ఆయుర్వేద శాస్త్రం ప్రకారం ఇలా నిద్రపోతే చాలా మంచిదట!

First Published Sep 20, 2022, 3:34 PM IST

సాధారణంగా ప్రతి ఒక్క వ్యక్తి ఇష్టపడే వాటిలో నిద్ర ఒకటి. చాలామంది రోజులు ఎక్కువ భాగం నిద్రపోవడానికి ఇష్టపడతారు.
 

రోజుకు 8 గంటలు మోతాదు మించి నిద్రపోవటం వల్ల ఎన్నో సమస్యలు వస్తాయన్న విషయం మనకు తెలిసిందే కానీ నిద్ర వల్ల కూడా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అలాగే మనం పడుకునే పద్ధతులను పట్టి కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు మనకు అందుతాయి. అయితే ఆయుర్వేద శాస్త్రం మనం నిద్ర విషయంలో ఈ పద్ధతులు పాటిస్తే ఎంతో ఆరోగ్యవంతంగా ఉంటారని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
 

ఆయుర్వేద శాస్త్రం నిద్రకు సంబంధించిన ఎన్నో విషయాలను ఉదాహరణగా వివరించారు.ఆయుర్వేద నిపుణులు వేల సంవత్సరాలుగా అధ్యయనం చేసిన అనంతరం నిద్ర గురించి పలు విషయాలను వెల్లడించారు. అయితే ఆయుర్వేద శాస్త్రం ప్రకారం మనిషి రోజుకు ఎన్ని గంటలు నిద్రపోవాలి, నిద్రపోవడానికి ఎలాంటి ప్రణాళికలు వేసుకోవాలి అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం..
 

నిద్ర అనేది రోజువారి ఒత్తిడి ఆందోళనలను తగ్గించి మన మనసుని ఎంతో ప్రశాంతంగా ఉంచడంలో దోహదపడుతుంది. రోజంతా ఎంతో కష్టపడి అలసిపోయి వారు మనశ్శాంతిగా నిద్రపోవటం వల్ల ఆ ఒత్తిడి నుంచి బయటపడవచ్చు.ఈ విధంగా మన శరీరానికి అవసరమైన నిద్ర ఉండటం వల్ల మన శరీరంలో జరిగే ప్రక్రియలు కూడా సక్రమంగా జరగడం వల్ల ఏ విధమైనటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఉంటాయి.

అలాకాకుండా తక్కువ గంటలపాటు నిద్రపోవటం వల్ల మన శరీరంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి. ఇలా రాత్రి సమయంలో ఒక వ్యక్తి సుమారు ఎనిమిది గంటల పాటు నిద్ర పోవాలని ఆయుర్వేద శాస్త్రం తెలియజేస్తుంది. ఇలా 8 గంటల పాటు కచ్చితంగా నిద్రపోయిన వారిలో ఏ విధమైనటువంటి ఒత్తిడి ఆందోళన ఉండదని ఆయుర్వేద నిపుణులు వెల్లడించారు. రాత్రి సమయంలో ఎనిమిది గంటల పాటు నిద్ర పోవాలంటే వీలైనంత వరకు పగలు నిద్ర మానేయాలి.

పగలు నిద్రపోవడం ఆరోగ్యానికి శ్రేయస్కరం కాదని ఆయుర్వేద నిపుణులు తెలియజేస్తున్నారు. పగలు నిద్ర లేకుండా రాత్రి పది గంటలకు నిద్రపోవడం అలవాటుగా చేసుకోవాలి. ఇదే ప్రణాళికను అలవాటు చేసుకుని ప్రతిరోజు 10 గంటలకు నిద్ర పోవడం వల్ల ఎంతో మంచి ఆరోగ్యాన్ని పొందవచ్చని ఆయుర్వేద నిపుణులు తెలియజేశారు.

ఇలా 10 గంటలకు నిద్రపోయి ఉదయం 6 గంటలకు లేచేలా మన శరీరాన్ని అలవాటు చేసుకోవాలని ఆయుర్వేద నిపుణులు తెలియజేస్తున్నారు.ఈ విధంగా మన శరీరానికి అవసరమైనటువంటి నిద్రను అందించినప్పుడే మన శరీరంలోని జీవక్రియలు కూడా సక్రమంగా జరుగుతాయి. ఇలా కాని పక్షంలో ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తడమే కాకుండా మానసికంగా ఆందోళనలు కూడా వెంటాడుతుంటాయి.

click me!