీ నొప్పి లేదా అసౌకర్యం, శ్వాస ఆడకపోవడం, చెమట, మైకం, చేయి, భుజం, మెడ, దవడలో విపరీతమైన నొప్పి.  ఈ నొప్పి వెనుకకు కూడా వ్యాపిస్తుంది. గుండెపోటుతో దెబ్బతిన్న ప్రాంతానికి రక్త ప్రవాహం చేరడానికి, గుండె కండరాలకు మరింత నష్టాన్ని నివారించడానికి సత్వర వైద్యం అవసరం. 

కార్డియాక్ అరెస్ట్

కార్డియాక్ అరెస్ట్ అంటే అకస్మత్తుగా గుండె పనితీరు ఆగిపోవడం. ఇది గుండె విద్యుత్ సర్క్యూట్ సరిగ్గా పనిచేయనప్పుడు వస్తుంది. ఇది వెంట్రిక్యులర్ ఫైబ్రిలేషన్ లేదా వెంట్రిక్యులర్ టాచీకార్డియా. ఈ రెండు గుండె లయ సక్రమంగా లేకుండా చేస్తాయి. ఈ అసాధారణ లయ వల్ల గుండె వేగంగా, అస్తవ్యస్తంగా కొట్టుకుంటుంది. దీనివల్ల మీ శరీరం మొత్తానికి కావాల్సిన రక్తాన్ని పంప్ చేయడం మీ గుండెకు కష్టంగా మారుతుంది. 

కార్డియాక్ అరెస్ట్ సాధారణ లక్షణాలు: శాస తీసుకోవడం ఆగిపోవడం, స్పృహ కోల్పోవడం, పల్స్ ఉండకపోవడం. కార్డియాక్ అరెస్ట్ వచ్చిన వారిని వెంటనే హాస్పటల్ కు తీసుకెళ్లాలి. సిపిఆర్ చేయడం, డీఫిబ్రిలేటర్ ఉపయోగించడం వల్ల రోగికి ప్రాణాపాయం తప్పుతుంది. 
 

click me!