రియాన్‌ పరాగ్‌ అమ్మ అనసూయ అంటూ వీడియో వైరల్‌.. ప్రూఫ్‌ చూపిస్తూ క్లారిటీ ఇచ్చిన రంగమ్మత్త..

Published : May 04, 2024, 07:03 PM IST

అనసూయ మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే `క్రికెటర్ అమ్మ`గా ఆమె వీడియో వైరల్‌ అవుతుండటం ఆశ్చర్యపరుస్తుంది. దీనికి అనసూయ స్పందించింది.   

PREV
17
రియాన్‌ పరాగ్‌ అమ్మ అనసూయ అంటూ వీడియో వైరల్‌.. ప్రూఫ్‌ చూపిస్తూ క్లారిటీ ఇచ్చిన రంగమ్మత్త..

 అనసూయ భరద్వాజ్‌ పేరు సోషల్‌ మీడియాలో తరచూ వినిపిస్తుంది. ఆమె ప్రతి విషయానికి రియాక్ట్ కావడమే అందుకు కారణం. కొన్ని సార్లు ఆమె గ్లామర్‌ ఫోటో షూట్లు చర్చకి దారితీస్తే, మరికొన్ని సార్లు, ఆమె చేసే పోస్ట్ లు వివాదానికి కారణమవుతుంది. సామాజిక అంశాలపై, సినిమాలపై ఆమె చేసే కామెంట్లు, పోస్ట్ లు రచ్చ రచ్చ అవుతుంటాయి. వివాదాలుగా మారుతుంటాయి.  

27

అయితే తాజాగా ఆమె వీడియో వివాదంగా మారింది. సోషల్‌ మీడియాలో దుమారం రేపుతుంది. ఓ నెటిజన్‌ చేసిన పనికి అనసూయ అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆమె ట్రోల్స్ కి కారణమవుతుంది. మొన్న హైదరాబాద్‌ వేదికగా ఐపీఎల్‌ మ్యాచ్‌ జరిగింది. దీనికి అనసూయ వెళ్లింది. తన ఫ్యామిలీతో కలిసి స్టేడియంలో సందడి చేసింది అనసూయ. 
 

37

ఇందులో రాజస్థాన్‌ రాయల్‌కి చెందిన క్రికెటర్‌ రియాన్‌ పరాగ్‌ కొట్టిన బంతికి సిక్స్ పండింది. దీంతో కెమెరాలు వెంటనే పరాగ్‌ అమ్మని చూపిస్తాయి. కానీ ఓ నెటిజన్ రియాన్‌ పరాగ్‌ అమ్మ స్థానంలో అనసూయ వీడియోని చూపించాడు. ఆమె ఆ బంతికి రియాక్ట్ అయిన తీరు హాట్‌గా ఉంది. దీంతో రియాన్‌ పరాగ్‌ అమ్మ స్థానంలో అనసూయ కనిపించింది. మరోవైపు కామెంటీటర్స్ కూడా రియాన్‌ పరాగ్‌ మదర్‌ అని పలుకుతారు. ఆ స్థానంలో అనసూయ వీడియోని పెట్టడంతో పరాగ్‌ అమ్మ అనసూయ అనే మీనింగ్‌ వచ్చింది. 
 

47

ఈ వీడియో సోషల్‌ మీడియాలో రచ్చ చేస్తుంది. ట్విట్టర్‌లో ట్రెండ్‌ అవుతుంది. అయితే ఇది అనసూయ వద్దకు వెళ్లింది. దీంతో ఆమె వెంటనే స్పందించి కౌంటర్‌ ఇచ్చింది. అయితే ఈ సారి ఫైర్‌ కాకుండా కూల్‌గా క్లారిటీ ఇచ్చింది. పరాగ్‌ సిక్స్ కొట్టినప్పుడు ఒరిజినల్‌గా ఉన్న వీడియో క్లిప్‌ ని చూపిస్తూ ఉన్న ట్వీట్‌ని షేర్‌ చేసింది అనసూయ.

57

ఓ నెటిజన్‌ దీనిపై క్లారిటీ ఇవ్వగా, దాన్ని పోస్ట్ చేసిందీ అమ్మడు. ఆ నెటిజన్‌ చెప్పిన దాని ప్రకారం `సిక్స్ కొట్టగానే పరాగ్ అమ్మని చూపిస్తాడు బ్రో, తర్వాత ఇదే రీప్లై లో వస్తుంది. కామెంటీటర్‌ కూడా అదే చెప్పినట్టు తెలిపాడు. కానీ రీప్లైలో మాత్రం అనసూయ వీడియోని చూపించారట. అయితే అనసూయ వీడియో వచ్చినప్పుడు సపోర్టర్‌ అన్న విషయాన్ని ఆ నెటిజన్‌ ప్రస్తావించాడు. 
 

67
Anasuya Bharadwaj

ఇలా మిస్‌ గైడ్‌ చేయడంపై అనసూయ రియాక్ట్ అయ్యింది. `అందుకే అండి సరిగ్గా చూడాలి, సరిగ్గా వినాలి అంటారు పెద్దలు. రియాన్‌ పరాగ్‌ ఎవరు రియాన్‌ పరగా అమ్మ ఎవరు అన్నది తెలుసుకోవాలి, ఏదో ఫూటేజ్‌ దొరికింది కదా అని వేసేయకూడదు. ముందర ఫూటేజ్‌ కూడా చెక్‌ చేసుకోవాలి కదండి, రీచ్‌ కోసం ఏది పడితే అది వేసేయడమే మారండి` అంటూ సున్నిత్తంగా కౌంటర్లు వేసింది అనసూయ. ప్రస్తుతం ఇది వైరల్‌ అవుతుంది. 

77

ఇక అనసూయ టీవీ షోస్‌ మానేసింది. దీంతో ఆడియెన్స్ కి, ఆమె అభిమానులకు కనిపించడం లేదు. అడపాదడపా గ్లామర్‌ ఫోటోలతో మెరుస్తుంది. ఇక ఆమె చివరగా `పెదకాపు`లో మెరిసింది. త్వరలో `పుష్ప2`తో రాబోతుంది. నటిగా సినిమాల పరంగా చాలా గ్యాప్‌ వచ్చింది. దీంతో ఇలా సోషల్‌ మీడియాలో రచ్చ చేస్తూ వార్తల్లో నిలుస్తుండటం విశేషం. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories